కావలసినవి:
నూనె – వేయించడానికి తగినంత
మైదా – 500 గ్రా.
నెయ్యి – ఆరు టేబుల్ స్పూన్లు
ఫిల్లింగ్ కోసం...
కోవా – 500 గ్రా.
ఏలకుల పొడి – అర టీ స్పూన్
బాదంపప్పు – 25 గ్రా.
కిస్‌మిస్ – 25 గ్రా
ఎండు కొబ్బరి తురుము – 25 గ్రా
పంచదార పొడి – 350 గ్రా.
తయారుచేసే విధానం :
►మైదాలో నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి, ముద్ద చేయాలి.
►పలచని తడి క్లాత్‌లో చుట్టి ఉంచాలి. కోవాను చిదిమి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
►కోవా మిశ్రమంలో పంచదార, ఏలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరి తురుము వేసి, కలిపి, రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, చల్లారనివ్వాలి.
►మైదాపిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పూరీలా ఒత్తుకొని, అందులో కోవా మిశ్రమం ఉంచి, చివరలు మూసేయాలి.
►ఇలా గుజియాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత గుజియాలను వేసి, రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి.
నోట్: గుజియాలను తయారు చేయడానికి మార్కెట్‌లో మౌల్డ్‌లు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment