Ganesh Chaturthi Recipes
-
Ganesh Chaturthi Recipes: రవ్వలడ్డు తయారీ విధానం
కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, ఏలకులపొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు. తయారి విధానం: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఏలకులపొడి పాకంలో కలుపుకుంటే తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ. -
Ganesh Chaturthi Recipes: సున్నుండల తయారీ విధానం
కావలసిన పదార్థాలు : మినపప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, యాలకలపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. -
Ganesh Chaturthi Recipes: చిట్టి ముత్యాల లడ్డు తయారీ విధానం
కావలసిన పదార్థాలు శనగపిండి – 2 కప్పులు యాలకులపొడి – 1 టీ స్పూన్ లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు పంచదార – 2 1/2 కప్పులు ఆరెంజ్ కలర్ – చిటికెడు రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత తయారు చేసే విధానం : ►శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. ►మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకుల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి -
Ganesh Chaturthi Recipes: కజ్జికాయలు తయారీ విధానం
కావలసినవి: నూనె – వేయించడానికి తగినంత మైదా – 500 గ్రా. నెయ్యి – ఆరు టేబుల్ స్పూన్లు ఫిల్లింగ్ కోసం... కోవా – 500 గ్రా. ఏలకుల పొడి – అర టీ స్పూన్ బాదంపప్పు – 25 గ్రా. కిస్మిస్ – 25 గ్రా ఎండు కొబ్బరి తురుము – 25 గ్రా పంచదార పొడి – 350 గ్రా. తయారుచేసే విధానం : ►మైదాలో నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి, ముద్ద చేయాలి. ►పలచని తడి క్లాత్లో చుట్టి ఉంచాలి. కోవాను చిదిమి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ►కోవా మిశ్రమంలో పంచదార, ఏలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి తురుము వేసి, కలిపి, రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, చల్లారనివ్వాలి. ►మైదాపిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పూరీలా ఒత్తుకొని, అందులో కోవా మిశ్రమం ఉంచి, చివరలు మూసేయాలి. ►ఇలా గుజియాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత గుజియాలను వేసి, రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. నోట్: గుజియాలను తయారు చేయడానికి మార్కెట్లో మౌల్డ్లు లభిస్తాయి. -
Ganesh Chaturthi Recipes: తీపి ఉండ్రాళ్ల తయారీ విధానం!
Ganesh Chaturthi Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన తీపి ఉండ్రాళ్ల తయారీ విధానం కావలసినవి ►బియ్యంపిండి: 1 కప్పు ►నీళ్ళు: 1 కప్పు ►నెయ్యి: 2 గరిటెలు ►వంట సోడా: చిటికెడు ►ఉప్పు : చిటికెడు ►ఉండ్రాళ్ళలో నింపడానికి ►పచ్చి కొబ్బరి కోరు: 1 కప్పు ►కొబ్బరి పొడి : 1/2 కప్పు ►వేయించిన గసాలు : 1 గరిటెడు ►యాలకుల పొడి : 1/2 చెంచా తయారుచేసే విధానం : ►కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్లో వేడి చెయ్యాలి. ►ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ►ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ►ఉప్పు, నెయ్యి వేసి మరి గిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపు తుండాలి. ►తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. ►పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి చిన్న ఉండను తీసుకుని చిన్న బౌల్లాగా తయారు చేసి అందులో కొబ్బరి పాకాన్ని కొద్దిగా ఉంచి మూసివేసి, గుండ్రంగా ఉండ్రాళ్ళలా చుట్టాలి. ►లేదా మీకిష్టమైన ఆకృతుల్లో చేసి వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి. క్లిక్: Ganesh Chaturthi Recipes: రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి! -
Ganesh Chaturthi Recipes: రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి!
బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైన రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి. రవ్వ పూర్ణాలు కావాల్సిన పదార్థాలు: ►బొంబాయి రవ్వ- 2 కప్పులు ►యాలకుల పొడి- 1 టీస్పూన్ ►కార్న్ఫ్లోర్- 1/4 కప్పులు ►పంచదార- 2 1/2 కప్పులు ►నెయ్యి- 1/2 కప్పు ►మైదాపిండి- 1 1/2 కప్పు ►బియ్యం పిండి- 1/4 కప్పు తయారు చేసే విధానం: ►బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి. ►3 వంతులు ఉడికిన తర్వాత పంచదార, పంచదార యాలకుల పొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. ►మైదా కార్న్ఫ్లోర్, బియ్యం పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకోవాలి. ►చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి. ఇవి కూడా ట్రై చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్ జామూన్ ఇంట్లోనే తయారీ ఇలా! Kalakand Laddu Recipe: దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా!