అమెరికా వినాయక చవితి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. డల్లాస్ ఇర్వింగ్ సిటీ రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో భక్తులు వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ సభ్యులు నిర్వహించిన ఆరు రోజుల వేడుకల్లో నిత్య పూజలతో, భక్తిశ్రద్ధలతో, మండపంలో రోజుకో అలంకరణతో, పిల్లలు పెద్దల ఆటపాటలతో వేదిక కళకళలాడింది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎప్పటిలాగా నిర్వహించే వేలం పాట ఈ ఏడాది సైతం జరిగింది. ఈ వేలం పాటులో లడ్డు ధర రూ.13 లక్షలకు పైగా పలికింది.
పండుగ ఐదవ రోజు బంతి భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిలిచాయి. తెలుగు సంప్రదాయమైన పంచె కట్టుతో ఉత్సవాల్లో పాల్గొన్న నిర్వాహకులు 300మందికి పైగా అన్నదానం చేశారు. చివరి రోజైన నిమజ్జనం రోజు వినాయకుడి ముందు హోలీ, దాండియా ఆడి వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment