![అచ్చం పాదం లాగే ఉందే! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41422106312_625x300.jpg.webp?itok=hZG8314N)
అచ్చం పాదం లాగే ఉందే!
అయాగవా: ఇది అచ్చం భారీ పాదం లాగా ఉందికదా! 30 సెంటీ మీటర్ల పొడవున్న ఈ ముల్లంగి కిలోన్నర బరువుంది. జపాన్‌లోని అయాగవా పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూరగాయల ఎగ్జిబిషన్‌లో ఇది చూపరులను విశేషంగా ఆకర్శిస్తోంది. యుకిహిరో యుకేచి అనే జపాన్ రైతు పొలంలో ఇది కాచింది. దీన్ని అధిక ధరకు విక్రయించి లాభపడుతామని ముందు భావించిన సదరు రైతు చివరకు మనసు మార్చుకొని పట్టణంలో కొనసాగుతున్న కూరగాయల ప్రదర్శనకు తీసుకొచ్చారు.