తమను బాధించే పాదాల నొప్పికి తమ పొట్ట (లోవర్ అబ్డామెన్)లోని కొవ్వు విరుగుడుగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్లాంటార్ ఫేసిౖయెటిస్ వంటి కొన్ని రకాల పాదాల నొప్పికి కారణమయ్యే వ్యాధులకు తమ పొట్టలోని సొంత కొవ్వు కణాలనుంచి తీసిన ‘స్టెమ్ సెల్స్’ను పాదాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు.
దీనివల్ల చాలాకాలం నుంచి బాధిస్తున్న నొప్పి తగ్గడమే కాదు... కేవలం ఆరు నెలల వ్యవధిలోనే వారు మునుపటిలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి ఆట పాటల్లో పాలుపంచుకునేంతగా సమస్య నయమవుతుందని ఈ పరిశోధన వల్ల తేలింది. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది.
శస్త్రచికిత్సే చివరి పరిష్కారంగా ఉన్న కొత్త పాదాల నొప్పులు కూడా ఈ చిన్నపాటి ఇంజెక్షన్ చికిత్సతో తగ్గి΄ోయినట్లుగా ఈ పరిశోధనలో తెలిసివచ్చింది. ఈ పరిశోధన వివరాలు ప్లాస్టిక్ అండ్ రీ–కన్‌స్ట్రక్టివ్ సర్జరీ’ అనే మెడికల్ జర్నల్‌లో నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment