fat mass
-
పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!
తమను బాధించే పాదాల నొప్పికి తమ పొట్ట (లోవర్ అబ్డామెన్)లోని కొవ్వు విరుగుడుగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్లాంటార్ ఫేసిౖయెటిస్ వంటి కొన్ని రకాల పాదాల నొప్పికి కారణమయ్యే వ్యాధులకు తమ పొట్టలోని సొంత కొవ్వు కణాలనుంచి తీసిన ‘స్టెమ్ సెల్స్’ను పాదాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనివల్ల చాలాకాలం నుంచి బాధిస్తున్న నొప్పి తగ్గడమే కాదు... కేవలం ఆరు నెలల వ్యవధిలోనే వారు మునుపటిలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి ఆట పాటల్లో పాలుపంచుకునేంతగా సమస్య నయమవుతుందని ఈ పరిశోధన వల్ల తేలింది. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. శస్త్రచికిత్సే చివరి పరిష్కారంగా ఉన్న కొత్త పాదాల నొప్పులు కూడా ఈ చిన్నపాటి ఇంజెక్షన్ చికిత్సతో తగ్గి΄ోయినట్లుగా ఈ పరిశోధనలో తెలిసివచ్చింది. ఈ పరిశోధన వివరాలు ప్లాస్టిక్ అండ్ రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ’ అనే మెడికల్ జర్నల్‌లో నమోదు చేశారు. (చదవండి: ఎన్ని సౌందర్య సాధనాలు వచ్చినా ఇవే ఎవర్గ్రీన్..!) -
మందు తాగితే ఎందుకు లావెక్కుతారు?
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం సేవించే వారిలో కొందరు అనూహ్యంగా లావెక్కుతుంటారు. అందుకు కారణం మద్యం మత్తులో వారు మస్తుగా తినడమేనని, మద్యంలో కాలరీలు, తీసుకునే ఆహారంలో కాలరీలు ఉండడం వల్ల కాలరీలు ఎక్కువై లావు అవుతారని చెప్పే వైద్యులు.. నమ్మే మందుబాబులు లేకపోలేదు. తాము అతి తక్కువ కాలరీల మద్యం సేవిస్తామని, అతి తక్కువ కాలరీల ఆహారం తీసుకుంటామని, అయినా ఎందుకు లావెక్కుతున్నామని లాజిక్కు ప్రశ్నించే వారు లేకపోలేదు. మద్యం తాగేవారు ఎందుకు లావెక్కుతారో మొదటి సారి శాస్త్రీయ కారణాన్ని కనుగొన్నారు. ‘మద్యం మన శరీరంలో ప్రవేశించగానే దాన్ని ఒక రకమైన విష పదార్థంగా మనలోని కాలేయం గుర్తిస్తుంది. వెంటనే అందులోని కాలరీలను కరగించి దాని అంతు చూడాలని భావించి.. అందుకు ప్రాధాన్యత ఇస్తుంది. మద్యంలో ఒక్క కాలరీని కూడా వదిలేయకుండా అన్ని కాలరీలను కరగించాలని భావించి అందుకు తన శక్తి మేరకు కాలేయం కృషి చేస్తుంది. ఆహారం రూపంలో వచ్చే కాలరీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. పట్టించుకోదు. పర్యవసానంగా మన శరీరంలో ఆహారం తాలూకు కాలరీలు కొవ్వు రూపంలోకి మారి స్థిర పడుతుంది’ అని లండన్‌కు చెందిన డాక్టర్ జో హార్కాంబే, డాక్టర్ సారా బ్రీవర్ చెప్పారు. మద్యంలోని కాలరీలను కరగించడం కూడా మనిషిలోని కాలేయం శక్తి మీద ఆధారపడి ఉంటుందని, మద్యం కాలరీలు మరీ ఎక్కువై, కాలేయం శక్తి అంతగా లేకపోతే మద్యంలోని కాలరీలు కూడా మిగిలి పోతాయని, అలా మిగిలిపోయిన మద్యం కాలరీలు మన శరీరంలోని ‘ఆల్ద్1ఏ1’ అనే ఎంజైమ్ కొవ్వుగా మారుస్తుందని, అలాంటి కొవ్వు సహజంగా శరీరంలోని అంతర్ అవయవాల చుట్టూ చేరుతుందని డాక్టర్ సారా బీవర్ వివరించారు. ఇక ఆహారం ద్వారా వచ్చిన కాలరీలు ప్రధానంగా నడుము చుట్టూ, పొట్ట వద్ద, ఇతర కండరాల వద్ద పేరుకుపోతుందని తెలిపారు. ఇక కాలరీలు లేని మద్యం ఉండదని, కాకపోతే ఎక్కువ, తక్కువ కాలరీలు ఉంటాయని, ఆల్కహాల్ రూపంలో వచ్చే కాలరీలను వెంటనే బర్న్ చేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుందని ‘ది డైట్ ఫిక్స్’ రచయిత అయిన డాక్టర్ హార్కాంబే తెలిపారు. తక్కువ కాలరీల మద్యం, ఆహారం తీసుకోవాలనుకునే వారు తక్కువ కార్బొహైడ్రేట్లను తీసుకోవాలని ఆమె సూచించారు. 100 కాలరీల మద్యం, వంద కాలరీల పాస్తా తీసుకున్నట్లయితే 100 కాలరీల మద్యాన్ని బర్న్ చేసే వరకు కాలేయం పాస్తా జోలికి వెళ్లదని ఆమె చెప్పారు. ఒక్క గ్లాస్ వైన్‌లో 75 గ్రాముల కాలరీలు ఉంటాయని, అది కిలోమీటరు జాగింగ్‌కు సమానమని, ఓ క్యాన్ బీర్లో 136 కాలరీలు ఉంటాయని, అది రెండు కిలోమీటర్ల జాగింగ్‌తో సమానమని, బాటిల్ సోడాలో 177 కాలరీలు ఉంటాయని, అవి రెండున్నర కిలోమీటర్ల జాగింగ్‌తో సమానమని ఆ వైద్యులిద్దరు ఓ లండన్ మీడియా వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. మద్యంతో మరో ప్రమాదం ఉందని కూడా తేల్చి చెప్పారు. రక్తంలో గ్లూకోజ్‌ను మన శరీరంలోని ‘గ్లూకాగాన్’అనే హార్మోన్ నియంత్రిస్తుందని, మద్యం ఎక్కువగా సేవించడం వల్ల శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తి పడిపోతుందని వారు హెచ్చరించారు. -
ముంచిన ‘ఈము’
ఈము కోళ్ల పెంపకం రైతును నిలువునా ముంచేసింది. మాంసం ధరలు పతనమవ్వడం, ఈముకోళ్ల పెంపకంపై పట్టులేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఈము కోడి పిల్లలను తెచ్చి పెంచుకుం టే 18 నెలల్లో అవి పెరిగి పెద్దవై 30 కిలోల బరు వు వస్తాయని, కొవ్వు పదార్థంలేని ఈ మాంసం తినేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని, వీటి పెంపకం ఇప్పటికిప్పుడు చేపడితే అందరికంటే ముందు లాభాలుపొందవ చ్చని ప్రచా రం జరిగింది. దీంతో పలువురు కార్ణటకకు వెళ్లి మూడు కిలోలున్న ఈము కోడి పిల్లలను ఒక్కోదాన్ని రూ.3వేల నుంచి రూ.4 వేల చొప్పున కొనుగోలుచేసి పెంపకాలు చేపట్టారు. కిలో రూ.340 చొప్పున విక్రయిస్తే 30 కిలోలకు రూ.10,200, పది కిలోల నూనె, ఒక్కో గుడ్డు రూ.700 లెక్కన విక్రయించి ఆదాయాలు పొందవచ్చని భావించారు. జరిగింది ఇదీ జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఈముకోళ్ల పెంపకం కేంద్రాలు వెలిశాయి. ప్రారంభంలో కర్ణాటకలోని కైవారం, చిత్తూరు నుంచి పిల్లలనుతెచ్చి పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యా ప్తంగా సుమారు వంద పెంపకం కేంద్రాలు వెలి శాయి. ఇందులో పదివేలకుపైగా ఈము కోళ్లను పెంచారు. రైతులు భారీగా పెట్టుబడులుపెట్టా రు. చాలావరకు ఆశించినట్టుగానే ఫలితాలొచ్చాయి. రైతులు గుడ్లను పొదిగించి పిల్లలను విక్రయిచడంపైనే దృష్టిపెట్టడంతో కోళ్ల సంఖ్య వేలల్లో చేరింది. ఇందులో సరైన ఆహారం లేకపోవడం, వైద్య కారణాలవల్ల సుమారు రెండువేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కథ అడ్డం తిరిగింది. మాంసం విక్రయాలకు ప్రో త్సాహం కొరవడింది. వీటిని కోయాలంటే ప్ర త్యేక శిక్షకులు అవసరం. ఆయిల్ కొనుగోలుదారులెవరో తెలియదు. వీటిని పెంచి మరిన్ని న ష్టాలను భరించలేక రైతులు కోళ్లను అయినకాడి కి విక్రయించి వదిలించుకున్నారు. బి.కొత్తకోట మండలంలోని మల్లూరివారిపల్లెలో రైతు రాఘవరెడ్డి ఈముకోళ్ల ఫారాన్ని ప్రారంభించి నష్టాలకారణంగా మూసివేశాడు. ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. తిరుపతికి చెందిన ఓ రైతు కోటిన్నర నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇలా జిల్లాలో సుమారు రూ.20 కోట్లదాకా నష్టంవాటిల్లినట్టు అంచనా. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరుల్లో దీని మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. కిలో రూ.300కే విక్రయిస్తున్నారు. పెంపకం కేంద్రాలు బి.కొత్తకోట, పలమనేరు, రాగిమానుపెంట, వెంగారెడ్డిగారిపల్లె, ఐరాల, కాణిపాకం తదితర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మేపాలంటే మహా కష్టం ఈము కోళ్లను పెంచిపెద్దవి చేయాలంటే ఎంతోకష్టం. ఒక్కోదానికి రోజుకు రూ.12 విలువైన సోయాబీన్స్, తవుడు, మొక్కజొన్న, మినర ల్స్ కలిగిన ఫీడును అందించాలి. ఒక్కోదానికి ఫీడుకోసం 19 నెలలకు రూ.6,510 వరకు భరిం చాలి. ముందుగానే బస్తాలకొద్దీ ఫీడును కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలి. నష్టం రూ.60 కోట్ల పైమాటే జిల్లాలో ఈముకోళ్ల పెంపకం వల్ల రైతుకు రూ.60 కోట్లమేర నష్టం వాటిల్లింది. పెంపకందార్లు గుడ్లపై దృష్టిపెట్టి, కోళ్లకు సరైన పోషకాహారాలు అందించలేకపోయారు. దీంతో మాంసం రుచీపచీలేకుండా పోయింది. విక్రయాలు తగ్గిపోయాయి. రైతులు చాలావరకు నష్టపోవాల్సి వచ్చింది. -ఎంసీ.నాయుడు, ఈముకోళ్ల పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు కొనసాగిస్తున్నాం ఈముకోళ్ల పెంపకంపై ఎంతో ఊహించాం. ఖర్చుతో కూడుకున్నదైనా పెంపకానికి ముందుకొచ్చాం. అయితే మాంసం ఎవరుకొంటారో, నూనె ఎవరికి విక్రయించాలో తెలియదు. ఇప్పటికే చాలా నష్ట పోయాం. అయినా భవిష్యత్తు ఉంటుందని పెంపకం కొనసాగిస్తున్నాం. -కే.శ్రీనివాసులు, పెంపకందారు, బి.కొత్తకోట