ముంచిన ‘ఈము’ | Emu poultry farmer sank | Sakshi
Sakshi News home page

ముంచిన ‘ఈము’

Published Mon, Nov 11 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

Emu poultry farmer sank

ఈము కోళ్ల పెంపకం రైతును నిలువునా ముంచేసింది. మాంసం ధరలు పతనమవ్వడం, ఈముకోళ్ల పెంపకంపై పట్టులేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా.
 
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఈము కోడి పిల్లలను తెచ్చి పెంచుకుం టే 18 నెలల్లో అవి పెరిగి పెద్దవై 30 కిలోల బరు వు వస్తాయని, కొవ్వు పదార్థంలేని ఈ మాంసం తినేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని, వీటి పెంపకం ఇప్పటికిప్పుడు చేపడితే అందరికంటే ముందు లాభాలుపొందవ చ్చని ప్రచా రం జరిగింది. దీంతో పలువురు కార్ణటకకు వెళ్లి మూడు కిలోలున్న ఈము కోడి పిల్లలను ఒక్కోదాన్ని రూ.3వేల నుంచి రూ.4 వేల చొప్పున కొనుగోలుచేసి పెంపకాలు చేపట్టారు. కిలో రూ.340 చొప్పున విక్రయిస్తే 30 కిలోలకు రూ.10,200, పది కిలోల నూనె, ఒక్కో గుడ్డు రూ.700 లెక్కన విక్రయించి ఆదాయాలు పొందవచ్చని భావించారు.
 
జరిగింది ఇదీ

జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఈముకోళ్ల పెంపకం కేంద్రాలు వెలిశాయి. ప్రారంభంలో కర్ణాటకలోని కైవారం, చిత్తూరు నుంచి పిల్లలనుతెచ్చి పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యా ప్తంగా సుమారు వంద పెంపకం కేంద్రాలు వెలి శాయి. ఇందులో పదివేలకుపైగా ఈము కోళ్లను పెంచారు. రైతులు భారీగా పెట్టుబడులుపెట్టా రు. చాలావరకు ఆశించినట్టుగానే ఫలితాలొచ్చాయి. రైతులు గుడ్లను పొదిగించి పిల్లలను విక్రయిచడంపైనే దృష్టిపెట్టడంతో కోళ్ల సంఖ్య వేలల్లో చేరింది. ఇందులో సరైన ఆహారం లేకపోవడం, వైద్య కారణాలవల్ల సుమారు రెండువేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కథ అడ్డం తిరిగింది.

మాంసం విక్రయాలకు ప్రో త్సాహం కొరవడింది. వీటిని కోయాలంటే ప్ర త్యేక శిక్షకులు అవసరం. ఆయిల్ కొనుగోలుదారులెవరో తెలియదు. వీటిని పెంచి మరిన్ని న ష్టాలను భరించలేక రైతులు కోళ్లను అయినకాడి కి విక్రయించి వదిలించుకున్నారు. బి.కొత్తకోట మండలంలోని మల్లూరివారిపల్లెలో రైతు రాఘవరెడ్డి ఈముకోళ్ల ఫారాన్ని ప్రారంభించి నష్టాలకారణంగా మూసివేశాడు. ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు.

తిరుపతికి చెందిన ఓ రైతు కోటిన్నర నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇలా జిల్లాలో సుమారు రూ.20 కోట్లదాకా నష్టంవాటిల్లినట్టు అంచనా. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరుల్లో దీని మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. కిలో రూ.300కే విక్రయిస్తున్నారు. పెంపకం కేంద్రాలు బి.కొత్తకోట, పలమనేరు, రాగిమానుపెంట, వెంగారెడ్డిగారిపల్లె, ఐరాల, కాణిపాకం తదితర ప్రాంతాలకే పరిమితమయ్యాయి.
 
మేపాలంటే మహా కష్టం
ఈము కోళ్లను పెంచిపెద్దవి చేయాలంటే ఎంతోకష్టం. ఒక్కోదానికి రోజుకు రూ.12 విలువైన సోయాబీన్స్, తవుడు, మొక్కజొన్న, మినర ల్స్ కలిగిన ఫీడును అందించాలి. ఒక్కోదానికి ఫీడుకోసం 19 నెలలకు రూ.6,510 వరకు భరిం చాలి. ముందుగానే బస్తాలకొద్దీ ఫీడును కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
 
 నష్టం రూ.60 కోట్ల పైమాటే
 జిల్లాలో ఈముకోళ్ల పెంపకం వల్ల రైతుకు రూ.60 కోట్లమేర నష్టం వాటిల్లింది. పెంపకందార్లు గుడ్లపై దృష్టిపెట్టి, కోళ్లకు సరైన పోషకాహారాలు అందించలేకపోయారు. దీంతో మాంసం రుచీపచీలేకుండా పోయింది. విక్రయాలు తగ్గిపోయాయి. రైతులు చాలావరకు నష్టపోవాల్సి వచ్చింది.
 -ఎంసీ.నాయుడు, ఈముకోళ్ల పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు
 
 కొనసాగిస్తున్నాం
 ఈముకోళ్ల పెంపకంపై ఎంతో ఊహించాం. ఖర్చుతో కూడుకున్నదైనా పెంపకానికి ముందుకొచ్చాం. అయితే మాంసం ఎవరుకొంటారో, నూనె ఎవరికి విక్రయించాలో తెలియదు. ఇప్పటికే చాలా నష్ట పోయాం. అయినా భవిష్యత్తు ఉంటుందని పెంపకం కొనసాగిస్తున్నాం.
 -కే.శ్రీనివాసులు, పెంపకందారు, బి.కొత్తకోట
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement