
నోటికి రుచిగా ఉండే ఆహారం కాకుండా పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. క్యాలరీలు కూడా అవసరమే. అయితే అవసరమైన దానికన్నా ఎక్కువైతే బరువు పెరుగుతారు. అందువల్ల క్యాల్షియం సమృద్ధిగా, క్యాలరీలు తక్కువగా ఉండే వంటకాలు ఎలా వండుకోవచ్చో చూద్దాం...
ముల్లంగి నాచిన్ రోటీ
కావలసినవి:
►ముల్లంగి తురుము – అరకప్పు
►ముల్లంగి ఆకుల తురుము – అరకప్పు
►రాగి పిండి – అరకప్పు
►గోధుమ పిండి – అరకప్పు
►నువ్వులు – రెండు టీస్పూన్లు
►వేయించిన జీలకర్ర – అరటీస్పూను
►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత
►నూనె – రోటీ వేయించడానికి సరిపడా.
తయారీ:
►నూనె తప్పించి మిగతా వాటన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీ పిండిలా కలిపేసి పదినిమిషాలపాటు నానబెట్టుకోవాలి
►నానిన పిండిని ఉండలు చేసుకుని రోటీల్లా వత్తుకోవాలి
►బాగా వేడెక్కిన పెనం మీద పావు టీస్పూను నూనె వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి
►లైట్ బ్రౌన్ కలర్‌లోకి కాలిన తరువాత వెంటనే సర్వ్ చేసుకోవాలి.
►ఇవి వేడిమీదే బావుంటాయి. చల్లారితే గట్టిబడతాయి.
బొప్పాయి యాపిల్ స్మూతీ
కావలసినవి:
►బొప్పాయి ముక్కలు – రెండు కప్పులు
►గ్రీన్ యాపిల్ ముక్కలు – ఒకటిన్నర కప్పులు
►గింజలు తీసిన ఆరెంజ్ తొనలు – పావు కప్పు
►పెరుగు – కప్పు
►ఐస్ క్యూబ్స్ – ఒకటిన్నర కప్పులు
►వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను.
తయారీ:
►పదార్థాలన్నింటిని మిక్సీజార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
►మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
►లేదంటే రిఫ్రిజిరేటర్‌లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు సర్వ్‌చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Sesame Crusted Chicken: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్!
Beetroot Rice Balls Recipe: బీట్‌రూట్ రైస్ బాల్స్ ఇలా తయారు చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment