నోరూరించే గలౌటీ కబాబ్‌, కోకోనట్‌ బ్రకోలి తయారీ ఇలా.. | How To Make Galouti Kebab Recipe And Coconut Broccoli Recipies | Sakshi
Sakshi News home page

నోరూరించే గలౌటీ కబాబ్‌, కోకోనట్‌ బ్రకోలి తయారీ ఇలా..

Published Thu, Nov 11 2021 2:08 PM | Last Updated on Thu, Nov 11 2021 2:30 PM

How To Make Galouti Kebab Recipe And Coconut Broccoli Recipies - Sakshi

రోటీన్‌కి భిన్నంగా ఈ ప్రత్యేక వంటకాలను కూడా ప్రయత్నించండి.

కోకోనట్‌ బ్రకోలి


కావల్సిన పదార్ధాలు
బ్రకోలి ముక్కలు – రెండున్నర కప్పులు
ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు
ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
స్రింగ్‌ ఆనియన్‌  – ఒకటి
కరివేపాకు – ఒక రెమ్మ
పచ్చిమిర్చి – ఒకటి
జీలకర్ర – పావు టీస్పూను
ఆవాలు – టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను
కారం – టీస్పూను
గరం మసాలా – టీస్పూను
పచ్చికొబ్బరి తురుము – మూడు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా



తయారీ విధానం
►స్టవ్‌ మీద బాణలి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. 
►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్‌  బ్రౌన​ కలర్‌లోకి వచ్చేంతవరకు వేయించాలి. 
►ఇప్పుడు స్ప్రింగ్‌ ఆనియన్‌ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి, బ్రకోలి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. 
►బ్రకోలి మగ్గాక పచ్చికొబ్బరి, కారం, గరం మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు వేగనిస్తే కోకోనట్‌ బ్రకోలి రెడీ.

చదవండి: గుడ్‌న్యూస్‌.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!

గలౌటీ కబాబ్‌

కావల్సిన పదార్ధాలు
మటన్‌  ఖీమా – ఆరకేజీ
బొప్పాయి పేస్టు – మూడు టీస్పూన్లు
జీలకర్ర పొడి – రెండు టీస్పూన్లు
ధనియాల పొడి – టీస్పూను
గరం మసాలా పొడి – టీ స్పూను
ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి)
అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు
మిరియాలపొడి – పావు టీస్పూను
శనగపిండి – రెండు టేబుల్‌ స్పూన్లు
పుదీనా ఆకులు – అరకప్పు
నిమ్మరసం – టీస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నెయ్యి – టీస్పూను
ఆయిల్‌ – వేయించడానికి సరిపడా

తయారీ విధానం
►శుభ్రంగా కడిగిన మటన్‌ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని నిమ్మరసం బొప్పాయి పేస్టు, నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పది నిమిషాలపాటు పక్కనబెట్టుకోవాలి.
►మిక్సీజార్‌లోఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి, పుదీనా, ధనియాలపొడి, గరం మసాల, మిరియాలపొడి వేసి గ్రైండ్‌ చేయాలి. మసాలాలు నలిగిన ►తరువాత మటన్‌ ఖీమా వేసి మిశ్రమం మెత్తగా మారేవరకు గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎనిమిది గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. 
►తరువాత మిశ్రమాన్ని కబాబ్‌లా చేసుకుని కొద్దిగా ఆయిల్‌ వేసి సన్నని మంట మీద  రెండువైపులా బ్రౌన్‌కలర్‌ వచ్చేంతవరకు వేగనిస్తే గలౌటీ కబాబ్‌ రెడీ.

చదవండి: Best Foods For Vitamin C: చిగుళ్లనుంచి రక్తం వస్తుందా? స్ట్రాబెర్రీ పండ్లు, బొప్పాయి.. ఇవి తిన్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement