Delicious Winter Soup Recipes: స్పినాచ్‌ సూప్‌, బ్రకోలి ఆల్మండ్‌ సూప్‌ తయారీ ఇలా.. | How To Make Spinach Soup And Broccoli Almond Soup Recipes | Sakshi
Sakshi News home page

Delicious Winter Soup Recipes: స్పినాచ్‌ సూప్‌, బ్రకోలి ఆల్మండ్‌ సూప్‌ తయారీ ఇలా..

Published Tue, Nov 23 2021 10:29 AM | Last Updated on Tue, Nov 23 2021 10:51 AM

How To Make Spinach Soup And Broccoli Almond Soup Recipes - Sakshi

చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... 

స్పినాచ్‌ సూప్‌ 
కావల్సిన పదార్ధాలు
లేత పాలకూర ఆకులు – రెండు కప్పులు
క్యారెట్‌ – ఒకటి
బంగాళదుంప – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
మిరియాల పొడి – టీస్పూను
ఆయిల్‌ – రెండు టీస్పూన్లు
పంచదార – టీస్పూను
వెజిటేబుల్‌ స్టాక్‌ – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
►ముందుగా క్యారెట్‌ బంగాళ దుంపలను తొక్కతీసి కడిగి, సన్నగా తరుక్కోవాలి. 
►ప్యాన్‌లో రెండు కప్పుల నీళ్లు, క్యారెట్, బంగాళ దుంపల ముక్కలు వేసి మీడియం మంట మీద ఉడికించాలి. 
►ఇవి ఉడికాక ఈ ముక్కలను తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఈ వేడినీటిలో కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. 
►పాలకూర ఉడికిన తరువాత చల్లారనిచ్చి, క్యారెట్, దుంపలతో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. మధ్యలో వెజిటేబుల్‌ స్టాక్‌ వేసి ప్యూరీలా చేసుకోవాలి. 
►ఇప్పుడు ఈ ప్యూరీని వడగట్టి రసం మాత్రమే తీసుకోవాలి. 
►ఇప్పుడు బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్‌ వేసి తరిగిన వెల్లుల్లిని వేసి గోల్డ్‌కలర్‌లోకి మారేవరకు వేయించాలి. 
►తరువాత పంచదార, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. 
►ఇవన్నీ వేగాక వడగట్టిన పాలకూర రసం, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మరిగించాలి. 
►ఈ వేడివేడి సూప్‌లో క్రీమ్‌ లేదా బటర్‌ వేసి సర్వ్‌చేసుకోవాలి. 

బ్రకోలి ఆల్మండ్‌ సూప్‌ 
కావల్సిన పదార్ధాలు
బ్రకోలి – ఒకటి
ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా తరగాలి)
వెల్లుల్లి రెబ్బలు – ఆరు (సన్నగా తరగాలి)
బాదం పప్పులు – పదహారు
ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
బటర్‌ – టీ స్పూను
పాలు – కప్పు
మిరియాల పొడి – టీస్పూను
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
►ముందుగా బ్రకోలిని ముక్కలుగా తరుక్కోవాలి. 
►పాన్‌ వేడెక్కిన తరువాత బటర్, ఆయిల్‌ వేయాలి. 
►బటర్‌ కరిగిన వెంటనే వెల్లుల్లి తరుగు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. 
►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 
►ఇప్పుడు బాదం పప్పులు, బ్రకోలి వేసి రంగు మారేంత వరకు ఉడికించాలి. 
►ఇవన్నీ ఉడికిన తరువాత, చల్లారానిచ్చి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. 
►ఈ పేస్టును మరో పాన్‌లో వేసి నీరంతా ఇగిరేంత వరకు మరిగించాలి. 
►ఇప్పుడు పాలు పోసి మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి,  మిరియాల పొడితో గార్నిష్‌చేసి సర్వ్‌ చేసుకోవాలి. 

చదవండి: Viral Video: డ్యామిట్‌!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement