బ్రకోలి మఫిన్స్ తయారీకి కావల్సినవి:
బ్రకోలి తరుగు – కప్పు; ఎర్రక్యాప్సికం – ఒకటి; క్యారట్ – ఒకటి;
ఉల్లిపాయ – ఒకటి; గుడ్లు – ఎనిమిది; ఛీజ్ – ముప్పావు కప్పు;
ఉప్పు – టీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను;
తయారీ విధానమిలా:
క్యాప్సికం, ఉల్లిపాయ, క్యారట్‌ను సన్నగా తరగాలి ∙పెద్ద గిన్నెలో బ్రకోలి తరుగు, క్యారట్, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలను వేసి చక్కగా కలపాలి.
ఈ ముక్కలను మఫిన్ ట్రేలో సమానంగా వేసుకోవాలి ∙ఇప్పుడు గుడ్లసొనను ఒకగిన్నెలో వేసి, ఉప్పు, మిరియాల పొడి పోసి నురగ వచ్చేంతవరకు కలుపుకోవాలి మఫిన్ ట్రేలో వేసిన బ్రకోలి మిశ్రమంపై గుడ్లసొనను పోసుకోవాలి ∙అన్నింటిలో పోశాక ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే బ్రకోలి మఫిన్స్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment