దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్‌ ట్రై చేయండి! | Devi Navratri Special Recipe: How To Make Dehrori Sweet | Sakshi
Sakshi News home page

దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్‌ ట్రై చేయండి!

Published Fri, Oct 20 2023 7:30 PM | Last Updated on Fri, Oct 20 2023 7:30 PM

Devi Navratri Special Recipe: How To Make Dehrori Sweet - Sakshi

దెహరోరిలు తయారు చేయడానికి కావలసినవి:
బియ్యం – కప్పు
నీళ్లు – పావు కప్పు
పెరుగు – పావు కప్పు
నెయ్యి – అరకప్పు
పంచదార – రెండు కప్పులు
యాలకుల పొడి – రెండు టీస్పూన్లు
బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు – గార్నిష్‌కు సరిపడా. 

తయారీ విధానం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన బియ్యంలో నీటిని తీసేసి సూజీ రవ్వలా బరకగా గ్రైండ్‌ చేయాలి. గ్రైండ్‌ చేసేటప్పుడు నీళ్లు అసలు పోయకూడదు∙ రవ్వలా గ్రైండ్‌ చేసిన బియ్యంలో పెరుగు వేసి చేతులతో బాగా కలపాలి∙ చేతులు వేడెక్కిన తరువాత కలపడం ఆపేసి మూతపెట్టి రాత్రంతా ఉంచేయాలి∙ మరుసటిరోజు పంచదారను గిన్నెలో వేయాలి. పంచదార మునిగేన్ని నీళ్లుపోసి మంట మీద పెట్టాలి∙ సన్నని మంట మీద సిరప్‌ను తయారు చేయాలి∙ పాకం తయారైందనుకున్నప్పుడు యాలకుల పొడి వేసి కలిపి, దించేయాలి∙ ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి చక్కగా కాగనివ్వాలి∙ రాత్రి కలిపి పెట్టుకున్న బియ్యం రవ్వ మిశ్రమాన్ని కుడుముల్లా చేసుకుని నెయ్యిలో డీప్‌ఫ్రై చేయాలి∙ కుడుము రెండువైపులా లైట్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారాక తీసేసి టిష్యూ పేపర్‌ మీద వేయాలి∙ ఐదు నిమిషాల తరువాత టిష్యూపేపర్‌ మీద నుంచి తీసి పంచదార పాకంలో వేయాలి∙ బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌చేసుకోవాలి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టకపోయినా దెహరోరిలు పదిరోజులపాటు రుచిగా ఉంటాయి . 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement