Devi Navaratri
-
టెన్షన్... టెన్షన్..
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగానికి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం ఓ సవాల్ లాంటివి. బందోబస్తు నేపథ్యంలో వీటిని అధికారులు ఫైనల్స్‌గా పిలుస్తుంటారు. ఎలాంటి అపశ్రుతులు, వదంతులు షికార్లు చేయడం తదితరాలు చోటు చేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తుంటారు. అయినప్పటికీ చిన్న చిన్న ఉదంతాలు, టెన్షన్లు మామూలే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దుర్గా నవరాత్రులు పోలీసులకు చెమటలు పట్టించాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మాసబ్‌ట్యాంక్‌ల్లో శుక్ర, శనివారాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పోలీసులు పరుగులు పెట్టారు. నగర వాసులు పూర్తి సంమయనం పాటించడంతో ఏ చిన్న అపశ్రుతి లేకుండా ఈ రెండూ గట్టెక్కాయి. దీంతో పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు. డిప్రెషన్ రోగి నిర్వాకం.. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన దేవీమాత విగ్రహం చేతిని శుక్రవారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఎట్టకేలకు అదే రోజు రాత్రి 8.15 గంటలకు నాగర్ కర్నూలుకు చెందిన కృష్ణయ్యను ఫీల్‌ఖానా చౌరస్తా వద్ద పట్టుకున్నారు. గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సద్దుల బతుకమ్మ పండగ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకలితో ఉన్న కృష్ణయ్య ఆహారం కోసం గ్రౌండ్స్‌లోకి వచ్చాడు. తినేందుకు ఏదైనా దొరుకుతుందేమోనని వెతికే ప్రయత్నాల్లోనే మండపం చిందరవందర కావడంతో పాటు విగ్రహం చేయి ధ్వంసమైందని పోలీసులు తేల్చారు. మండపం వద్ద నిర్వాహకులు ఎవరు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవరించడంతో పోలీసులు వారి పైనా కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో వదంతులు షికారు చేశాయి. వీధికుక్క చేసిన పనికి... మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి మరో కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్త పదార్థాల నుంచి ఓ వీధికుక్క మాంసం ముక్కను నోటితో కరుచుకుని రావడం వీటిలో కనిపించింది. కొద్దిదూరం ఆ ముక్కను అలాగే తీసుకువెళ్లిన శునకం నోటి నుంచి ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయింది. శునకం తిరిగి ఆ ముక్కను తీసుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వీటిని వెంటనే మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఈ అంశంపై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుర్గా నవరాత్రుల్లో పోలీసులకు ఉత్కంఠ -
దుర్గార్తిశమనీ దశదిశలా దసరా
జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.నవదుర్గల ఆరాధనదసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. శమీపూజనవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత– ‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.పూల వేడుక బతుకమ్మ పండుగఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. పన్యాల జగన్నాథదాసు -
ఇంద్రకీలాద్రి పై మూడో రోజుకు చేరిన దసరా మహోత్సవాలు
-
దసరా.. ఆ సరదానే వేరు..!
తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు..రంగురంగుపూల బతుకమ్మలు.. ఇంటింటా పిండి వంటలు.. ఆనందోత్సాహాలతో ఆలింగనాలు..పిల్లల కేరింతలు... పెద్దల పలకరింపులు.. రాత్రుళ్లు దీపాల కాంతులు.. టపాసుల మోతలు ఇవే కదా.. దసరా సంబురాలు..చిన్నపండుగొస్తుందంటే నెల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. . అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ దసరా వచ్చిందంటే.. ఊరూవాడంతా సంబురాలే. పట్నం విడిచి పల్లెకు పోవడానికి రెండు మూడు నెలల ముందే టికెట్స్ బుకింగ్ అయిపోతాయి. షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడతాయి. స్వీట్ షాపుల్లో ఆర్డర్లు పెరిగిపోతాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే పండుగ రోజుల్లో ప్రతి క్షణం మనసుకు సంతోషాన్నిచ్చేదే.తొమ్మిది రోజుల పండుగతొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో.. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో పూజిస్తారు. అమ్మవారి తొమ్మిది రూపాల పేర్లు.. శైల పుత్రి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, మహాలక్ష్మి దేవి, అన్నపూర్ణేశ్వరీ దేవి, లలితా త్రిపుర సుందరీ, మహా సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, శ్రీరాజరాజేశ్వరి దేవి.ఇక పదవ రోజు.. విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దున్నే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. రకరకాల ఆకులు, పండ్లు కూరగాయలు, ధూపదీపనైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేస్తారు.పురాణాల్లో రాక్షస వధ కోసంమహిషాసుర మర్దిని స్తోత్రందసరా రోజున మహిషాసుర మర్దిని దేవిని పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ ‘అయిగిరి నందిని' స్తోత్రం చదివితే కొత్త శక్తి వస్తుంది అంటారు. దసరా రోజునే కాకుండా మిగతా రోజుల్లోనూ ఈ స్తోత్రం చదవొచ్చు. జీవితంలో నిరాశ కలిగినా, అనుకున్న పని చేయలేకపోతున్నా అమ్మవారిని తలచుకుంటే కొత్త శక్తి వస్తుందని చాలామంది నమ్ముతారు.*అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే! గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే! భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే!జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!!*మంచి తరపున పోరాడిన వాళ్లు తమ ఆయుధాలకి పని చెప్పిన సందర్భం ఇదే. కాబట్టి చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయుధపూజ చేస్తారు. రంగురంగుపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఆడపడుచులంతా బతుకమ్మ చుట్టూ చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ ఎంగిలిపూల, అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్న ముద్దల, సద్దుల బతుకమ్మ అంటూ పూజిస్తారు.జమ్మి చెట్టు కథమహాభారతంలోని ఒక కథ కూడా విజయదశమి పండుగ నేపథ్యంగా ఉంది. పాండవులు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, 'తిరిగొచ్చేవరకూ వాటిని చూసుకో” అని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజున తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాళ్లు దశమిరోజున జమ్మిచెట్టు దగ్గరకు తిరిగి రావడం వల్లే దసరా పండుగను జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఆరోజున జమ్మి చెట్టుకి పూజలు కూడా చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాలపిట్టను చూశారు. అందుకని దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగానే ఆయుధపూజ చేస్తారు.దసరా రోజు రావణ సంహారం ఎందుకు ?దసరా రోజున రామాలయాలు రామనామంతో మారుమోగిపోతాయి. ఎందుకంటే రామాయణ నేపథ్యంలో కూడా దసరా గురించి ఒక పురాణ కథ ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపింది దశమిరోజే. రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు. ఇలా చూసినా చెడుపై మంచి గెలవడమే ఉంది. కాబట్టి దసరా రోజున రామున్నిస్మరించుకుంటారు. పెద్ద మైదానాల్లో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. పది తలల రావణుడి బొమ్మను చేసి, దాన్ని బాణాసంచాతో కాలుస్తారు. దసరా తర్వాత 21 రోజులకు దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది కూడా అప్పుడే.విజయదశమి విజయగాథదసరా రోజున ప్రతి ఒక్కరూ మహిషామర్ధిని కథ చెప్పుకుంటారు. మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఇంద్రుడి పదవి కోసం దేవతలతో యుద్ధం చేసి వాళ్లను ఓడిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోకాన్నే కాకుండా విశ్వాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడి బారి నుంచి లోకాన్ని కాపాడాలని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపం ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తే ఒక స్త్రీ రూపమై జన్మిస్తుంది. త్రిమూర్తులతో శివుని శక్తి ముఖంగా, విష్ణువు శక్తి భుజాలు, చేతులుగా, బ్రహ్మ శక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తిగా అవతరిస్తుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశాన్ని.. ఇలా ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ఇచ్చి మహిషాసుర మర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు.ఆ యుద్ధంలో భీకరంగా పోరాడి మహిషాసురుడ్ని మట్టుబెడుతుంది అమ్మవారు. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగా ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమినాడు దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం 'మహిషాసుర మర్దిని' రూపమే. అందుకే దసరా అనగానే దేవీ నవరాత్రి ఉత్సవాలు కళ్లముందుకొచ్చేస్తాయి.అలయ్ బలయ్జమ్మి చెట్టు ఆకుల్ని ‘బంగారం'తో పోలుస్తారు. అందుకని జమ్మి చెట్టుకు మొక్కినాక జమ్మి ఆకుల్ని తెంపి బంధువులకు, స్నేహితులకు ఇస్తారు. అంటే బంగారాన్ని చేతిలో పెట్టి కౌగలించుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం పేరే అలయ్ బలయ్. మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మ, అమ్మమ్మ, మేనత్త, అమ్మ, చిన్నమ్మలే కాదు.. అక్క, చెల్లి, వదినల కాళ్లు కూడా మొక్కుతారు. ఇలాంటి సంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉంది. జమ్మి చెట్టును పూజిస్తూ చదివే స్తోత్రం..శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!! కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామ పూజితా!!ఆయుధ పూజ విశేషంకులవృత్తులు చేసేవాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్నిస్తుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజున దసరా. అందుకే ఆయుధపూజ చేయిస్తారు. బండి, మెషిన్, నాగలి, కొడవలి, పిల్లలకైతే పుస్తకాలు కూడా ఆయుధాలే. ఆయుధపూజ చేయించడం ద్వారా విజయం మనవైపే ఉంటుందని నమ్ముతారు.వంటింటి ఘుమఘుమలుదసరా వస్తుందంటేనే రకరకాల పిండి వంటలు చేయడానికి రెడీ అయిపోతారు. అరిసెలు, అప్పలు, సకినాలు, లడ్డూలు.. ఇలా ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు వండిపెడతారు. వీటితోపాటు అమ్మవారికి రోజుకో వెరైటీలు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు.. దసరా పండుగకు నోరూరించే నాన్‌వెజ్ స్పెషల్స్ అస్సలు మిస్సవ్వరు.(చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ) -
ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు (ఫొటోలు)
-
విజయదశమి కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ
-
దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్ ట్రై చేయండి!
దెహరోరిలు తయారు చేయడానికి కావలసినవి: బియ్యం – కప్పు నీళ్లు – పావు కప్పు పెరుగు – పావు కప్పు నెయ్యి – అరకప్పు పంచదార – రెండు కప్పులు యాలకుల పొడి – రెండు టీస్పూన్లు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన బియ్యంలో నీటిని తీసేసి సూజీ రవ్వలా బరకగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు అసలు పోయకూడదు∙ రవ్వలా గ్రైండ్ చేసిన బియ్యంలో పెరుగు వేసి చేతులతో బాగా కలపాలి∙ చేతులు వేడెక్కిన తరువాత కలపడం ఆపేసి మూతపెట్టి రాత్రంతా ఉంచేయాలి∙ మరుసటిరోజు పంచదారను గిన్నెలో వేయాలి. పంచదార మునిగేన్ని నీళ్లుపోసి మంట మీద పెట్టాలి∙ సన్నని మంట మీద సిరప్‌ను తయారు చేయాలి∙ పాకం తయారైందనుకున్నప్పుడు యాలకుల పొడి వేసి కలిపి, దించేయాలి∙ ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి చక్కగా కాగనివ్వాలి∙ రాత్రి కలిపి పెట్టుకున్న బియ్యం రవ్వ మిశ్రమాన్ని కుడుముల్లా చేసుకుని నెయ్యిలో డీప్‌ఫ్రై చేయాలి∙ కుడుము రెండువైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసేసి టిష్యూ పేపర్ మీద వేయాలి∙ ఐదు నిమిషాల తరువాత టిష్యూపేపర్ మీద నుంచి తీసి పంచదార పాకంలో వేయాలి∙ బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులతో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా దెహరోరిలు పదిరోజులపాటు రుచిగా ఉంటాయి . -
నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నందు ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్‌కు పలు సూచనలు చేశారు. నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తొలిరోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వి తమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలా త్రిపురసుందరీదేవి. -
నవరాత్రుల టైంలో చేసే ఆరోగ్య తాండవం!
నవరాత్రి సందర్భంగా దాండియా ఆడటం సంప్రదాయం. చేతిలో కోలాటం కర్రలతో ఆడటమే ‘దాండియా’. కాని కర్రలు లేకుండా చేసే నృత్యం కూడా గుజరాత్ తోపాటు ఉత్తర భారతంలో అంతే ప్రముఖమైనది. దాని పేరు ‘గర్బ’. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు చేసే ఈ నృత్యం కేవలం పారవశ్య తాండవమే కాదు ఆరోగ్య తాండవం అని కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘గర్బ’ అనే మాట ‘గర్భ’ నుంచి వచ్చింది. స్త్రీ శక్తికి చిహ్నం గర్భధారణం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జీవశక్తికి ప్రాణం పోసే స్త్రీ శక్తిని సూచించేందుకు గుజరాత్ అంతా ‘గర్బ’ నృత్యం చేస్తారు. దాండియా అంత విస్తృతంగానే గర్బ కూడా ఆడతారు. అందులో కర్రలు ఉంటాయి. ఇందులో ఉండవు. కాని గర్బ నృత్యం శరీరానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 9 రోజుల పాటు స్త్రీలు ఈ నృత్యం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. కేలరీల ఖర్చు గంటసేపు గర్బ డాన్స్ చేయడం వల్ల 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాదు, శరీరాంగాలకు ఇందులో గొప్ప వ్యాయామం లభిస్తుంది. ఈ నృత్య భంగిమల వల్ల భుజాలు, మెడ, వీపు, మోకాళ్లు బాగా కదిలి కండరాలన్నీ చైతన్యంలోకి వస్తాయి. సునీల్ బఫ్నా అనే ఆరోగ్య నిపుణుడి ప్రకారం గంట సేపు గర్బ చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఒక ప్రశాంత స్థితి వస్తుంది. గర్బ చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్‌ను విడుదల చేయడమే ఇందుకు కారణం. అదీగాక ఇది బృందంతో చేసే నృత్యం కాబట్టి మనతో పాటు ఒక సమూహం ఉంది అనే భరోసా మనసుకు లభించి మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే నవరాత్రుల సమయంలోనే కాదు సంవత్సరం పొడగునా గర్బా డ్యాన్స్ చేయమని ఫిట్నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. గుండెకు మంచిది గర్బలో ఆధ్యాత్మికత ఉంది. నృత్యం ద్వారా చేసే ఆరాధన కనుక దీనిని చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో చప్పట్లతో, సంగీతానికి తగినట్టుగా లయ కలిగిన కదలికలు ఉంటాయి కనుక అవన్నీ గుండెకు, నృత్య సందర్భంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరుగుతుంది కనుక ఊపిరితిత్తులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్బ ఆధ్యాత్మిక, ఆరోగ్య తాండవం. (చదవండి: అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..) -
దేవీ నవరాత్రులు: మొదటి రోజు నవరాత్రి పూజ ఎలా చేయాలి?
-
బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం
-
గాయత్రీదేవీగా దర్శనమిస్తున్న అమ్మవారు
-
Vijayawada: బాలా త్రిపుర సుందరీదేవికి భక్తుల నీరాజనం
సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొండపై ‘శరన్నవ’ సంబరం కొనసాగుతోంది. ఒకవైపు భక్తుల కోలాహలం, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల సందళ్లతో కృష్ణా తీరం పులకిస్తోంది. దసరా ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. నాలుగు గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రార్చనలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అనధికార వీఐపీల కట్టడికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ టి.కె. రాణా క్యూలైన్లను పలు మార్లు పరిశీలించి, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. టికెట్లు లేకుండా దర్శనానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించవద్దని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవ ఏర్పాట్లు అద్భుతం: స్పీకర్ తమ్మినేని అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు. అనంతరం మీడియాతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లు, టికెట్ల జారీ పక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కొండపై టికెట్లు విక్రయిస్తున్న తీరును పరిశీలించడంతో పాటు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. టికెట్లు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని, రూ. 300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్ మార్గాలలోనే అమ్మవారి దర్శనానికి పంపాలన్నారు. మహా మండపం మీదుగా కొండపైకి ఎవరూ రాకుండా కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పాస్ లేకుండా కార్లను కొండపైకి ఎందుకు అనుమతిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బంది లేకుండా దర్శనం: మంత్రి కొట్టు భక్తుల రద్దీ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వినాయకుడి గుడి, రథం సెంటర్, టోల్గేట్, ఓం టర్నింగ్ వద్ద మంత్రి క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. వినాయకుడి నుంచి కొండపైకి చేరుకునేందుకు 30 నిమిషాలు పడుతుందని పలువురు భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని టికెట్ల కౌంటర్లలో ఆన్లైన్ టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫుట్ స్కానర్ ద్వారా భక్తుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి, అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శనానికి విచ్చేశారని, 60 వేల లడ్డూలను విక్రయించామన్నారు. ఈవో భ్రమరాంబ, స్పెషల్ ఆఫీసర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నయనమనోహరం నగరోత్సవం వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల నగరోత్సవం నయనమనోహరంగా జరిగింది. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం సమీపంలో ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, వేదపండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. తొలుత ఈవో భ్రమరాంబ కొబ్బరికాయ కొట్టి నగరోత్సవాన్ని ప్రారంభించారు. పోలీసులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
హైదరాబాద్‌లో ప్రారంభమైన దేవి నవరాత్రుల సందడి
-
అన్నపూర్ణాదేవిగా భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు చేశారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తిని అన్నపూర్ణగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో పూజలు జరిపి మకర వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ , పార్నంది నర్సింహామూర్తి, పాలకుర్తి నర్సింహమూర్తి, టక్కరసు సత్యం ఆగమార్చన విధులు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి స్నపనమూర్తికి దేవజా క్రమంలో పూజలు నిర్వహించి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. రాత్రి 9 గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహా నీరాజన మంత్రపుష్పము నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం వేళలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇదిలా ఉండగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కేంద్ర సమాచారశాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది కూచన హరినా«థ్, కొత్తపల్లి వెంకటయ్య, అలుగు కృష్ణ, ఆశోక్, చింత శ్యాంసుందర్ పాల్గొన్నారు. కాగా, సోమవారం చంద్ర ఘంటాక్రమంలో పూజలు నిర్వహించి అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు. -
రోడ్లపై ఉత్సవాలు ఆపండి: హైకోర్టు
ముంబై : గణేశ్ ఉత్సవాలు, దేవీ నవరాత్రులు సందర్భంగా రోడ్లపై మందిరాలు నిర్మించే సంస్థలు, వ్యక్తులపై బాంబే హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వీటన్నిటి కీ తాము వ్యతిరేకమని పేర్కొంది. నగరంలోని బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై గణేశ్, నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఆపాలని సూచించింది. వీటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారని ప్రశ్నించింది. మందిరాలు నిర్మించడానికి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని జస్టిస్ వీఎమ్ కనడే, షాలినీ ఫన్సాల్కర్‌ల ధర్మాసనం పేర్కొంది. జగన్నాథ రథయాత్రను ఆపాలంటూ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఐఎస్‌కేసీఓఎన్) దాఖలు చేసిన పిటిషన్, గణేశ్ ఉత్సవాల సందర్భంగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేస్తున్నారన్న పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. లౌడ్ స్పీకర్లు లేకుండా ఉత్సవాలు జరుపుకోవడం కుదరదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. వీటన్నిటికీ తాము వ్యతిరేకమని, నగరంలో ఖాళీ ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. రెండు కేసులపై విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ పిటిషన్ కొట్టివేయం రాష్ట్రంలోని 15 ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోర్టు చెప్పింది. ఎఫ్ఏ ఎంటర్ప్రైజెస్, ఎఫ్ఏ కన్స్ట్రక్షన్స్ సంస్థలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని సదరు సంస్థలు కోర్టును కోరాయి. ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించిందని, కాబట్టి మరో దర్యాప్తు అనవసరమని సంస్థల తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ప్రస్తుత పిటిషన్ రాయగఢ్‌లోని కొంధనే డ్యాంకు సంబంధించినది కాదని,15 డ్యాంలకు సంబంధించిందని కోర్టు చెప్పింది., 2012లో పిటిషన్ దాఖలైందని, విచారణ ఇప్పుడు జరుగుతోందని కోర్టు చెప్పింది. -
దేవీ నవరాత్రుల విశిష్టతలేంటీ ? Part12
-
దేవీ నవరాత్రుల విశిష్టతలేంటీ ? Part1
-
దాదర్‌లో దేవీ నవరాత్రుల సందడి
పండగ ఏర్పాట్లలో మండళ్లు నిమగ్నం దాదర్, న్యూస్‌లైన్ : నగరంలో దేవీ నవరాత్రుల సందడి మొదలైంది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి మండళ్లు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పనుల్లో మండళ్లు నిమగ్నమయ్యాయి. ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. నవరాత్రులు పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. రోజూ అమ్మవారికి విశేష పూజలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనుంది. మాటుంగాలో... మాటుంగా తూర్పులోని తెలంగ్ రోడ్ వద్ద ఉన్న వాసవీ నిలయంలో ది బొంబాయి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యాకా పరమేశ్వరీ ఆలయంలో గురువారం ఉదయం 7 గంటలకు గణపతి పూజ నిర్వహించనున్నారు. కలశ స్థాపనం, వాసవీ హోమములతో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం వరకు జరిగే ఈ ఉత్సవాలలో రోజూ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని లక్ష్మీ, అన్నపూర్ణ, గాయత్రి, లలిత, దుర్గ, సరస్వతి, చండీ, రాజరాజేశ్వరి రూపాలతో అలంకరించి హోమాలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం స్థానిక సంగీత కళాకారులు, భజన మండళ్లుతో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ప్రముఖ సంగీత కళాకారిణులు నల్లాన్ చక్రవర్తల సీతాదేవి బృందం (25వ తేదీ గురువారం), పద్మావతి త్యాగరాజు బృందం (27వ తేదీ), ఆర్.వి.లక్ష్మీమూర్తి బృందం (30 ), పి.సరళా రావు, దుర్గా సూరి బృందం చే సౌందర్యలహరి (01) ల భక్తి సంగీత కచేరీలు ఉంటాయి. డోంబివలిలో... డోంబివలి పశ్చిమం ఎంజీరోడ్ లోని రైల్వే స్టేషన్ సమీపంలో పశ్చిమ విభాగ్ సార్వజనిక్ నవరాత్రోత్సవ మండల్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి విశేష పుష్పాలంకరణం, గణ హోమం, ప్రాణ ప్రతిష్టతోపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రోత్సవ మండల్ సువర్ణ జయంతి పురస్కరించుకొని ఈ సారి విశేష సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. మహారాష్ట్ర పారంపారిక లోక నృత్యాలు, భక్తి గీతాలు, నృత్యాలు, హాస్య సంధ్య, శ్రీ దేవీ మహాత్య యక్షగాన ద్రర్శనలు ఏర్పాటు చేశారు. స్థానిక బాల బాలికలను ప్రోత్సహించేందుకు పాటలు, నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడానికి ఏర్పాటు చేశారు.