టీనేజర్లు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి. ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్‌బాల్, క్రికెట్‌లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని స్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి.
ఫైబర్ ఉండే ఏ ఆహారమైనా బరువు తగ్గిస్తుంది. చిలగడదుంపను తింటే ఇక ఆకలి వెయ్యదు. చాలా సేపు అలాగే ఉంటుంది. కాబట్టి ఇంకేవీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలుంటుంది.
నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది.
రోజులో కనీసం అరగంట యోగా చేయడం మూలంగా, శరీరంలోని అనేక విషతుల్య మలినాలు తొలగుతాయి. ముఖ్యంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు వంటి శ్వాస సంబంధిత ప్రక్రియలు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచగలవు. యోగా ఊపిరితిత్తులను బలపరచడమే కాకుండా, వాటిని శుభ్రపరుస్తుంది. అంతేకాదు, ఒత్తిడికి కూడా దూరంగా ఉండవచ్చు.
చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
Comments
Please login to add a commentAdd a comment