డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో అంతర్భాగం. ప్రతిరోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గుప్పెడు గింజలు ఎన్నో పోషకాలను విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకుంటాం. వీటిని కొన్ని గంటల ముందు నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవ్వడమే గాక శరీరం కూడా ఈజీగా పోషకాలను గ్రహించగలుగుతుంది. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌ని నీరు వర్సెస్ పాలు మధ్య వేటిలో నానబెడితే ఆరోగ్యకరం అనే విషయానికి వస్తే రుచి, ఆహార ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.
డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టడం వల్ల వాటి ఆకృతిని పెరుగడమే గాక మృదువుగా ఉండి తినేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటా నానబెట్టడం వల్ల దానిలోని సహజ చక్కెరలు, రుచులను విడుదలై తినేందుకు రుచిగా ఉంటాయి కూడా. అలాగే నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది సలాడ్‌ల నుంచి డెజర్ట్‌ల వరకు వివిధ వంటకాలలో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది.
నీటిలో నానబెడితే..
నీటిలో నానబెట్టడం వల్ల ఆకృతితోపాటు రచి కూడా పెరుగుతుంది. అదనపు కొవ్వు నివారించాలనుకునే వారికి ఇలా నీటిలో నానబెట్టినవి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదీగాక నీటిలో నానబెట్టడం వల్ల అదనపు కేలరీలు లేదా కొవ్వును జోడించదు. పైగా మనకు వాటి సహజ రుచిని పరిచయం చేస్తుంది. కేలరీ కాన్షియస్ డైట్ అనుసరించాలనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచాలనుకునేవారికి ఈ పద్ధతిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం.
పాలల్లో నానబెడితే..
పాలల్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల వాటికి మంచి విభిన్న ప్రయోజనాలను పొందొచ్చు. పాలు వాటికి మంచి ఆకృతి, రుచిని అందిస్తాయి. ఇక్కడ పాలు, డ్రైఫ్రూట్స్ కలయిక రుచిని మెరుగుపరచడమే గాక ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, వంటి అదనపు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనుకునే వారికి పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వీటిని పిల్లలు, అథ్లెట్లు, నిర్దిష్ట ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏది బెస్ట్ అంటే..
జీర్ణక్రియ ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుంటే..నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్ అసహనం లేదా పాలంటే పడనివారికి ఇలా తీసుకోవడమే మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ కంటే నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ జీర్ణమవ్వడం సులభం. అసౌకర్యాన్ని కలిగించే అవకాశం తక్కువ కూడా. చెప్పాలంటే పాలల్లో నానబెట్టిన వాటిల్లో లాక్టోస్, కొవ్వుల ఉనికి కారణంగా పొట్టలో భారంగా ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు లేనివాళ్లు సమతుల్య ఆహారంలో భాగంగా పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండుద. అంతేగాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహాన్ని నిర్వహించడం తదిర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా డ్రైఫ్రూట్స్‌ని నీళ్లు లేదా పాల్లలో నానబెట్టి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?)
Comments
Please login to add a commentAdd a comment