jagarana deeksha
-
శివరాత్రి జాగరణ: జగడమైనా ఆడుదాం.. జామురాతిరి వరకు గడిపేద్దాం..
ముక్కోటి దేవతలు ఒక ఎత్తు.. శివయ్య ఒక్కడూ ఒకెత్తు.. అందుకే శివయ్య పండగ శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకత.. అన్ని పండగలకూ ఇంట్లోనే పూజలు. మహా అయితే గుళ్లకు పోయి రావడం.. ఇంట్లో రకరకాల వంటలకు చేసుకుని తినడం.. భుక్తాయాసంతో రోజూకన్నా ఓ గంట ముందుగానే పడుకోవడం సర్వసాధారణం. కానీ శివరాత్రి అంటేనే వేరు.. ఆ పండగ చేసుకునే తీరే వేరు.. ఇష్టాను సారం తినడం. గుర్రుపెట్టి నిద్రపోవడం వంటి రెగ్యులర్ ఫార్మాట్ ఈ శివయ్య పండక్కి ఉండదు.. శివరాత్రికి దాదాపుగా ఉపవాసం ఉంటారు.. పండో.. ఫలమో తిని.. పంచామృతం వంటివి సేవించి రోజూకన్నా తక్కువ ఆహారంతో శివయ్యను సేవిస్తారు..అన్నిటికి మించి ఆ ముక్కంటి కోసం కోట్లాదిమంది ప్రజలు ఏకంగా జాగరణ చేయడం ఇందులో ప్రత్యేకత. జాగరణ అంటే ఎలా.. రోజూ తొమ్మిది.. పదింటికి నిద్రపోయే జనాలు తెల్లార్లు నిద్రపోకుండా ఉండడం ఎలా ? వారికి నిద్రను దూరం చేసేది ఎలా ? ఇప్పుడంటే రకరకాల చానెళ్లు.. ఓటీటీలు... టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి కానీ 2000 సంవత్సరం వరకు జాగరణ అంటే అదొక ప్రత్యేక ప్లాన్ .. దానికోసం రెండురోజుల ముందునుంచే ఏర్పాట్లు.. ఉండేవి...పేకాడుకుందాం మామాఇప్పుడంటే ఏదీ వింతకాదు కానీ ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకు జాగరణ అంటే అదో పెద్ద ప్రక్రియ. ఊళ్లలో కొన్ని చోట్ల శివకళ్యాణం .. గంగావివాహం వంటి కథాకాలక్షేపాలు ఉండేవి.. ఇంకొందరు జల్దీ ఫైవ్ .. లేదా పేకాట వంటివాటితో జాగరణ చేసేవాళ్ళు.. జగడం ఆడుతూ అయినా సరే జామురాతిరి వరకైనా జాగరణ చేయాలన్నది సూక్తి.. ఈ మేరకు కొందరు అర్థరాత్రి వరకు ఏదోలా ఓపికపట్టి జాగరణ ఉండేవారు..దానికోసం రకరకాల కార్యక్రమాలు.. కథా కాలక్షేపాలు.. రంగస్థల ప్రోగ్రామ్స్.. వంటివి ఊళ్లలో నిర్వహించేవాళ్ళు.. అది లేనివాళ్లు దగ్గర్లోని శివాలయం వద్ద కూర్చుని భజనలతో గడిపేవాళ్లు... ఆలయాల వద్ద తెల్లార్లు సాంస్కృతిక కాలక్షేపాలు ఉండేవి. కొన్ని పల్లెల్లో గ్రామం మొత్తం చందాలు వేసుకుని 16 ఎంఎం తెరలు కట్టి ఊళ్లలో సినిమాలు వేయించేవాళ్ళు.. కృష్ణ.. శోభన్ బాబు.. ఎన్టీయార్ సినిమాలు ఎక్కువగా ఈ చిన్న స్క్రీన్ మీద వేసి.. గ్రామం మొత్తం జాగరణ చేసేవాళ్ళు.కేబుల్ ఆపరేటర్ కు ఫోన్ కొట్టు.. నచ్చిన సినిమా పెట్టుఆ తరువాతి కాలంలో కేబుల్ టీవీలు వచ్చాయి.. అంటే 1990ల్లో కేబుల్ టీవీలు వచ్చాక జాగరణ తీరు మారింది. కేబుల్ ఆపరేటర్లు తెల్లార్లు తమ కేబుల్ చందాదారులకు సినిమాలు వేసేవాళ్ళు. అందరూ రాత్రి భోజనాలు చేసేశాక తమ టివిల ముందు కూర్చుంటే అయన వరుసగా ఓ నాలుగు సినిమాలు వేసేవాడు.. దీంతో తెల్లారిపోయేది. ఇంటిల్లిపాదీ టివిల ముందు కూర్చుని సినిమా చూస్తూ మధ్యలో నిద్ర వస్తే నాలుగు అడుగులు అటు ఇటు వేసి రావడం.. లేదా మధ్యలో టీ కాపీలు పెట్టుకుని తాగడం.... కొంతమంది అయితే కేబుల్ ఆపరేటరుకు ఫోన్ చేసి ఈ సినిమాలు వేయాలో లిస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. అందులోనూ మళ్ళా రికమెండేషన్లు.. కొంతమందికి మాత్రమే ఆపరేటర్ వద్ద పలుకుబడి ఉండేది.. కాబట్టి ఆ పలుకుబడి ఉన్న పెద్దలతో కేబుల్ ఆపరేటరుకు చెప్పించి.. చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. సినిమాలు వేయించి మెల్లగా జాగరణ పూర్తి చేసేవాళ్ళు.మిడ్ నైట్ సినిమాకు పోదాం మామాపల్లెల్లో జాగరణ చేయడం ఇష్టం లేని యువత మాత్రం నడిచి కొందరు.. సైకిళ్ళ మీద కొందరు దగ్గర్లోని పట్టణాలకు పోయేవాళ్లు. అక్కడ సెకెండ్ షో అయ్యాక అంటే రాత్రి 12 తరువాత ఒక షో సినిమా వేసేవారు. దాన్ని మిడ్ నైట్ షో అనేవారు. అది ముగిసేసరికి దాదాపు మూడు అయ్యేది.. ఒక్కోసారి ఊళ్లలోని టూరింగ్ టాకీసులు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు.. వేసి ప్రేక్షకులను రప్పించేవారు.. పట్టణాల్లోని దాదాపు అన్ని థియేటర్లల్లోనూ ఈ మిడ్ నైట్ షోలు వేసేవాళ్ళు.దీనికి రెండు రోజుల ముందు నుంచే .. పోస్టర్లు.. రిక్షాలో మైక్ పెట్టి ప్రచారం వంటివి చేసేవాళ్ళు.. జాగరణ రోజు ఊళ్లలో తెల్లార్లు టీ స్టాళ్లు నడిచేవి.. తెల్లార్లు సినిమాలు చూసి.. అట్నుంచటే నదీస్నానం చేసి జాతరకు వెళ్ళేవాళ్ళు.. కొందరు జోగుతూ సైకిళ్ళ మీద ఇళ్లకు చేరేవాళ్ళు.. జాతరలో బొమ్మలు.. జీళ్ళు.. ఖజ్జూరం.. సెనగలు.. చేరుకుముక్కలు కొనుక్కుని ఇళ్లకు రావడం ఒక మధురానుభూతి. ఇప్పుడు ఆ జాగరణ తీరు మారింది.. ఎవరింట్లో వాళ్ళు ఓటిటిలు.. బిజీ.. పక్కింటికి వెళ్లి మాట్లాడడం.. వారి ఇంట్లో కూర్చుని పేకాడుకోవడం.. కబుర్లాట అంతా నామోషీ.. ఇప్పుడు ఎవరికీ వారే యమునా తీరు.. ముక్కోటి దేవతలకు మహారాజు అయినా ఈ మనుషులమధ్య దూరాన్ని మాత్రం శివయ్య కూడా తగ్గించలేకపోతున్నాడు.-సిమ్మాదిరప్పన్న -
Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?
మహా శివరాత్రి పర్వదినాన పరమశివుణ్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అభిషేకాలు, ఉపవాసాలు జాగారాలతో భక్తకోటి శివుణ్ని ఆరాధిస్తారు. రోజంతా నిష్టగా ఉవవాసం ఉండి, జాగరణ దీక్ష చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఎంత ఓపిక లేకపోయినా, తన శక్తికొద్దీ ఆ ముక్కంటిని పూజిస్తారు. ఉపవాస దీక్ష ఆచరిస్తారు. కొందరు 24 గంటలు, మరికొందరు ఒక్క పొద్దు ఇలా పలువిధాలుగా ఉపవాస దీక్ష పాటిస్తారు. అయితే శివరాత్రి ఉపవాస దీక్ష అనగానే చాలామందికి గుర్తొచ్చేది చిలగడ దుంప. శివరాత్రికీ చిలగడదుంపకీ ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం రండి!మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్ష విరమించిన తరువాత భక్తులుచాలామంది చిలగడ దుంపతో చేసిన వంటకాలను ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఈ దుంపలో ఉన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలే ఇందుకు కారణం. స్వీట్ పొటాటో లేదా చిలగడదుంపలను ధనసుగడ్డలు, రత్నపురి గడ్డలు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. చిలగడ దుంపలను ఆరోజు తినడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఉపవాస అలసట నీరసం తగ్గి ఎక్కువ శక్తినిస్తుంది.చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్హల్దీ ఫంక్షన్లో హనుమాన్ హల్చల్.. వైరల్ వీడియోచిలగడదుంప ఆరోగ్య ప్రయోజనాలుచిలగడదుంపలలో విటమిన్లు ఏ, సీ, బీ,డీ, కే, జింక్, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. బీటా కెరోటిన్‌కు మంచి మూలం. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుపడుతుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఎముకల బలానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి ద్వారా కేన్సర్, తదితర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది.ఇంకా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కళ్ళు పొడిబారడం, రాత్రి అంధత్వాన్ని నివారిస్తాయి. ఇందులోని విటమిన్ఏ కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందిఫ్రీ రాడికల్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి. నాడీ , జ్ఞాపకశక్తి సామర్థ్యంలో మెరుగుదలను సాధిస్తాయి.మహా శివరాత్రి స్పెషల్గావీటిని పాలలో ఉడికించి తినవచ్చు. సలాడ్లు, కూర రూపంలో తీసుకోవచ్చు. చిక్కటి పాలు డ్రైఫ్రూట్స్‌తో కలిపి చిలగడ దుంప పాయసం లేదా చిలగడదుంప హల్వా చేసుకోవచ్చు -
‘జాగరణ’లో స్టేజ్ కూలి ఒకరు మృతి.. 17 మందికి గాయాలు!
దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో జరిగిన ‘జాగరణ’ కార్యక్రమంలో వేదిక కూలిపోవడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 1,600 మంది అక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మహిళ మృతి చెందింది. గాయడిన 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంలో ‘జాగరణ’ నిర్వాహకులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 337/304A/188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 1:20 గంటలకు జరిగినట్లు సమాచారం. #WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers. (Video: Viral visuals confirmed by Police) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/xJgJ0wSdqB — ANI (@ANI) January 28, 2024 -
ముగిసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జాగరణ దీక్ష
బెళుగుప్ప : అనంతపురం జిల్లా బెళుగుప్పలో శనివారం సాయంత్రం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించిన జల జాగరణ దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. హంద్రీనీవా మొదటి దశ ఆయకట్టుకు నీరు అందించాలని, జాడిపల్లె గ్రామస్తులకు పునారావాసం కల్పించాలని, జీవో నంబర్ 22ను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఆయన ఈ జాగరణ దీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రంతా నిద్రపోకుండా విశ్వేశ్వరరెడ్డి మేల్కొని ఉన్నారు. పలువురు పార్టీ నాయకులు ఆయన చేపట్టిన జాగరణ దీక్షకు మద్దతు తెలిపారు.