భాగ్యశ్రీ, అభిమన్యు దాసాని
‘మైనే ప్యార్ కియా’తో భాగ్యశ్రీ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆమెకు సూపర్ క్రేజ్ సంపాదించి పెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చిన 29 ఏళ్ల తర్వాత ఆమె తనయుడు అభిమన్యు దాసాని బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. విశేషమేటంటే ‘మైనే ప్యార్ కియా’ చిత్రాన్ని భాగ్యశ్రీ థియేటర్‌లో చూడలేదట. అప్పట్లో తన తొలి చిత్రానికి ఎంత ఎగై్జట్ అయ్యానో ఇప్పుడు తనయుడు చిత్రం రిలీజ్‌కీ అంతే ఎగై్జట్ అవుతున్నానని పేర్కొన్నారామె. వసన్ బాలా దర్శకత్వంలో అభిమన్యు దాసాని హీరోగా రూపొందిన చిత్రం ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’.
నొప్పి అనేదే తెలియని విచిత్రమైన సమస్యతో బాధపడే హీరో పాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ సినిమా గురించి భాగ్యశీ మాట్లాడుతూ – ‘‘ముంబైలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా అబ్బాయి నటించిన సినిమా స్క్రీనింగ్ అవుతున్న థియేటర్ బయట పొడవైన క్యూ ఉండటం ఆనందంగా అనిపించింది. అలాగే ప్రదర్శింపబడిన థియేటర్స్ మొత్తం హౌస్‌ఫుల్ అయ్యాయి. నా ఆనందాన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియదు. ఆనంద భాష్పాలు ఆగలేదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment