Abhimanyu Dasani
-
డైనమిక్ కమ్‌బ్యాక్
సుమారు పదమూడేళ్ల తర్వాతఫుల్ లెంగ్త్ రోల్లో నటించడానికి రెడీ అవుతున్నారు శిల్పాశెట్టి. దాదాపు రెండు దశాబ్దాలపాటు హీరోయిన్గా సత్తా చాటారామె. ఇప్పుడు ‘నికమ్మా’ అనే యాక్షన్ ఫిల్మ్‌లో ఓ కీలక పాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు శిల్పా. ఈ చిత్రంలో అభిమన్యు దాసాని, షెర్లీ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా కెరీర్లో ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఆడియన్స్‌కు నా కొత్త అవతారాన్ని చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని శిల్పాశెట్టి అన్నారు. ‘‘శిల్పాశెట్టి మా సినిమాతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఆమె పాత్ర డైనమిక్‌గా ఉంటుంది’’ అన్నారు షబ్బీర్‌ఖాన్ అన్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్‌లో ఉన్నారు శిల్పా. హాలిడేస్ ఎంజాయ్ చేసి, ముంబై తిరిగి రాగేనే ‘నికమ్మా’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఓమ్ శాంతి ఓమ్’ (2007), దోస్తానా (2008), ధీక్షియా వుమ్ (2014) చిత్రాల్లో శిల్పా నటించినప్పటికీ వాటిలో అతిథి పాత్రలే. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనుండటం ఆమె అభిమానులకు తీయని వార్తే. -
ఆనంద భాష్పాలు ఆగలేదు
‘మైనే ప్యార్ కియా’తో భాగ్యశ్రీ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆమెకు సూపర్ క్రేజ్ సంపాదించి పెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చిన 29 ఏళ్ల తర్వాత ఆమె తనయుడు అభిమన్యు దాసాని బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. విశేషమేటంటే ‘మైనే ప్యార్ కియా’ చిత్రాన్ని భాగ్యశ్రీ థియేటర్లో చూడలేదట. అప్పట్లో తన తొలి చిత్రానికి ఎంత ఎగై్జట్ అయ్యానో ఇప్పుడు తనయుడు చిత్రం రిలీజ్‌కీ అంతే ఎగై్జట్ అవుతున్నానని పేర్కొన్నారామె. వసన్ బాలా దర్శకత్వంలో అభిమన్యు దాసాని హీరోగా రూపొందిన చిత్రం ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’. నొప్పి అనేదే తెలియని విచిత్రమైన సమస్యతో బాధపడే హీరో పాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ సినిమా గురించి భాగ్యశీ మాట్లాడుతూ – ‘‘ముంబైలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో మా అబ్బాయి నటించిన సినిమా స్క్రీనింగ్ అవుతున్న థియేటర్ బయట పొడవైన క్యూ ఉండటం ఆనందంగా అనిపించింది. అలాగే ప్రదర్శింపబడిన థియేటర్స్ మొత్తం హౌస్‌ఫుల్ అయ్యాయి. నా ఆనందాన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియదు. ఆనంద భాష్పాలు ఆగలేదు’’ అని పేర్కొన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు
ముంబై: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దాసాని హీరోగా తెరగ్రేటం చేయనున్నాడు. ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ పేరుతో తెరకెక్కనున్న సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా రాధికా మదన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించనున్నారు. ఫాంతమ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసన్ బాల దర్శకత్వం వహించనున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వాసన్ వినిపించిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పుకున్నానని అనురాగ్ కశ్యప్ ఒక ప్రకటనలో తెలిపారు. వాసన్ రచనా, దర్శకత్వంలో 2012లో పెడ్లర్స్ సినిమా వచ్చింది.