హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు | Bhagyashree's son to make Bollywood debut with 'Mard ko Dard Nahin Hota' | Sakshi
Sakshi News home page

హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు

Published Tue, Apr 4 2017 12:38 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు

ముంబై: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దాసాని హీరోగా తెరగ్రేటం చేయనున్నాడు. ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ పేరుతో తెరకెక్కనున్న సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా రాధికా మదన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్‌ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించనున్నారు.

ఫాంతమ్ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై అనురాగ్‌ కశ్యప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసన్‌ బాల దర్శకత్వం వహించనున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వాసన్ వినిపించిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పుకున్నానని అనురాగ్‌ కశ్యప్ ఒక ప్రకటనలో తెలిపారు. వాసన్‌ రచనా, దర్శకత్వంలో 2012లో పెడ్లర్స్‌ సినిమా వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement