సినిమా వాళ్లపై ప్రజల్లో ‍అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్! | Bhagyashree says everyone believes those working in Bollywood are not Good | Sakshi
Sakshi News home page

Bhagyashree: బాలీవుడ్ నటులు మంచి వారు కాదు.. 30 ఏళ్ల క్రితమే: భాగ్యశ్రీ

Published Mon, Oct 16 2023 1:45 PM | Last Updated on Mon, Oct 16 2023 3:23 PM

Bhagyashree says everyone believes those working in Bollywood are not Good - Sakshi

మైనే ప్యార్‌ కియా (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించింది. అంతేకాక గతేడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాదిలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చత్రపతి చిత్రంలోనూ కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భాగ్యశ్రీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో పనిచేసేవారు మంచి వ్యక్తులు కాదని ప్రజలు భావిస్తారని అన్నారు. అయితే వారి అభిప్రాయాల కారణంగా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని  భాగ్యశ్రీ చెప్పింది. ఇలాంటివి ఆమెను ఎలా ప్రభావితం చేస్తాయనే అనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంది. 

(ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్‌ తల్లి)

బాలీవుడ్‌లో ఉన్న అభిప్రాయాల గురించి అడిగినప్పుడు, భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'బాలీవుడ్‌లో పనిచేసే వ్యక్తులు మంచి వ్యక్తులు కాదనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఈ విషయంలో మనం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉండాలి. ఎవరైనా వంట చేస్తున్నట్టు లేదా శుభ్రం చేస్తున్నట్టు సోషల్ మీడియా పోస్ట్‌ చేస్తే.. ప్రజలు వాటికి కూడా.. 'మీరు అవన్నీ చేయకూడదు, ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా' అని సలహాలిస్తారు. నిజంగా చెప్పాలంటే మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. మన ఆహారం మనమే వండుకోవాలి. మేము మీలాగా సాధారణ మనుషులమే. కానీ ప్రజలు మరింత రూడ్‌గా, సున్నితంగా మారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుందని' ఆమె అన్నారు.

గతంలో సినిమాలపై భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'నేను 80వ దశకంలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశా. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడే  ఇలాంటి భావం ప్రజల్లో అప్పటికే ఉంది. సినిమాలు చాలా చెడ్డ ప్రపంచం. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఏ వ్యక్తిని చిత్ర పరిశ్రమకు వెళ్లనివ్వరు. ఇలాంటి అభిప్రాయం 30 సంవత్సరాల క్రితమే చూశా. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సెట్‌ డిజైనింగ్‌ నుంచి మేకప్‌ వరకు ప్రతి అంశంలోనూ మహిళలు ఉన్నారు. ఇది ఎప్పటికీ పరిశ్రమలో ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నా.' అని అన్నారు. 

భాగ్యశ్రీ ప్రస్తుతం సజిని షిండే కా వైరల్ వీడియోలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రాధికా మదన్  ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో సుబోధ్ భావే కూడా నటించారు.

(ఇది చదవండి: సిద్దార్థ్‌ ఎమోషనల్‌ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement