Bhagyashree Gets Emotional Remembering Her Wedding: బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యశ్రీ పలు సామాజిక సేవలందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 'భాగ్యశ్రీ' స్కీమ్‌కు 2015లో బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఇటీవల స్టార్‌ప్లస్ నిర్వహిస్తున్న కొత్త రియాలిటీ షో 'స్మార్ట్ జోడి'లో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తన వివాహం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది.
హిమాలయ దస్సానితో తన వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. వారి పెళ్లికి తన భర్త తప్ప ఇంకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. 'తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ తమ పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయి. మీరు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొన్నిసార్లు వారి డ్రీమ్స్‌తో వారిని జీవించనివ్వండి. ఎందుకంటే చివరికీ వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి.' అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ.
అలాగే 'ఒక సమయంలో నేను, హిమాలయ దస్సానీ లేచిపోయామని ప్రజలు, మీడియా ప్రచారం చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మేము అలా చేయలేదు.' అని పేర్కొంది. స్టార్ ప్లస్ నిర్వహిస్తున్న ఈ స్మార్ట్ జోడీ రియాలిటీ షోలో నిజ జీవితంలోని 10 మంది జంటలు పాల్గొంటారు. అందులో భాగంగా ఒక జంటగా భాగ్యశ్రీ-హిమాలయ దస్సానీ పార్టిసిపేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment