Emotinal Video
-
అల్లు అర్జున్ భార్య భావోద్వేగం
-
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
పాకిస్థాన్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్‌గా పాపులర్ అయిన మహమ్మద్ షిరాజ్ తన ఫ్యాన్స్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న షిరాజ్ ఇదే నా చివరి వ్లాగ్ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది.మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్‌లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్‌లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు. ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్ సాధించింది.కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్‌లు కూడా చేయి మొరకరు కమెంట్ చేశారు. చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని కమెంట్ చేశారు.కాగా పాక్‌లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పేరు సంపాదించాడు. -
కన్నీళ్లు ఆపులేకపోయిన దిల్‌రాజ్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నిర్మాత!
తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజును పరామర్శించారు. (ఇది చదవండి: దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం) దిల్ రాజు తండ్రి మరణవార్త తెలుసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో దిల్ రాజ్‌కు ధైర్య చెబుతూ కనిపించారు. దీంతో తన బాధను ఆపుకోలేకపోయిన దిల్ రాజ్.. ప్రకాశ్ రాజ్‌ను పట్టుకుని బోరున విలపించారు. దిల్ రాజు ఇంటికెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాంసుందర్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి.. కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించారు. వీరికి కూతురు హన్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) -
నిన్ను చాలా మిస్ అవుతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఇప్పటికే పెళ్లి డేట్ ఫిక్స్ కాగా.. తాజాగా పరిణీతి చోప్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!) 2013లో ఆమె నటించిన చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్. ఈ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ పదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిణీతి చోప్రా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాను తలుచుకుంటూ ఇన్‌స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ.. అవును నిజమే.. కాలం ఎగురుతుంది! దశాబ్దం గడిచినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. అది నవ్వులతో నిండిన ఓ మధురమైన ప్రయాణం. అలాంటి దిగ్గజ నటులతో ఈ సినిమా చేయడం జీవితంలో గొప్ప అనుభవం. రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం. సుశాంత్ సింగ్ నిన్ను ఇంకా చాలా ఎక్కువగా మిస్ అవుతున్నా. మీరు నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు.' అంటూ పోస్ట్ చేశారు. 2013లో విడుదలైన శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంలో పరిణీతి చోప్రా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లతో పాటు వాణి కపూర్, భువన్ అరోరా, రాజేష్ శర్మ నటించారు. (ఇది చదవండి: 17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by @parineetichopra -
Ishita Dutta: మదర్స్ డే నాకు ఎంతో ప్రత్యేకం..
-
తన పెళ్లి గురించి చెబుతూ ఏడ్చేసిన టాప్ హీరోయిన్..
Bhagyashree Gets Emotional Remembering Her Wedding: బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యశ్రీ పలు సామాజిక సేవలందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 'భాగ్యశ్రీ' స్కీమ్‌కు 2015లో బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఇటీవల స్టార్‌ప్లస్ నిర్వహిస్తున్న కొత్త రియాలిటీ షో 'స్మార్ట్ జోడి'లో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తన వివాహం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. హిమాలయ దస్సానితో తన వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. వారి పెళ్లికి తన భర్త తప్ప ఇంకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. 'తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ తమ పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయి. మీరు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొన్నిసార్లు వారి డ్రీమ్స్‌తో వారిని జీవించనివ్వండి. ఎందుకంటే చివరికీ వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి.' అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. అలాగే 'ఒక సమయంలో నేను, హిమాలయ దస్సానీ లేచిపోయామని ప్రజలు, మీడియా ప్రచారం చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మేము అలా చేయలేదు.' అని పేర్కొంది. స్టార్ ప్లస్ నిర్వహిస్తున్న ఈ స్మార్ట్ జోడీ రియాలిటీ షోలో నిజ జీవితంలోని 10 మంది జంటలు పాల్గొంటారు. అందులో భాగంగా ఒక జంటగా భాగ్యశ్రీ-హిమాలయ దస్సానీ పార్టిసిపేట్ చేశారు. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
ఆయనతో ఒక్క ఫోటో కూడా లేదు : నటి భావోద్వేగం
సాక్షి,ముంబై: తెరపై హాస్యాన్ని పండిస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చాలామంది నటుల జీవితాల్లో ప్రపంచానికి తెలియని మరో కోణం ఉంటుంది. ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ తన జీవితంలో అలాంటి మరో కోణాన్ని, విషాదాన్ని ఇటీవల ఒక షోలో షేర్ చేసుకున్నారు. తనకు జీవితంలో మిగిలింది తల్లి ఒక్కతేనని, తండ్రి ప్రేమ దక్కలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న వైనం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మనీష్ పాల్ ఈ వీడియో లింక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, ఆయన ముఖాన్ని కూడా చూడలేదని భారతీ సింగ్ చెప్పు కొచ్చారు. అంతేకాదు ఆయనతో తనకు ఒక్క ఫోటో కూడా లేకుండా పోయిందని వాపోయారు. తన అక్కకు, అన్నకు దక్కిన అదృష్టాన్ని కోల్పోయానన్నారు. అలాగే తమ కుటుంబంలో అందరూ వారి వారి జీవితాల్లో బిజీగా ఉండటం తగిన పప్రేమను పొందలేకపోయానని వ్యాఖ్యానిచారు. అయితే భర్త హర్ష్ లింబాచియాతో ఆ లోటు తనకు తీరిందన్నారు. భర్త ద్వారా తరువాత మాత్రమే ప్రేమ గురించి తెలిసిందని, పురుషుని ప్రేమ తనకు అర్థమైందని పేర్కొన్నారు. కాగా భారతీ సింగ్ తన చిరకాల ప్రేమికుడు హర్ష్ లింబాచియాను డిసెంబర్ 3, 2017 న గోవాలో వివాహం చేసుకున్నారు. మనీష్ పాల్ ఇన్‌స్టాలో పోడ్కాస్ట్ లింక్‌ను షేర్ చేస్తూ హాస్య దిగ్గజం చార్లీ చాప్లిన్ మాటలు “నేను ఎప్పుడూ వర్షాలలో నడవడం ఇష్టపడతాను. ఎందుకంటే నా ఏడుపు ఎవరూ చూడలేరు’’ కోట్ చేశారు. మనల్ని నవ్వించే వ్యక్తులు చాలా గుంభనంగా ఉంటారు. తమ గాయాలను దాచుకుంటారు. అలాంటి వారిలో నవ్వుల రాణి భారతి ఒకరు అనీ, ఆమె తన అనుభవాలను పంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. View this post on Instagram A post shared by Maniesh Paul (@manieshpaul) -
ఎమోషనల్ వీడియోను షేర్ చేసిన భజ్జీ
-
ఎమోషనల్ వీడియోను షేర్ చేసిన భజ్జీ
సాక్షి, స్పోర్ట్స్: మిగతా క్రికెటర్లలాగానే టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటాడు. అప్డేట్ పోస్టులతో, తోటి ఆటగాళ్ల ట్వీట్లకు రిప్లై ఇస్తుంటాడు. అయితే రీసెంట్గా ఈ ఆఫ్ స్పినర్ చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. బెడ్ మీద ఓ చిన్న బాబు పాల పీకను అందుకోలేక ఏడుస్తుంటాడు. వెంటనే పక్కనే అతని సోదరుడు అది గమనించి దానిని అందించేందుకు యత్నిస్తాడు. అయితే చేతులు లేని ఆ చిన్నారి అతి కష్టం మీద తన నోటితోనే తమ్ముడి నోటికి పీకను అందించాడు. వెంటనే చిన్నారి సైలెంట్ అయిపోతుంది. ‘మాటల్లేవ్.. కన్నీళ్లు మాత్రం వచ్చేశాయ్. ఆ చిన్నారుల నుంచి చాలా నేర్చుకోవాలి’ అన్న సందేశంతో భజ్జీ ఆ వీడియోను షేర్ చేశాడు. హృదయాన్ని కరిగించేలా ఉన్న ఆ వీడియోను మీరూ చూసేయండి.