పాకిస్థాన్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్‌గా పాపులర్ అయిన మహమ్మద్ షిరాజ్ తన ఫ్యాన్స్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న షిరాజ్ ఇదే నా చివరి వ్లాగ్ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది.
మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్‌లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్‌లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.
అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు. ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్ సాధించింది.
కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్‌లు కూడా చేయి మొరకరు కమెంట్ చేశారు. చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని కమెంట్ చేశారు.
కాగా పాక్‌లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పేరు సంపాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment