నిన్ను చాలా మిస్‌ అవుతున్నా.. హీరోయిన్‌ పోస్ట్ వైరల్! | Parineeti Chopra Emotional Note On Sushant Singh Rajput Shuddh Desi Romance | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: 'నాకిష్టమైన వారిలో మీరు ఒకరు'.. పరిణీతి ఎమోషనల్!

Published Wed, Sep 6 2023 6:18 PM | Last Updated on Wed, Sep 6 2023 6:38 PM

Parineeti Chopra Emotional Note On Sushant Singh Rajput Shuddh Desi Romance - Sakshi

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దాను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట మే నెలలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఇప్పటికే పెళ్లి డేట్‌ ఫిక్స్ కాగా.. తాజాగా పరిణీతి చోప్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

(ఇది చదవండి: మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!)

2013లో ఆమె నటించిన చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్. ఈ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ పదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిణీతి చోప్రా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాను తలుచుకుంటూ ఇన్‌స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 

పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ.. అవును నిజమే.. కాలం ఎగురుతుంది! దశాబ్దం గడిచినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. అది నవ్వులతో నిండిన ఓ మధురమైన ప్రయాణం. అలాంటి దిగ్గజ నటులతో ఈ సినిమా చేయడం జీవితంలో గొప్ప అనుభవం. రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం. సుశాంత్ సింగ్ నిన్ను ఇంకా చాలా ఎక్కువగా మిస్ అవుతున్నా. మీరు నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు.' అంటూ పోస్ట్ చేశారు.  2013లో విడుదలైన శుద్ధ్ దేశీ రొమాన్స్  చిత్రంలో పరిణీతి చోప్రా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లతో పాటు వాణి కపూర్, భువన్ అరోరా, రాజేష్ శర్మ  నటించారు. 

(ఇది చదవండి: 17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement