కన్నీళ్లు ఆపులేకపోయిన దిల్‌రాజ్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నిర్మాత! | Dil Raju Very Emotional About Her Father Demise | Sakshi
Sakshi News home page

Dil Raju: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టిన దిల్‌ రాజ్!

Oct 10 2023 12:06 PM | Updated on Oct 10 2023 12:28 PM

Dil Raju Emotional About Her father Demise  - Sakshi

తెలుగు  చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు దిల్‌ రాజును పరామర్శించారు.

(ఇది చదవండి: దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం)

దిల్ రాజు తండ్రి మరణవార్త తెలుసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్‌ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో దిల్‌ రాజ్‌కు ధైర్య చెబుతూ కనిపించారు. దీంతో తన బాధను ఆపుకోలేకపోయిన దిల్‌ రాజ్.. ప్రకాశ్‌ రాజ్‌ను పట్టుకుని బోరున విలపించారు. దిల్‌ రాజు ఇంటికెళ్లిన మెగాస్టార్ చిరంజీవి..  శ్యాంసుందర్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. 

దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి.. కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు మొద‌టి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించారు. వీరికి కూతురు హ‌న్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు.

(ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్‌.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement