ఎమోషనల్ వీడియోను షేర్ చేసిన భజ్జీ
ఎమోషనల్ వీడియోను షేర్ చేసిన భజ్జీ
Published Sun, Sep 3 2017 1:42 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM
సాక్షి, స్పోర్ట్స్: మిగతా క్రికెటర్లలాగానే టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గానే ఉంటాడు. అప్‌డేట్ పోస్టులతో, తోటి ఆటగాళ్ల ట్వీట్లకు రిప్లై ఇస్తుంటాడు. అయితే రీసెంట్‌గా ఈ ఆఫ్ స్పినర్ చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ మాత్రం బాగా ఆకట్టుకుంటోంది.
బెడ్ మీద ఓ చిన్న బాబు పాల పీకను అందుకోలేక ఏడుస్తుంటాడు. వెంటనే పక్కనే అతని సోదరుడు అది గమనించి దానిని అందించేందుకు యత్నిస్తాడు. అయితే చేతులు లేని ఆ చిన్నారి అతి కష్టం మీద తన నోటితోనే తమ్ముడి నోటికి పీకను అందించాడు. వెంటనే చిన్నారి సైలెంట్ అయిపోతుంది. ‘మాటల్లేవ్.. కన్నీళ్లు మాత్రం వచ్చేశాయ్. ఆ చిన్నారుల నుంచి చాలా నేర్చుకోవాలి’ అన్న సందేశంతో భజ్జీ ఆ వీడియోను షేర్ చేశాడు.
హృదయాన్ని కరిగించేలా ఉన్న ఆ వీడియోను మీరూ చూసేయండి.
Advertisement
Advertisement