
కోల్‌కతా : టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్కడ ఉంటే అక్కడ తన అల్లరితో అందరిని అలరిస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, హర్భజన్‌లు కలిసి 'సెనోరిటా' పాటకు తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టిన వీడియో ఒకటి వైరల్ అయింది. వివరాలు.. బెంగాలీకి చెందిన ఒక టెలివిజన్ చానెల్‌లో దాదాగిరి అన్‌లిమిటెడ్ పేరుతో ఆదివారం ఒక షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కాగా ఈ షోకు పలువురు భారత క్రికెటర్లను ఆహ్వానించారు. వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. కాగా ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.(ఆ మ్యాచ్‌తోనే హర్భజన్‌కు ఫిదా అయ్యా : గంగూలీ)
అయితే కార్యక్రమం మధ్యలో ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ 'సెనోరిటా' అనే పాపులర్ పాటను ఆలపించారు. ఉషా ఉతుప్ పాడిన పాటకు హర్భజన్ డ్యాన్స్ చేయడమే గాక దాదాతోను కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ చేయించాడు. అయితే ఇదంతా గమనిస్తున్నఇతర క్రికెటర్లు క్లాప్స్ కొడుతూ వారిద్దరిని ఎంకరేజ్ చేశారు. మొదట గంగూలీ డ్యాన్స్ చేయడానికి కొంత ఇబ్బంది పడినా చివరకు భజ్జీ సాయంతో డ్యాన్స్ బాగానే చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన క్రికెటర్లలో ఒక్క అశ్విన్ తప్ప మిగతా అందరూ దాదా నాయకత్వంలో ఆడినవారే కావడం గమానార్హం.అయితే ఈ వీడియోను సదరు చానెల్ యాజమాన్యం ట్విటర్‌లో షేర్ చేయడంతో ప్రసుత్తం వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.(‘గంగూలీ.. మీరు ఒప్పు కోవద్దు’)
Here you go. Dada dancing 😂@SGanguly99 @harbhajan_singh#Dadagiri
— ɑɑrish. (@SRKsTrooper) January 12, 2020
pic.twitter.com/ajhf2opmMj