KBC13: Watch Amitabh Bachchan Smashes Six Harbhajan Singh Bowling - Sakshi
Sakshi News home page

Harbahjan-Amitabh Bachchan: భజ్జీ బౌలింగ్‌లో అమితాబ్‌ సిక్స్‌ .. వీడియో వైరల్‌

Published Sat, Dec 18 2021 9:39 AM | Last Updated on Fri, Dec 31 2021 12:51 PM

Watch Amitabh Bachchan Smashes Six Harbhajan Singh Bowling KFC 13 Season - Sakshi

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌లో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సిక్స్‌ కొట్టాడు. అదేంటి అమితాబ్‌ క్రికెట్‌ ఎప్పుడు ఆడాడు అనే డౌట్‌ రావొచ్చు. అమితాబ్‌ పాపులర్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి 13వ సీజన్‌కు భజ్జీతో పాటు మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో అమితాబ్‌, హర్బజన్‌లు క్రికెట్‌ ఆడగా.. ఇర్ఫాన్‌ కామెంటరీ చేశాడు. ''మేం ఎంతో మంది దిగ్గజాలకు బౌలింగ్‌ చేశాం. ఇక హర్భజన్‌ ఇప్పుడు మరో లెజెండరీకి బౌలింగ్‌ వేయబోతున్నాడు.. ఏం జరుగుతుందో చూద్దాం'' అంటూ ఇర్ఫాన్‌ కామెంట్‌ చేశాడు.

చదవండి: LPL 2021: బౌలర్‌ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్‌ షాక్‌

హర్బజన్‌ వేసిన ఒక బంతిని అమితాబ్‌ సిక్స్‌ కొట్టడంతో ఇర్ఫాన్‌ భజ్జీని తనదైన శైలిలో టీజ్‌ చేశాడు. '' యార్‌ ఇట్స్‌ సిక్స్‌ర్‌.. హర్భజన్‌ చేతిలోని బంతి అమితాబ్‌ చేతిలోని బ్యాట్‌తో ఓడిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హర్భజన్‌ అమితాబ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లను పంజాబీ బాంగ్రా డ్యాన్స్‌ చేయించడం విశేషం. కాగా డిసెంబర్‌ 17న సోనీ టీవీలో ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement