star plus channel
-
తన పెళ్లి గురించి చెబుతూ ఏడ్చేసిన టాప్ హీరోయిన్..
Bhagyashree Gets Emotional Remembering Her Wedding: బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యశ్రీ పలు సామాజిక సేవలందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 'భాగ్యశ్రీ' స్కీమ్‌కు 2015లో బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఇటీవల స్టార్‌ప్లస్ నిర్వహిస్తున్న కొత్త రియాలిటీ షో 'స్మార్ట్ జోడి'లో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తన వివాహం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. హిమాలయ దస్సానితో తన వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. వారి పెళ్లికి తన భర్త తప్ప ఇంకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. 'తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ తమ పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయి. మీరు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొన్నిసార్లు వారి డ్రీమ్స్‌తో వారిని జీవించనివ్వండి. ఎందుకంటే చివరికీ వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి.' అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. అలాగే 'ఒక సమయంలో నేను, హిమాలయ దస్సానీ లేచిపోయామని ప్రజలు, మీడియా ప్రచారం చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మేము అలా చేయలేదు.' అని పేర్కొంది. స్టార్ ప్లస్ నిర్వహిస్తున్న ఈ స్మార్ట్ జోడీ రియాలిటీ షోలో నిజ జీవితంలోని 10 మంది జంటలు పాల్గొంటారు. అందులో భాగంగా ఒక జంటగా భాగ్యశ్రీ-హిమాలయ దస్సానీ పార్టిసిపేట్ చేశారు. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
ఆమే ప్లస్... ఆమే మైనస్!
స్టార్‌ప్లస్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘దీయా ఔర్ బాతీ హమ్’ సీరియల్ (తెలుగులో ‘ఈతరం ఇల్లాలు’గా వస్తోంది) 2011లో ప్రారంభమయ్యింది. అనతి కాలంలోనే సూపర్ హిట్ అయ్యింది. బలమైన కథ, ఆసక్తికరమైన కథనాలు సీరియల్‌ని రక్తి కట్టిస్తే... హీరోయిన్ దీపికాసింగ్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సీరియల్లో ఆమె పాత్ర పేరు సంధ్య. ఆమెకి పోలీసాఫీసర్ కావాలని కోరిక. అయితే అనుకోని పరిస్థితుల్లో స్వీట్స్ వ్యాపారం చేసే సూరజ్‌తో పెళ్లవుతుంది. ఓ పేదపిల్లను కోడలిగా అంగీకరించలేని సూరజ్ తల్లి, సంధ్యని నరకయాతన పెడుతుంది. అన్నిటినీ ఓపికగా భరించి అత్తగారి మనసును గెలుచుకుంటుంది సంధ్య. పోలీసాఫీసర్ అవ్వమంటూ అత్తగారు ప్రోత్సహించడంతో కష్టపడి చదివి ఐపీఎస్ పాసవుతుంది. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అయితే తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నదే కథ. మూడేళ్లపాటు అత్తగారి ఆరళ్లతోనే సాగిపోయింది సంధ్య జీవితం. ఆ తర్వాత పోలీస్ అయ్యింది. అయ్యిందన్నమాటే కానీ... సంధ్యలో ఆ హుందాతనం లేదు. పోలీసులో ఉండాల్సిన కరకుదనం కాస్తయినా కనిపించడం లేదు. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఓ కోడలిగా ఉన్నప్పుడు ఇచ్చిన బేల ఎక్స్‌ప్రెషన్సే ఇస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆవేశాన్ని ప్రదర్శిస్తుంది కానీ... అక్కడా ఆమెలో సాఫ్ట్‌నెస్ మాత్రమే కనిపి స్తోంది. దాంతో ఒకప్పుడు సీరియల్‌కి ప్లస్ అయిన ఆమే ఇప్పుడు సీరియల్‌కి మైనస్ అయ్యిందా అనిపిస్తోంది. కాబట్టి ఆమెతో ఏవేవో సాహసాలు చేయించేద్దామని చూడకుండా... దర్శకుడు వీలైనంత త్వరగా కథకు ఫుల్స్టాప్ పెడితే మంచిది! -
టీవీక్షణం : సీతామాలక్ష్మివి పాత కష్టాలే!
సినిమా రంగంలో నిలబడటం అంత తేలిక కాదు. కానీ టెలివిజన్ అలా కాదు... కాసింత గ్లామర్, ఇంకాసింత టాలెంట్ ఉంటే చాలు, నెత్తిన పెట్టుకుంటుంది. అందుకే సినిమాల్లో ఫెయిలైన శ్రద్ధా ఆర్య సీరియల్స్‌లో రాణిస్తోంది. పలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది శ్రద్ధ. గొడవ, కోతిమూక, రోమియో, తింగరోడు, బాలరాజు ఆడి బామ్మర్ది చిత్రాలతో మనకు బాగా పరిచయం. కానీ గుర్తు చేసుకుంటే గుర్తు రావడం వేరు, గుర్తుండిపోవడం వేరు. శ్రద్ధ మొదటి రకం నటిగానే మిగిలిపోయింది. నటిగా ఇక్కడ మునిగిపోయిన ఆమె... ఆ మధ్య సడెన్‌గా సీరియల్స్‌లో తేలింది. ఇప్పటికి రెండు సీరియల్స్ చేసింది. ఇప్పుడు ‘తుమ్హారీ పాఖీ’ చేస్తోంది. లైఫ్ ఓకే చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్లో... పర స్త్రీ వ్యామోహంలో పడిన భర్తని తన వైపు తిప్పుకునేందుకు తపన పడే భార్యగా నటన అదరగొడుతోందనే చెప్పాలి. ిసినిమారంగం నిరుత్సాహపర్చినా, సీరియళ్లు మాత్రం తన ప్రతిభకు పట్టం కడుతున్నందుకు సంతోషపడుతోంది శ్రద్ధ! సీతామాలక్ష్మివి పాత కష్టాలే! టీఆర్పీల కోసం చానెళ్లు పరుగులు పెడుతున్నాయి. రోజుకో సీరియల్‌ని రంగంలోకి దింపుతున్నాయి. రకరకాల కథలు, రక్తి కట్టించే కథనాలతో ఇతర చానెళ్లను అధిగమించాలని చూస్తున్నాయి. అయితే ఈ పోటీలో పడి... పాత కథలకు కొత్త మేకప్ వేసి పట్టుకొస్తున్నాయి అప్పుడప్పుడూ. మాటీవీలో ప్రసారమవుతోన్న సీతామాలక్ష్మి సీరియల్‌ని చూస్తే అదే అనిపిస్తోంది. ఓ మధ్య తరగతి భర్తకి ఇల్లాలు సీతామాలక్ష్మి. ఉత్తమురాలు, సౌమ్యురాలు. మంచి భార్య, మంచి కోడలు. భర్త పనిచేసే కంపెనీ యజమాని కళ్లు ఆమె మీద పడతాయి. ప్లేబోయ్ అయిన అతగాడు ఎలాగైనా సీతను పొందాలని రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా సీత భర్తను ఇబ్బందులు పెడుతుంటాడు. ఇలాంటి కథతో గతంలో బోలెడన్ని సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. అయినా మళ్లీ అదే కథ, అవే కష్టాలు. ప్రవల్లిక, నాగేంద్రబాబు, భరణీశంకర్లు తమ అద్భుత నటనతో రక్తి కట్టిస్తున్నా... ఈ పాత సారా ప్రేక్షకులకి ఎంతని కిక్ ఇస్తుంది! ఇప్పటి వరకూ రకరకాల క్రైమ్ షోలు వచ్చాయి. కానీ ‘ఇష్క్ కిల్స్’ మాత్రం కాస్త డిఫరెంట్. స్టార్స్ ప్లస్‌లో ప్రసారమయ్యే ఈ క్రైమ్ సిరీస్‌లో కేవలం ప్రేమ మూలంగా జరిగిన దారుణాలు మాత్రమే చూపిస్తారు. ఒక వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించడం, ఆమె ఇంకొకరిని ప్రేమించడం, ఇతడు పగ తీర్చుకోవడం... తను ప్రేమించినవాడు మరో అమ్మాయిని ప్రేమించడంతో అతడి కోసం ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయడం... భార్యాభర్తల మధ్య మరో స్త్రీయో, పురుషుడో ప్రవేశించి కాపురాలు కూల్చడం... ఇలాంటివన్నీ చూపిస్తుంటారు. బాలీవుడ్ దర్శకుడు విక్రమ్‌భట్ ఈ షోకి డెరైక్టర్ కావడంతో మసాలా ఎక్కువే ఉంది. ప్రస్తుతానికి అందరూ ఆస్వాదిస్తున్నా... ఆ ఘాటును ఎన్నాళ్లు భరిస్తారో మరి! -
టీవీక్షణం: చూస్తే భారతమే చూడాలి!
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు... ఉదయాన్నే ఇల్లాళ్లు హడావుడిగా వంటలు పూర్తి చేసేసేవాళ్లు. బడికెళ్లే రోజుల్లో బద్దకంగా ఒళ్లు విరుచుకునే పిల్లలు కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేసి, టిఫిన్లు ముగించేవాళ్లు. అందరూ అన్నీ చక్కబెట్టేసుకుని టీవీ సెట్ల ముందు తిష్ట వేసేసేవారు. కాసేపటికి తెర మీద ప్రత్యక్షమయ్యేది... మహాభారత్. అంతే, సూది మొన పడినా వినిపించేంత నిశ్శబ్దం. అందరి కళ్లూ తెరమీద అతుక్కుపోయేవి. అందరి మనసులూ భక్తి పారవశ్యంతో మునిగిపోయేవి. అది కేవలం సీరియల్ కాదు వారికి. సాక్షాత్తూ మహాభారత కథకు తమ ఇల్లే వేదిక అయ్యిందన్నంత తన్మయత్వం వారిలో. రెండేళ్ల పాటు అంద రూ తమ ఆదివారాలను భారతానికే అంకితం చేసేశారు. మళ్లీ పదమూడేళ్ల తర్వాత అదే పరిస్థితి ఏర్పడింది. ఈసారి స్టార్ ప్లస్ చానల్ మహాభారతాన్ని తీసుకొచ్చింది. ఆదివారానికి బదులు ప్రతిరోజూ రాత్రి ఎనిమిదిన్నరకు ప్రతి ఇంటా కృష్ణలీలన్ని, పాండవుల వీరోచిత గాథల్ని చూపిస్తోంది. మరోసారి ఆ అతిగొప్ప ఇతిహాసాన్ని కళ్లకు కడుతోంది. అప్పటికీ ఇప్పటికీ... నటులు మారారు. తీసే విధానం మారింది. కెమెరా టెక్నిక్స్ వచ్చి చేరాయి. గ్రాఫిక్స్ పెద్ద పీట వేస్తున్నాయి. మారనిది ఒక్కటే... ప్రేక్షకాదరణ. దాన్ని ఆదరణ అనే కంటే, భక్తి భావన అనడం బెటరేమో. ఆ భావనే ఇప్పటికీ భారతాన్ని ఆస్వాదించేలా చేస్తోంది. మరో పాతికేళ్ల తర్వాత ప్రసారం చేసినా, ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టి తీరుతుంది!