
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేమపావురాలు సినిమాతో తెలుగు ప్రేక్షక హృదయాలను ఉర్రూతలూగించిన నటి భాగ్యశ్రీ సింహగిరిపై తళుక్కుమన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం ఆమె దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హిందీ సినిమా మైనే ప్యార్ కియా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన యువరత్న రాణా సినిమాలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment