Simhagiri
-
సింహాచలం చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో పోటెత్తిన భక్తులు
-
ఘనంగా గిరి ప్రదక్షిణ
సింహాచలం: ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ మంగళవారం ఘనంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు కాలినడకన గిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసి తరించారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తజన సంద్రంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ ప్రచార రథాన్ని ప్రారంభించి అధికారికంగా గిరి ప్రదక్షిణని ప్రారంభించారు. సింహాచలంలోని కొండ దిగువన తొలిపావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రథంతో పాటు లక్షలాది మంది భక్తులు హరి నామస్మరణలు చేస్తూ ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో దేవస్థానం, పలు శాఖల అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సారథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్లు దారి పొడవునా పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలందించాయి. -
సింహగిరికి ‘రక్షణ’ కవచం
సాక్షి, విశాఖపట్నం : సింహగిరికి రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వన్యప్రాణులు, ఔషధ మొక్కల సంరక్షణతో పాటు ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టి్టంది. ప్రహరీ నిర్మాణ బాధ్యతలను వీఎంఆర్డీఏకు అప్పగించగా.. తొలివిడతలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.3.59 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. ఔషధమొక్కలు, వన్యప్రాణుల సంరక్షణకు ఉపయుక్తం జీవవైవిధ్యానికి, పర్యావరణానికి చిరునామా సింహాచలం కొండలు. తూర్పు కనుమల్లో అత్యంత సుందరమైన, పర్యావరణహితమైన గిరులుగా పేరొందాయి. సింహగిరుల్లో 70 రకాల వృక్షజాతులు, 200 రకాలైన ఔషధమొక్కల జాతులున్నట్లు గుర్తించారు. అదేవిధంగా వందలాది రకాల వన్యప్రాణులు ఈ కొండలపై ఉన్నాయి. అయితే సింహాచలం కొండలు గతంలో ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో కొందరు ఆకతాయిలు కొండలపై నిప్పు పెట్టడంతో పలు ఔషధ మొక్కలు అగ్నికి ఆహుతవ్వగా వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. వీటన్నింటి నుంచి సింహగిరులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహగిరి కొండల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టేందుకు అడుగులు వేస్తోంది. తొలి విడతలో 4.15 కి.మీ నిర్మాణానికి టెండర్లు సింహగిరిపై మొత్తం 4.15 కిలోమీటర్ల పొడవున్న రక్షణ గోడ నిర్మాణానికి రూ.3.59 కోట్లతో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) టెండర్లు ఆహ్వానించింది. ఫేజ్–1, ఫేజ్–2గా విభజించి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. చినగదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకూ 2.924 కిలోమీటర్లు, దుర్గానగర్ నుంచి పోర్ట్క్వార్టర్స్ హిల్స్ వరకూ 1.225 కి.మీ మేర ప్రహరీ నిర్మించనుంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించామనీ, 30వ తేదీన టెండర్లు పరిశీలన నిర్వహిస్తామని వీఎంఆర్డీఏ అధికారులు వెల్లడించారు. -
కమనీయం.. అప్పన్న నిజరూపం
సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున నుంచే స్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే స్వామివారి నిజరూపాన్ని దర్శనం చేసుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 2.30 గంటలకే స్వామివారి తొలి నిజరూప దర్శనం చేసుకుని తొలి చందనం సమర్పణ చేశారు. అనంతరం ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున జేఈఓ ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డిలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.30 నుంచి భక్తులను అనుమతించారు. స్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ కదలివచ్చిన భక్తజనం చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు మంగళవారం వేకువజామున నుంచి ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందనం ఒలుపును (స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించడం) అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగానే చందనోత్సవం జరగడం, భక్తులెవరినీ దర్శనానికి అనుమతించకపోవడంతో ఈ ఏడాది చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు మంచినీళ్లు, ఆహారం అందించేందుకు దేవస్థానంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లుచేశాయి. సుమారు 2,500 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. వైద్యులు, 108 అంబులెన్స్‌లు, ఏఎన్‌ఎంలతోపాటు ఉచిత మందులూ అందుబాటులో ఉంచారు. పోటెత్తిన వీఐపీలు చందనోత్సవం సందర్భంగా మంగళవారం వీఐపీలు పోటెత్తారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాల్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి సత్యవతి, మాజీమంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, తోట నరసింహం, వరుదు కల్యాణి, మాధవ్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అచ్చెన్నాయుడు, సుప్రీంకోర్డు న్యాయమూర్తి జస్టిస్ నరసింహం తదితరులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. మరోవైపు.. చందనోత్సవ వేళ ఆలయంలో అపచారం జరిగింది. స్వామి గర్భాలయాన్ని ఓ ఆకతాయి వీడియో తీయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసింది సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మహాభాగ్యం. తొలిసారిగా నేను చందనోత్సవంలో పాల్గొన్నాను. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే శరీరమంతా దివ్యతేజమైనట్లు అనిపించింది. ఇక్కడ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చాలాబాగా చేసింది. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నా. – తమిళిసై, తెలంగాణ గవర్నర్ వైభవంగా చందనోత్సవం ఈ ఏడాది చందనోత్సవానికి ఏర్పాట్లు అద్భుతంగా చేసి వైభవంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ ఏడాది ఆర్థికంగాను, ప్రజలు ఆరోగ్యకరంగా, అన్ని రకాలుగాను బాగుండాలని కోరుకున్నా. అందరినీ సమన్వయం చేసుకుంటూ దేవస్థానం ఈఓ సూర్యకళ, కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, దేవదాయశాఖ నుంచి ఫెస్టివల్ అధికారి భ్రమరాంబ సామాన్య సేవకుల్లా ఉండి భక్తుల సేవలో ఉండటం గొప్ప విషయం. – స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి -
సింహగిరిపై నటి భాగ్యశ్రీ
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేమపావురాలు సినిమాతో తెలుగు ప్రేక్షక హృదయాలను ఉర్రూతలూగించిన నటి భాగ్యశ్రీ సింహగిరిపై తళుక్కుమన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం ఆమె దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హిందీ సినిమా మైనే ప్యార్ కియా ద్వారా హీరోయిన్గా పరిచయమైన భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన యువరత్న రాణా సినిమాలో నటించారు. చదవండి: (రాజమహేంద్రవరానికి చిరంజీవి.. అందుకేనా..?) -
ఆడబిడ్డ భారమయ్యిందేమో..!
సింహాచలం(పెందుర్తి)/ గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): అనాగరిక సమాజంలో ఆడపిల్లంటే బరువు అనుకుందో... లేక జీవితాంతం ఎలా పెంచుతానని ఆందోళన చెందిందో... అత్తింటి వారి సూటిపోటి మాట లకు ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయి సింహ గిరి అప్పన్న సాక్షిగా నిశ్శబ్దంగా బరువు వదిలించుకుందామనుకుందో తెలియదుకానీ... ఏడాది వయసున్న చిన్నారిని సింహాచలం కొండ దిగువన ఆర్టీసీ బస్టాండ్ పక్కన దేవస్థానం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఓ తల్లి విడిచిపెట్టి వెళ్లిపోయింది. అమ్మా... అని పిలుద్దామనుకుంటే నోట మాట రాకపోవడం... మరోవైపు చలితో ఆ చిన్నారి వణికిపోతుండడం చూపరులను కలిచివేసింది. వెంటనే స్థానికులు డయిల్ 100 నంబర్‌కు సమాచారం చేరవేశారు. దీతో గోపాలపట్నం సీఐ పైడియ్య హుటాహుటిన ఎస్ఐ తమ్మినాయుడు, బ్లూకోట్స్ కానిస్టేబుల్ ఈశ్వరరావుని అప్రమత్తం చేశారు. వారు బస్టాండ్‌కి చేరుకుని ఆ చిన్నారిని గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆర్అండ్బీ వద్ద ఉమెన్ అంyŠ ఛైల్డ్ సంస్థ నిర్వహిస్తున్న శిశుగృహకు ఫోన్ చేశారు. ఆ సంస్థ మేనేజర్ మంజుకి ఆడబిడ్డను అందజేశారు. అయితే ఒక పురుషుడు ఆడ బిడ్డను తీసుకొచ్చి సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై కూర్చోబెట్టి వెళ్లిపోయాడని సాధువులు చెబుతున్నారు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన అతను ఎంతసేపటికీ రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారనే ప్రచారం జరుగుతోంది. అయితే సింహాచలం బస్టాండ్ సమీపంలో ఆడ బిడ్డను విడిచి వెళ్లిపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమారాల ఫుటేజీ పరిశీలిస్తే... బిడ్డను ఎవరు విడిచిపెట్టి వెళ్లారో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఫుటేజీలు పరిశీలించనున్నారు. -
ఛల్ మోహన్ దొంగా..
గుండె జారి గల్లంతయ్యేలా చేసే చాకులాంటి ఈ కుర్రాడుహీరోయిజంతో అమ్మాయిల దిల్ దోచాడేమో కానీ.. ఉంగరం దొంగిలిస్తాడా? అందునా అప్పన్న దర్శనానికి వచ్చి స్వామిఅంగుళీయకాన్నే కొట్టేస్తాడా? మనకు డౌటే కానీ.. అదే జరిగిందంటున్నారు ఆలయంలో అయ్యవార్లు. అందుకే ‘ఛల్ మోహనరంగా’ అంటూ వచ్చిన హీరో నితిన్‌ను తాళ్లతో కట్టి మరీ నిలదీశారు. స్వామి ఉంగరం ఎక్కడంటూ గద్దించారు. ఆదివారం ఉదయం సింహాచలం ఆలయంలో జరిగిన ఆ ‘దొంగాట’ కథా కమామిషు.. సింహాచలం(పెందుర్తి): ‘ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.’ ఇదీ ప్రముఖ నటుడు నితిన్‌కు ఆదివారం సింహగిరిపై ఎదురైన ప్రశ్నల వర్షం. ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు ఎదురైన అనుభవం. స్వామి దర్శనానికి వచ్చిన నితిన్‌కు అలయ అలంకారి కరి సీతారామాచార్యులు ఎదురై ఒకమాటైనా మాట్లాడకుండా తాళ్లతో బంధించారు. తర్వాత స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన నితిన్‌పై ఎడాపెడా ప్రశ్నలు సంధించారు. దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయమన్నారు. ‘నేను తియ్యలేదండి కావాలంటే చెక్ చేసుకోండి’ అని నితిన్ బదులిచ్చారు. ‘శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే.’ అని స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు. నితిన్‌కు ఇదేం అనుభవం? అని విస్మయపడుతున్నారా? మరేం లేదు.. ఇది సింహగిరిపై జరిగిన వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం ఉదయం జరిగిన వినోదోత్సవంలో చోటుచేసుకున్న ఘట్టం. ఏటా ఏడు రోజులపాటు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామివారి ఉంగరం కనిపించకపోవడంతో ఆయనకు అదో సమస్య అవుతుంది. ఉంగరం ఉంటేనే రావాలని అమ్మవారు అలుగుతుంది. దీంతో స్వామి మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి.. భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తారు. అలా పలువురు భక్తులు ఉంగరం దొంగలనే అభియోగాన్ని ఎదుర్కొంటారు. చివరికి ఎక్కడా ఉంగరం దొరక్కపోయేసరికి.. స్వామికి ఆచ్ఛాదనగా ఉండే పరదాలలో అన్వేషించగా, చివరి పరదాలో ఉంగరం లభిస్తుంది. ఆద్యంతం రక్తికట్టే ఈ వేడుకను వినోదోత్సవంగా అభివర్ణిస్తారు. సింహగిరిపై ఆదివారం వినోదోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడే హీరో నితిన్ స్వామివారి దర్శనానికి సింహగిరికి వచ్చారు. అప్పుడు ఆయన్ని తాళ్లతో బంధించి ప్రశ్నించారు. కన్నీళ్లు.. గొడవలు నితిన్‌ను మాత్రమే కాక.. చాలామంది భక్తులను కూడా అలంకారి కరి సీతారామాచార్యులు బంధించగా.. స్థానాచార్యుడు రాజగోపాల్ కఠినంగా ప్రశ్నించారు. విషయం తెలిసిన భక్తులకు ఇది వినోదంగా ఉండగా.. చాలామంది భక్తులు ఏమీ తెలియక బెంబేలెత్తిపోయారు. స్వామివారి ఉంగరాన్ని తాము తీశామన్న అభియోగం ఎదుర్కోవడంతో వారు కలవరపడ్డారు. ‘స్వామి దర్శనానికి వస్తే దొంగలంటారేమిటండీ.. మేం దొంగల్లా కనిపిస్తున్నామా?’ అని కొందరు గర్జించారు. కొంతమంది వలవలా ఏడ్చేశారు. మరికొందరు స్థానాచార్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా చూస్తూ నవ్వుతున్న వారిపై చిర్రుబుర్రుల్లాడారు. చివరికిది వినోదోత్సవం అని తెలుసుకుని స్వామి తమకు కల్పించిన మహాభాగ్యమని ఆనందోత్సాహాలతో వెనుదిరిగారు. ఇలా విజయవాడకు చెందిన అనూష, విశాఖలో డిగ్రీ చదువుతున్న ఖర్గపూర్ వాస్తవ్యులు వందన, పింకీ, వినీత కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన తండ్రీకొడుకులు అప్పారావు, ప్రసాద్, విశాఖ విద్యార్ధినులు కావ్య, ప్రమీల స్థానాచార్యులతో వాదులాడారు. విశాఖలో గుర్రంపాలేనికి చెందిన అమిత్, అలేఖ్య, గోపాలపట్నానికి చెందిన నూతన దంపతులు రవి, ఆకాంక్ష ‘దొంగలు’గా చిక్కారు. గీతం కళాశాల బిటెక్ విద్యార్ధినులు మౌనిక, నివేదిత, స్వప్న, శ్రీకాకుళం రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న మోహన్, మణి దంపతులు తదితరులు ఉంగరం దొంగలుగా పట్టుబడ్డారు. ఆలయ కొత్వాల్ నాయక్, ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్, పీఆర్వో జైమునిలనూ బంధించారు. చివరికి స్థానాచార్యులు, హవల్దార్ కూడా దొంగలుగా చిక్కారు. -
అప్పన్న సన్నిధిలో విదేశీ బృందం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం విదేశీ అధికార బృందం దర్శించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణావృద్ధిని పరిశీలించేందుకు పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్రీ్టయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో తరలివచ్చారు. కప్పసం్తభాన్ని ఆలింగనం చేసుకుని బేడాచుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అషో్టత్తరంపూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. హుండీఆదాయం రూ.99.52 లక్షలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 29 రోజులకు రూ. 99 ,52, 490 వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. నగదుతోపాటు 125 గ్రాముల బంగారం, 8 కిలోల 750 గ్రాముల వెండి వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శ్రీహరి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
26న సింహగిరిపై శ్రీకృష్ణాష్టమి
ఆ రోజు రాత్రి 7 గంటల వరకే అప్పన్న దర్శనాలు 27న ఉట్ల సంబరం సింహాచలం : సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 26న శ్రీకృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించనున్నట్టు సింహాచలం దేవస్థానం ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ తెలిపారు. ఆ రోజు బేడా మండపంలో శ్రీకృష్ణ జననోద్ధారణ పూజలు విశేషంగా నిర్వహిస్తామని సోమవారం విలేకరులతో చెప్పారు. బాలకృష్ణుడికి విశేష అభిషేకాలు చేస్తామన్నారు. 27న సాయంత్రం 4 గంటలకు ఉట్ల సంబరాన్ని నిర్వహిస్తావన్నారు. ఈ ఉత్సవంలో స్వామి శ్రీకృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 26న రాత్రి 7 గంటల వరకే భక్తులకు దర్శనాలు కల్పిస్తారు.