26న సింహగిరిపై శ్రీకృష్ణాష్టమి | Krishna astami at simhagiri on 26th august | Sakshi
Sakshi News home page

26న సింహగిరిపై శ్రీకృష్ణాష్టమి

Published Mon, Aug 22 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

26న సింహగిరిపై శ్రీకృష్ణాష్టమి

26న సింహగిరిపై శ్రీకృష్ణాష్టమి

  • ఆ రోజు రాత్రి 7 గంటల వరకే అప్పన్న దర్శనాలు
  •  27న ఉట్ల సంబరం
  • సింహాచలం : సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 26న శ్రీకృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించనున్నట్టు సింహాచలం దేవస్థానం ఏఈవో ఆర్‌.వి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. ఆ రోజు బేడా మండపంలో శ్రీకృష్ణ జననోద్ధారణ పూజలు విశేషంగా నిర్వహిస్తామని సోమవారం విలేకరులతో చెప్పారు. బాలకృష్ణుడికి విశేష అభిషేకాలు చేస్తామన్నారు. 27న సాయంత్రం 4 గంటలకు ఉట్ల సంబరాన్ని నిర్వహిస్తావన్నారు. ఈ ఉత్సవంలో స్వామి శ్రీకృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 26న రాత్రి 7 గంటల వరకే భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement