ప్రవర్తన మార్చుకోమని ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మెదక్ : ప్రవర్తన మార్చుకోమని ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ... గ్రామానికి చెందిన భాగ్యశ్రీ (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది.
ఈ క్రమంలో తోటి విద్యార్థులతో చనువుగా ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయులు ప్రవర్తన మార్చుకోమని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి భాగ్యశ్రీని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.