సాక్షి, రంగారెడ్డి : సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యారి్థని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన వెల్దుర్తి మనోహరాచారి, లావణ్య దంపతులు. పదేళ్లుగా మీర్‌పేట సర్వోదయనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కుమార్తెలు కౌశికి (17), అనుశ్రీ, కుమారుడు రేవంత్ ఉన్నారు. పెద్ద కుమార్తె కౌశికి ఐఎస్‌సదన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరచూ సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండడాన్ని గమనించిన తండ్రి ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గేమ్స్ ఆడడం ఆపేసి పడుకోవాలని మందలించి బయటకు వెళ్లాడు.
చదవండి: ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది!
మనస్తాపానికి గురైన కౌశికి క్షణికావేశంలో బెడ్‌రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గదిలో నుంచి అరుపులు వినపడడంతో గమనించిన తల్లి కిటికీలోంచి చూడగా కౌశికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అదే గదిలో పడుకున్న చిన్న కుమార్తె అరుపులకు లేచి గడియ తీసింది. వెంటనే తల్లి స్థానికుల సాయంతో కౌశికిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.
చదవండి: చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి
Comments
Please login to add a commentAdd a comment