Is Director Radha Krishna Gave Hint On Radhe Shyam Movie Postpone? - Sakshi
Sakshi News home page

Radhe Shyam Movie: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్‌ గారూ..

Published Tue, Jan 4 2022 1:27 PM | Last Updated on Tue, Jan 4 2022 4:18 PM

Is Radha Krishna Kumar Indirectly Hints Radhe Shyam Will Be Postponed - Sakshi

Director Radha Krishna Kumar Indirectly Hints Radhe Shyam Will Be Postponed: అందరూ ఊహించిందే జరిగింది. ‘రాధేశ్యామ్‌’ ప్రేక్షకులకు భారీ షాక్‌ ఇస్తూ దర్శకుడు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. పరిస్థితులు బాగా లేవు అందరూ అప్రమత్తంగా ఉండండి, ఏది మన చేతిలో లేదంటూ దర్శకుడు రాధ కృష్ణ చేసిన అభిమానుల్లో గందగోళాన్ని సృష్టింస్తోంది. ఈ ట్వీట్‌ దేనికి సంకేతం, అందరూ ఊహించినట్టే రాధేశ్యామ్‌ కూడా వాయిదానా? అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు దర్శకుడు. ఇక ఈ సారి సంక్రాంతి పండగ పెద్ద సినిమాలతో సందడి చేయబోతుందని ఆశించిన ప్రేక్షకులకు ఇప్పటికే నిరాశ ఎదురైంది.

చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్‌

జనవరి 7న వస్తుందనుకున్న పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడింది. దీంతో రాధేశ్యామ్‌ కూడా వాయిదా పడుతుందని అందరూ అభిప్రాయ పడగా.. మూవీ మేకర్స్‌, యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ ఏదేమైనా ఈ సంక్రాంతికి రాధేశ్యామ్‌ రావడం ఖాయమంటూ ప్రకటించడంతో సినీ ప్రేక్షకులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడిన రాధేశ్యామ్‌ మాత్రం వినోదం పంచేందుకు వస్తుందని అందరూ ఆనందంలో మునిగితేలుతున్న నేపథ్యంలో తాజాగా దర్శకుడు చేసిన ట్వీట్‌ ప్రేక్షక్షులను కలవరపెడుతోంది.

చదవండి: అత్యంత ఆప్తుడిని కోల్పోయా: సూపర్ స్టార్ కృష్ణ

‘సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి- టీమ్ రాధేశ్యామ్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌డైరెక్టర్‌గా ‘రాధేశ్యామ్’ వాయిదా పడుతోందని మేకర్స్ తెలుపుతున్నట్లుగా కనిపనిస్తోంది ఈ ట్వీట్‌. ఎదైనా ఉంటే నేరుగా చెప్పండి.. ఇదేంటి డైరెక్టర్‌ గారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

అయినా దీనిపై చిత్ర బృందం నోరు విప్పడం లేదు. వీరు తీరు చూస్తుంటే ఈ సంక్రాంతికి కూడా చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతవరకు రాధేశ్యామ్‌ టీం ప్రమోషనస్‌ కార్యక్రమాలు కానీ, ఇంటర్య్వూలు కానీ ఇవ్వడం లేదు. ఇవన్నీ లేకుండా సినిమాను ఎలా విడుదల చేస్తారని నెటిజన్లు ముందునుంచే అనమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి అనుమానాన్ని నిజం చేసేలా డైరెక్టర్‌ ట్వీట్‌ చేశారు. మరి దీనిపై మేకర్స్‌ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement