మరో దర్శకుడిని లైన్లో పెట్టాడు | jil director next movie with prabhas | Sakshi
Sakshi News home page

మరో దర్శకుడిని లైన్లో పెట్టాడు

Published Fri, Dec 11 2015 12:22 PM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

మరో దర్శకుడిని లైన్లో పెట్టాడు

మరో దర్శకుడిని లైన్లో పెట్టాడు

ఇప్పటికీ బాహుబలి సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. యంగ్ డైరెక్టర్లతో స్టైలిష్ ఎంటర్టైనర్లకు రెడీ అవుతున్నా.. ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో మాత్రం అర్ధం కావటంలేదు. ఇంకా బాహుబలి 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ అయితే గాని ప్రభాస్ మరో సినిమా మొదలు పెట్టడానికి అవకాశం లేదు.

ఇప్పటికే 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు ప్రభాస్. ఈ సినిమా కోసం వేరే ప్రయత్నాలేవి చేయకుండా వెయిట్ చేస్తున్నాడు సుజిత్. అయితే తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. సుజిత్ను పరిచయం చేసిన యువి క్రియేషన్స్ బ్యానర్ ద్వారానే దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు ప్రభాస్. తొలి సినిమా జిల్తో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధకృష్ణ ప్రభాస్తోనూ అదే తరహా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.

బాహుబలి 2 తరువాత ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి ముందుగా ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అయితే దర్శకుడు ఎవరైన ఆ సినిమాను నిర్మించేది మాత్రం యువి క్రియేషన్స్ సంస్థే అన్న టాక్ వినిపిస్తోంది. ఏ సినిమా అయిన 2016లో అయితే తెర మీదకు వచ్చే అవకాశం మాత్రం కనిపించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement