
బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆమిర్ ఖాన్ లొకేషన్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. షారుక్ ఖాన్ స్క్రిప్ట్ ఫైనల్ చేస్తున్నారు. మరి సల్మాన్ ఖాన్? సల్మాన్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అని సల్మాన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ మొదటివారం నుంచి భాయ్ బరిలో దిగనున్నారని తెలిసింది. అక్టోబర్ 1 నుంచి ‘బిగ్‌బాస్’ షో చిత్రీకరణలో పాల్గొంటారు సల్మాన్ ఖాన్.
ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే’ చిత్రానికి సంబంధించిన మిగిలిన చిత్రీకరణ పూర్తి చేస్తారట. పదిరోజులు పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ఓ పాట కూడా చిత్రీకరించనున్నారు. చిత్రీకరణ ప్రారంభమయ్యేలోగా ప్రభుదేవా ముంబై చేరుకొని కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటారట. ‘రాధే’ చిత్రాన్ని ఈ క్రిస్మస్ లేదా వచ్చే గణతంత్ర దినోత్సవానికి విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment