కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment