సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం 'రీమేక్'. మంచి కథ చెప్పాలనో లేదా పని ఈజీ అయిపోతుందనో తెలీదు కానీ స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు రీమేక్స్‌పై అప్పుడప్పుడు మోజు పడుతుంటారు. అయితే ఈ మధ్య ఆ సరదా కొంచెం ఎక్కువైంది. మెగాబ్రదర్స్‌నే తీసుకుంటే.. ఈ మధ్యే వారాల వ్యవధిలో తలో రీమేక్ సినిమాని రిలీజ్ చేశారు. వీటికి పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువొచ్చింది. చిరంజీవి-పవన్ ఈ రీమేక్స్‌లో నటించడం ఓ కారణమైతే, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడం మరో కారణం. ఇంతకీ అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!)
చిరంజీవి 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకు రీమేక్. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే మెగా అభిమానులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వాళ్ల బాధ పట్టించుకునే నాథుడు ఎవరు? ఇక మెహర్ రమేశ్ దర్శకుడు అని తెలియగానే గగ్గోలు పెట్టారు. ఏం చేస్తాడో ఏంటో అని భయపడ్డారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నదే నిజమైంది. ఎప్పుడో జమానా కాలంలో తీయాల్సిన మూవీ ఇప్పుడు తీశారని, చిరు ఇమేజ్ డ్యామేజ్ చేశాడని బండ బూతులు తిడుతున్నారు!
మెగాస్టార్ చిరంజీవి అసలు 'భోళా శంకర్' ఎందుకు చేశారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టి.. చిరుతో పాటు దక్షిణాదిలో ఆయా భాషల్లో పేరు తెచ్చుకున్న స్టార్ హీరోలు. వాళ్లందరికీ రియాలిటీ అర్థమై, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరు కూడా ఆ తరహా కథలను ఎంచుకుంటే బెటర్. భోళా.. లాంటి సినిమాలు ఒకప్పుడు ఆడేవేమో కానీ ఇప్పుడు అయితే చాలా కష్టం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. ఏ చిన్న తప్పు దొరికినా ఏకిపారేస్తారు. ఇప్పుడు వాళ్లకు 'భోళా శంకర్' దొరికింది. ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!)
చిరు సంగతి ఇలా ఉంటే పవన్ పరిస్థితి ఇంకా విచిత్రం! రీఎంట్రీ తర్వాత పవన్ మూడు సినిమాలు చేస్తే.. అవన్నీ హిందీ, మలయాళ, తమిళంలో వచ్చిన చిత్రాలకు రీమేక్స్. పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనే ఆలోచనతో సినిమాలు చేశాడు! ఫ్యాన్స్ ఏమో దీన్ని 'మహా ప్రసాదం' అన్నట్లు హడావుడి చేశారు. కట్ చేస్తే సాధారణ ప్రేక్షకుడు మాత్రం 'మాకేంటి ఈ ఖర్మ' అని తనలో తానే తిట్టుకున్నాడు.
అయితే మెగా బ్రదర్స్ చేస్తున్న రీమేక్స్ మెగా అభిమానులని ఎంటర్‌టైన్ చేయొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడి మాత్రం వీళ్లకు మెల్లగా దూరమైపోతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కాస్త లేటయినా సరే స్ట్రెయిట్ కథలతో సినిమాలు చేస్తే పర్లేదు. అలా కాదు మేం రీమేక్స్ చేస్తాం అనుకుంటే మాత్రం మెగాస్టార్, పవర్‌స్టార్ అనే ట్యాగ్స్ హిస్టరీలో తప్ప రియాలిటీలో కనిపించవు! అభిమానులకు బాధగా అనిపించినా సరే ఇదే నమ్మలేని నిజం.
(ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు)
Comments
Please login to add a commentAdd a comment