చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం (ప్రచారంలో ఉన్న టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’) షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. హీరో రవితేజ కీలక పాత్ర చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.
తాజా షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. చిరంజీవిగారిని మునుపెన్నడూ చూడని మాస్, పవర్ ప్యాక్డ్ పాత్రలో చూపించనున్నారు బాబీ. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే ఇచ్చారు. 2023 సంక్రాంతికి చిత్రం విడుదల కానుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్థర్ ఎ విల్సన్.
Comments
Please login to add a commentAdd a comment