shruti hasan
-
మాస్ యాక్షన్ స్టార్ట్
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం (ప్రచారంలో ఉన్న టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’) షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. హీరో రవితేజ కీలక పాత్ర చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. తాజా షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. చిరంజీవిగారిని మునుపెన్నడూ చూడని మాస్, పవర్ ప్యాక్డ్ పాత్రలో చూపించనున్నారు బాబీ. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే ఇచ్చారు. 2023 సంక్రాంతికి చిత్రం విడుదల కానుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్థర్ ఎ విల్సన్. -
అప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ‘సలార్’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. శృతి నటిగా కంటే ముందు ఇండస్ట్రీకి గాయనీగా పరిచయమైన సంగతి తెలిసిందే. తన తండ్రి, విలక్షణ నటుటు కమల్ హాసన్ ‘ఈనాడు’ సినిమాలో ఆమె ఓ పాట పాడింది. ఆ తర్వాత కమల్ దర్శకత్వంలో వచ్చిన ‘హేరామ్’ మూవీలో అతిథిగా పాత్రలో కనిపించి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా నటిగా తన జర్నీని స్టార్ట్ చేసిన శృతికి సంగీతం అంటే ప్రాణమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మ్యూజిక్ మీద ఆసక్తితోనే తను సినిమాల్లోకి వచ్చానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న శృతి హీరోయిన్గా ఎలా మారిందో వివరించింది. ‘కాలేజీలో ఉన్నప్పుడు రాక్‌స్టార్ అవ్వాలని కలలు కనేదాన్ని. ఎలాగైన సొంతంగా ఒక రాక్‌బ్యాండ్ నడపాలి అనుకున్న. అయితే బ్యాండ్ నడపాలంటే డబ్బు కావాలి. అప్పడు నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే రెండు, మూడు సినిమాలు చేసి ఆ డబ్బుతో బ్యాండ్ స్టార్ట్ చేసి సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్న. కానీ ఇక్కడకు వచ్చాక నాకు తెలియకుండానే నటనను ఇష్టపడ్డాను. మెల్లిగా సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఇండస్ట్రీయే నా ప్రపంచం అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న సంగీతాన్ని మాత్రం వదిలి పెట్టలేదని, విరామం దొరికినప్పుడు తన సమయం మ్యూజిక్కు కేటాయిస్తానని ఆమె పేర్కొంది. కాగా ప్రస్తుతం శృతి తన బాయ్‌ఫ్రెండ్ శాంతానుతో కలిసి మ్యూజిక్ మొదలు పెట్టె ప్లాన్‌లో ఉన్నట్లు తెలిపింది. అయితే మీ తండ్రి పెద్ద స్టార్ కదా ఆయన దగ్గర డబ్బు ఎందుకు తీసుకోలేదని అడగ్గా.. తనకు సొంతగా ఎదగడం ఇష్టమని, అది తన కల, తాను సొంతంగా సంపాదించిన డబ్బుతోనే కలను నిజం చేసుకోవాలనుకున్నానని శృతి తెలిపింది. -
అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క!
‘బాహుబలి’ వంటి బ్రహ్మాండమైన హిట్ తర్వాత హీరో ప్రభాస్, పవర్ఫుల్ యాక్టర్ రమ్యకృష్ణ మరోసారి కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి.. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌కు అమ్మ (పవర్ఫుల్ శివగామి పాత్ర)గా నటించిన రమ్యకృష్ణ...‘సలార్’లో అక్క పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాల్సిందే. మరోవైపు ‘బాహుబలి’ తర్వాత ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. అది కూడా తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారట ప్రభాస్. ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. -
డేట్ ఫిక్స్
చాలారోజులుగా మిస్ అయిన జోష్‌ను మళ్లీ థియేటర్స్‌కి తీసుకురావడానికి రెడీ అంటోంది ‘క్రాక్’ టీమ్. ఇందుకోసం డేట్‌ని కూడా ఫిక్స్ చేసింది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఇందులో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు రవితేజ. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు సంగీత దర్శకుడు తమన్. -
శ్రుతి బయోపిక్ జ్వాలాముఖి
మీ బయోపిక్‌కి ఏం టైటిల్ పెడతారు? అని అడిగితే, ‘జ్వాలాముఖి’ అన్నారు శ్రుతీహాసన్. అంటే... భవిష్యత్తులో శ్రుతి జీవితాన్ని వెండితెరపై చూసే అవకాశం ఉందని ఊహించవచ్చు. వారాంతంలో అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ చేశారు శ్రుతీహాసన్. అప్పుడు ఓ ఫ్యాన్ ‘మీ బయోపిక్ టైటిల్ ఏంటి’ అంటే, ‘జ్వాలాముఖి’ అన్నారామె. ఇంతకీ ఈ బ్యూటీ జీవితంలో ఓ బయోపిక్‌కి కావాల్సినంత మసాలా ఉందా? అంటే.. విలక్షణ నటుడు కమల్‌హాసన్, నటి సారికల కూతురిగా శ్రుతీది గోల్డెన్ స్పూన్ అయినప్పటికీ, తల్లిదండ్రులకు ఉన్న పేరు వల్ల చిన్నప్పుడు స్వేచ్ఛ కోల్పోయారు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కమల్‌లా మంచి యాక్టరేనా? అనే కామెంట్లు ఒకటి. సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రుతి ప్రతి పాత్రనూ సవాల్‌గా తీసుకుని చేసి, అనుకున్నది సాధించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ‘ఐరన్ లెగ్’ అన్నారు కొందరు. అలానే లవ్, బ్రేకప్ వంటివి కూడా ఉన్నాయి. నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో శ్రుతి బయోపిక్ తీస్తే అప్పటి విశేషాలు, ఇప్పటివరకూ జరిగినవి కలిపితే ఓ మంచి సినిమా తయారవుతుందని ఊహించవచ్చు. -
పాటతో ప్యాకప్
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ సమర్పణలో బి.మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. రవితేజ, శ్రుతీహాసన్‌లపై ఆ పాటను చిత్రీకరించి, ప్యాకప్ చెబుతారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సంగీతం: యస్.యస్. తమన్. -
అబ్బే... ఆ ఉద్దేశం లేదు
‘రాజకీయమా? నేనా? అబ్బే.. ఆ ఉద్దేశమే లేదు’ అన్నారు శ్రుతీహాసన్. ‘మీ నాన్నగారు పార్టీ స్థాపించారు కదా. మిమ్మల్ని కూడా రాజకీయాల్లో చూడొచ్చా’ అని శ్రుతీహాసన్‌ని అడిగితే ఆమె నుంచి ఈ సమాధానం వచ్చింది. దీని గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం అయినా, సినిమాకు దర్శకత్వం వహించడం అయినా పెద్ద పొరపాటు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమందికి హాని చేసినవాళ్లం అవుతాం. మా నాన్నగారి పార్టీ ప్రచారానికి కూడా నేను వెళ్లను. ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన విజన్‌ను నేను నమ్ముతాను. ఆయనకు మంచి జరగాలని కచ్చితంగా కోరుకుంటాను’ అన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశలో నటీనటులు పారితోషికం తగ్గించుకోవాలని ఇటీవల చిత్రపరిశ్రమకు సంబంధించిన కీలక శాఖలవారు పేర్కొన్నారు. ఆ విషయం గురించి శ్రుతీహాసన్‌ని అడిగితే – ‘నిజానికి సినిమా ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చెల్లించేది చాలా తక్కువ. ఇద్దరి పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఉంది. హీరో అందుకుంటున్న రెమ్యునరేషన్ హీరోయిన్‌కి రావాలంటే కచ్చితంగా మరో 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు. -
ఇకపై రీమేక్స్‌చేయను!
‘‘హీరో ఇమేజ్ నుంచి అతణ్ణి మనం బయటకు తీయలేం. హీరోలను ఎంత కొత్తగా చూపించినా వాళ్ల ఇమేజ్ ఎక్కడో చోట పని చేస్తుంది. ‘దంగల్’లో ఆమిర్ ఖాన్, ‘సుల్తాన్’లో సల్మాన్ ఖాన్ ఇమేజ్ పని చేసింది కదా! పవన్ కల్యాణ్‌గారు అనే కాదు... ఏ కమర్షియల్ హీరో అయినా మాస్ డైలాగులు చెబుతూ, మీసం తిప్పాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కొత్త పాత్రలోకి హీరోని ఎంత బాగా మౌల్డ్ చేయగలిగారనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది’’ అన్నారు దర్శకుడు కిశోర్ పార్ధసాని (డాలీ). పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ గత శుక్రవారం రిలీజైంది. సోమవారం మీడియా సమావేశంలో డాలీ చెప్పిన విశేషాలు ⇒ పవన్‌కల్యాణ్‌గారు గత సినిమాల్లో కంటే... ‘కాటమరాయుడు’లో కొత్తగా కనిపించారని, ఇప్పటివరకూ ఆయన్ని అలాంటి పాత్ర, సన్నివేశాల్లో చూడలేదనీ ప్రేక్షకులు అంటున్నారు. కల్యాణ్‌గారి ఇమేజ్‌కి సినిమా అంతా పంచెకట్టు అంటే భయం వేసింది. కానీ, ఫస్ట్ డే షూటింగ్లో ఆయన్ను చూడగానే తప్పకుండా వర్కౌట్ అవుతుందనుకున్నాం. అందుకే ఓ ఫైట్‌ను పంచెకట్టులో డిజైన్ చేశాం. ⇒ ‘గోపాల గోపాల’ తర్వాత కల్యాణ్‌గారు నాతో సినిమా చేస్తానన్నారు. ఓ కథ రాసి, చెప్పా. ఆ సినిమా డైలాగ్ వెర్షన్ కంప్లీట్ కావడానికి నాలుగైదు నెలలు పడుతుందనగా... ఆయనే పిలిచి ఈ ఛాన్స్ ఇచ్చారు. ‘వీరమ్’ పాయింట్, కమర్షియల్ అంశాలు నచ్చాయి. అమ్మాయిలను ద్వేషించే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లైఫ్‌లోకి ఓ అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ ఆసక్తిగా అనిపించింది. తెలుగులో ఆ ప్రేమకథను ఎక్కువ ఎలివేట్ చేశాం. ప్రేక్షకులూ కల్యాణ్‌గారిని అలానే చూడాలనుకుంటున్నారు. కథపై క్లారిటీతో ఉంటే ఏ హీరో అయినా... దర్శకుడికి స్వేచ్ఛ ఇస్తారు. అమితాబ్ బచ్చన్, పవన్‌కల్యాణ్ ఎవరైనా! ‘గోపాల గోపాల’కు ముందు కల్యాణ్‌గారు మూడీ అనీ, దర్శకుడికి ఫ్రీడమ్ ఇవ్వరనీ నేనూ విన్నాను. కానీ, ఆయనతో పని చేయడం నాకు నచ్చింది. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. హి ఈజ్ వెరీ కూల్. ⇒ ఫారిన్లో తీసిన పాటల్లో శ్రుతీహాసన్ కాస్ట్యూమ్స్, లుక్స్‌పై విమర్శలు వస్తున్నాయని ఆయన్ను అడగ్గా ‘‘ఆమె బాగా నటించారు. ముఖ్యంగా రెండు పాటల్లో శ్రుతి కాస్ట్యూమ్స్‌పై మా అభిప్రాయమూ అదే. ముంబయ్ డిజైనర్లు వాటిని డిజైన్ చేశారు. జాగ్రత్తపడే లోపే పరిస్థితి చేయి దాటింది’’ అన్నారు. ⇒ స్ట్రయిట్ సినిమా తీసినా... హాలీవుడ్ సినిమా లేదా ఎక్కడో చోటనుంచి కొందరు స్ఫూర్తి పొందుతారు. రీమేక్ సినిమా కూడా అంతే. మక్కీ టు మక్కీ రీమేక్ చేయడం నాకిష్టం లేదు. రీమేక్‌లో కథ తీసుకుని ఫ్రెష్ స్క్రిప్ట్ చేస్తా. ఈ సినిమాలో ఫస్టాఫ్ మాగ్జిమమ్ మార్చేశా. ఇప్పటికే మూడు రీమేక్స్ చేశా. ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు. ⇒ ఈ సినిమాకి జరిగినంత పైరసీ గతంలో ఏ సినిమాకీ జరగలేదనుకుంట! ఫేస్బుక్ చూస్తే దారుణంగా సినిమాలో అన్ని క్లిప్స్ పోస్ట్ చేశారు. మన దేశంలో మేజర్ ఎంటర్టైన్మెంట్ సినిమానే. అలాంటి ఎంటర్టైన్మెంట్ను దయచేసి చంపకండి. సోషల్ మీడియాలో సీన్స్ చూడడం వల్ల సినిమా చూసేటప్పుడు అందులోని బ్యూటీ మాయమవుతుంది. సైబర్ క్రైమ్‌లో పైరసీపై మేం కంప్లైంట్ చేశాం. పైరసీ చేసినోళ్లపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. -
సంగారెడ్డిలో ‘కాటమరాయుడు’ సందడి
► దుర్గామాత సన్నిధిలో హీరో పవన్‌కల్యాణ్‌పై సన్నివేశం చిత్రీకరణ ► షూటింగ్లో పాల్గొన్న శ్రుతి హాసన్ తదితరులు సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటలోని సప్త ప్రాకారయుత దుర్గాభవానీ మాత ఆలయంలో ‘కాటమ రాయుడు’ సందడి చేశారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ జంటగా కాటమ రాయుడు చిత్రాన్ని దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ) తెరకెక్కిస్తున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చిత్రంలో జాతరకు సంబంధించిన సన్నివేశాలను స్థానిక దుర్గా మాత ఆలయంలో మంగళవారం చిత్రీకరించారు. ప్రతి నాయకుడు అజయ్, సహ నటులు నాజర్, అలీ, పృథ్వీరాజ్, కమల్ కామరాజు, నందిత, రజిత తదితర ప్రధాన తారాగణం ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ల సన్నివేశాలను కెమెరాలో బంధించారు. నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో పవన్ కల్యాణ్ షేక్‌హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు కూడా దిగారు. అంతకుముందు దేవాలయంలో హీరోయిన్ శ్రుతి హాసన్‌తో కలిసి పవన్ కల్యాణ్ పూజలు చేశారు. -
సూర్య 'సింగం-3' టీజర్ ఎలా ఉందంటే..
-
రెండిచ్చినా నో అంటున్నా శ్రుతి
ఒక్కోసారి కొన్ని విషయాలు ఎలా జరిగినా ఇతరులను సంతోషంలో ముంచేస్తాయి. తాజాగా నటి శ్రుతిహాసన్ విషయంలోనూ అలాంటి సంఘటనే జరిగిందని సమాచారం. శ్రుతి చాలా బోల్డ్. అది వ్యక్తిగతం కావచ్చు, వృత్తిపరమైన అంశం కావచ్చు, ఇంకేమైనా కావొచ్చు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని బహిరంగంగానే చెప్పేంత ధైర్యవంతురాలు శ్రుతిహాసన్. కథానాయకిగా టాప్ పొజిషన్లో ఉన్నా మరోవైపు ఐటమ్ సాంగ్ చేయడానికీ ఏ మాత్రం వెనుకాడరు. అయితే అందుకు పారితోషకం మాత్రం భారీగానే డిమాండ్ చేస్తారు. దీన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతగా భావించవచ్చు. ఇటీవల ఒక సింగిల్ సాంగ్‌కు రెండు కోట్లు పారితోషికం చెల్లిస్తానన్నా నో అని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో తమిళ వర్గాలు శ్రుతి నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు చాలా సంతోషిస్తున్నాయట. దీనికీ, వారికీ సంబంధం ఏమిటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. శ్రుతిహాసన్ సింగిల్ సాంగ్ చేయనని చెప్పింది ఒక కన్నడ చిత్రానికట.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ కన్నడం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాగ్వుర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీప్తీసాతి నాయకిగా నటిస్తున్నారు. తన కొడుకు తొలి చిత్రం కావడంతో భారీగా రూపొందించాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారట. ఇందులో ఒక ప్రత్యేక సాంగ్‌లో నటి శ్రుతిహాసన్ నటిస్తే మరింత ప్రచారం లభిస్తుందన్న ఆలోచనతో ఆమెను సంప్రదించి అందుకు రెండు కోట్లు పారితోషికం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు, అయినా శ్రుతిహాసన్ నో అన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక తమిళ వర్గాల సంతోషానికి కారణం తమిళనాడుకు, కర్ణాటకకు మధ్య కావేరి నీటి సమస్య చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో శ్రుతిహాసన్ కన్నడ చిత్రంలో నటించడానికి నిరాకరించడం ఇక్కడి వారికి ఆనందాన్ని కలిగించడానికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అయితే శ్రుతిహాసన్ ఆ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయననడానికి అసలు కారణం ఏమిటో తెలియదు గానీ, ఆ పాటలో ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా మెరవనున్నారు. -
ఆ వార్తలో నిజం లేదు!
‘‘మా నాన్నతో కలసి నటించే అవకాశం వస్తే అంతకన్నా సంతోషపడే విషయం మరొకటి ఉండదు’’ అని శ్రుతీహాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. ‘శభాష్‌నాయుడు’ చిత్రంతో అది నెరవేరింది. కమల్ కూతురిగా ఈ చిత్రంలో శ్రుతి నటిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా కమల్‌హాసన్ నటించే అన్ని చిత్రాలకూ నటి, కమల్‌కి అత్యంత సన్నిహితురాలూ అయిన గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆమె ఆ బాధ్యత నిర్వరిస్తున్నారు. కాగా, కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమి-శ్రుతి మాటా మాటా అనుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లాస్ ఏంజిల్స్‌లో పెరిగే అమ్మాయిగా నటిస్తున్నారు. షూటింగ్ ఆరంభించక ముందు జరిగిన లుక్ టెస్ట్ కోసం గౌతమి తెచ్చిన డ్రెస్సుల్లో కొన్ని శ్రుతీకి అంత బాగా లేవనిపించాయట. మామూలుగా ఏ ఆర్టిస్ట్ అయినా తమ కాస్ట్యూమ్స్ గురించి దర్శక-నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్‌తో డిస్కస్ చేస్తుంటారు. అలా ఈ చిత్రం కోసం గౌతమి కాస్ట్యూమ్స్ తెచ్చినప్పుడు బెటర్మెంట్ కోసం శ్రుతి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారట. గౌతమి కూడా శ్రుతి అభిప్రాయాన్ని ఆమోదించి, మరికొన్ని డ్రెస్సులు తయారు చేయించారట. ఇదంతా స్నేహపూరిత వాతావరణంలో జరిగినప్పటికీ గౌతమి, శ్రుతి మాటా మాటా అనుకున్నారని ఎవరో ప్రచారం మొదలు పెట్టారు. శ్రుతీహాసన్ తన పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ద్వారా ‘అదేం లేదు’ అని స్పష్టం చేశారు. గౌతమి, శ్రుతి మధ్య మంచి అనుబంధం ఉందనీ, గౌతమిని తమ కుటుంబ సభ్యులలో ఒకరిలా శ్రుతి భావిస్తారని పీఆర్ టీమ్ పేర్కొంది. వాస్తవానికి కమల్‌హాసన్-గౌతమి ఒకే ఇంట్లో కలసి ఉంటున్నప్పటికీ శ్రుతి, అక్షర ఆ విషయంలో ఫీలైన దాఖలాలు కనిపించవ్. శ్రుతి అయితే ‘మా నాన్న అభిప్రాయాలను గౌరవిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గౌతమితో కూడా శ్రుతి, అక్షరలకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో గౌతమీతో తనకు మనస్పర్థలు వచ్చాయనే వార్త శ్రుతికీ బాధ కలిగించి ఉంటుంది. అందుకే ఇది కేవలం వదంతి మాత్రమే అని ఆమె స్పష్టం చేసి ఉంటారు. -
నేనా...హీరోయిన్ను ఏడిపించానా?
ప్రముఖ సినీనటి శ్రుతి హాసన్‌ను ఏడిపించినట్లు సామాజిక అనుసంధాన వేదిక (సోషల్ మీడియా)లో హల్చల్ చేసిన వార్తలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఖండించారు. తాను శ్రుతి హాసన్‌ను సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదన్నారు. అలాంటిది తాను శ్రుతి హాసన్‌ను ఎలా ఏడిపిస్తానని కామినేని ప్రశ్నించారు. తిరుపతికి తాను ఎప్పుడు వెళ్లిన కారులో వెళ్లి వస్తానని చెప్పారు. ఒక్కసారి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి తిరుపతి నుంచి విమానంలో వచ్చానన్నారు. ఏదో వార్త రావడం ఆ విషయం సామాజిక అనుసంధాన వేదికలో హల్చల్ చేయడం..దీనిపై మీడియాలో కథనాలు వెలువడటం.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా ప్రసారం చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే ....శుక్రవారం శ్రుతి హాసన్, మంత్రి కామినేని శ్రీనివాస్ ఒకే విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఆ క్రమంలో మంత్రిగారు గట్టిగా ఫోన్లో మాట్లాడుతుండగా... నిదానంగా మాట్లాడుకోండి అంటూశ్రుతి హాసన్ సదరు మంత్రిగారికి సలహా ఇచ్చింది. దాంతో మంత్రిగారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మేము ప్రజా ప్రతినిధులం పైగా మంత్రి వర్యులం... గట్టిగానే మాట్లాడతాం అని మంత్రి కోపంతో బదులు ఇచ్చారు. దీంతో శ్రుతి హాసన్ కన్నీటి పర్యంతమైయ్యారు. ఇది ప్రస్తుతం సామాజిక అనుసంధాన వేదికలో హల్చల్ చేస్తున్న కథనం. అంతేకాకుండా పలు ఛానల్స్ కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. దాంతో ఆ కథనాలపై శనివారం మంత్రి కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. అవన్నీ కట్టుకథలేనని ఆయన కొట్టిపారేశారు. -
ప్రిన్స్‌కు షాక్ ఇచ్చిన శృతి?
-
మహాపురుషుడై ఉండాలి
మహా పురుషుడిలాంటి మగాడు కావాలని కోరుకుంటున్నారు శ్రుతిహాసన్. అపజయాలు, విజయానికి నాంది అంటారు. నటి శ్రుతిహాసన్ విషయంలోనూ అది నిజమైంది. ఈ బ్యూటీ ఒకటి కాదు, రెండు కాదు (తమిళం, తెలుగు, హిందీ) మూడు భాషల్లో నటించినా తొలి చిత్రాలు నిరాశపరచాయి. అలాంటి నటికి ట్రేడ్ ఐరన్ లెగ్ ముద్ర వేయకుండా ఉంటుందా? శ్రుతి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అయితే అలాంటి ప్లాప్‌ల నుంచి దశల వారీగా హిట్స్‌తో దూసుకుపోతోంది. తొలుత తెలుగులో సక్సెస్‌ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పూజై చిత్రంలో తమిళంలో ఐరన్‌లెగ్ ముద్ర నుంచి బయటపడ్డారు. త్వరలో బాలీవుడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయడానికి సిద్ధం అవుతున్న ఈ బబ్లీగర్ల్తో చిన్న ఇంటర్వ్యూ ఇంతకుముందు తమిళ చిత్రాలపై సీత కన్నేశారనే ప్రచారానికి మీ సమాధానం? మొదట నేను తమిళ నటిననే ప్రస్తావించకండి. నేను భారతీయ నటిని. నాన్న దక్షిణ భారతానికి చెందిన వారు. అమ్మ ఉత్తర భారతానికి చెందినవారు. ఇక ఇల్లు నిజమైన భారత్ విలానే. అందుకే నేను భారతీయ నటినంటున్నాను. ఏ భాషలో మంచి అవకాశం లభిస్తే ఆ భాషలో నటిస్తున్నాను. అందువలన ఏడాదిలో ఎన్ని తమిళ చిత్రాలు చేయాలి, ఎన్ని తెలుగు, హిందీ చిత్రాలు అంగీకరించాలన్న డైరీ నా వద్ద లేదు. మీ నాన్న వైవిధ్యభరిత చిత్రాలకు ప్రాధాన్యత నిస్తుంటే మీరు కమర్షియల్ బాటపడుతున్నారేమిటి? నేను నటించిన 3 చిత్రం వైవిధ్యభరిత కథా చిత్రం కాదా? నా వరకు నేను అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాను. పూజై చిత్రం కమర్షియల్ ఫార్మెట్లో వున్నా ఆ చిత్రం లో నా పాత్రను దర్శకుడు హరి చక్కగా తీర్చిదిద్దారు. మరో విషయం ఏమిటంటే మా నాన్నతో నన్ను పోల్చకండి. ఆయన స్థాయి వేరు. నా స్థాయి వేరు. మీరు నాన్న కూతురా? అమ్మ కూతురా? వారిద్దరూ లేకపోతే నేను లేను. ఈ పట్టికలో నా చెల్లెల్ని కూడా చేర్చుకోండి. ఈ ముగ్గురే నా లోకం. వీరు లేకపోతే నేను లేను. మీ చెల్లెలు అక్షరకు నటనకు సంబంధించిన టిప్స్ ఇస్తారా? నిజం చెప్పాలంటే అక్షర చాలా తెలివైన అమ్మాయి. నేను టిప్స్ ఇచ్చేంత చిన్న పిల్ల ఏమి కాదు. తనే చాలా విషయాల్లో నాకు టిప్స్ చెబుతుంటుంది. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో గ్లామరస్ పాత్రల్లో రెచ్చిపోతున్నారనే ప్రచారం ఉంది కదా? గ్లామర్‌కు హద్దు లేమిటన్న విషయం నాకు తెలియదు. పాత్ర స్వభావాన్ని బట్టి నటిస్తుంటాను. నచ్చితే చూడండి. లేకపోతే చూడకండి. మీ నాన్న కమలహాసన్ పక్కా నాస్తికుడు. మీరేమో గుళ్లు, గోపురాలు తిరుగుతూ ఆస్తికురాలనిపించుకుంటున్నారే? నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. కుమారస్వామి నా ఇష్టదైవం. నా తండ్రి ఇచ్చిన స్వతంత్రమే నన్ను ఆస్తికురాలిని చేశాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారు? కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అందరమ్మాయిలు తన మగడు మహాపురుషుడులా ఉం డాలని కోరుకుంటారు. నేను అంతే. మంచి మనసు, మంచి చావ కలిగిన వాడై ఉండాలి. ఇక ఇంటిలో నాకు పెళ్లి కొడుకును చూస్తారా? అన్న విషయం తెలియదు. ప్రేమ వివాహమే జరుగుతుందనుకుంటున్నాను. -
శృతి హాసన్, తమన్నా లిప్ లాక్ సంచలనం!
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో లిప్ లాక్ ల హవా కొనసాగుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ వ్యవహారాలు చాలా సాధారణవుతున్నాయనుకున్నారేమో టాలీవుడ్ భామలు ఓ సంచలనానికి తెర తీశారు. దక్షిణాది, బాలీవుడ్ లో కూడా తమ గ్లామర్ తో వేడి పుట్టిస్తున్న శృతి హసన్, తమన్నాలిద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో లిప్ లాక్ చేశారంటూ బయటకు పొక్కిన వార్త దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. చెన్నైలో ఈ జరిగిన ఓ విందుకు హాజరైన తమన్నా, శృతి హాసన్ లిద్దరూ బహిరంగ ప్రదేశంలో కౌగింతలు, లిప్ లాక్ ల్లో మునిగిపోయారట. ఆతర్వాత వారెవరిని పట్టించుకోకుండా సుదీర్ఘ సంబాషణల్లో మునిగిపోయినట్టు తెలిసింది. చెన్నైలో శృతి హసన్ తో గడపడం చాలా బాగుంటుంది అని తమన్నా ట్విట్ చేయడం గమనార్హం. ఫోటోలు లీక్ అయ్యాయి. లీకైన ఫోటోలు ఈ అభిమానుల మొబైల్స్ లో హడావిడి సృష్టిస్తున్నాయి. -
ముంబయ్‌లో సొంత గూడు
హీరోయిన్లు చాలా తెలివైన వారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సూత్రాన్ని పాటిస్తున్నారు. అసలు విషయానికొస్తే నేటి క్రేజీ కథానాయికల్లో ఒకరిగా ప్రకాశిస్తున్న శ్రుతి హాసన్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దూసుకుపోతున్నారు. అదే విధంగా విజయాలతో యమా జోరుగా ఉన్న ఈ బ్యూటీ చెన్నై, హైదరాబాద్, ముంబాయి అంటూ షూటింగ్‌ల కోసం ఎక్కువ సమయాన్ని విమానంలోనే గడిపేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమెకంటూ ఈ మూడు ప్రాంతాల్లో సొంత నివాసం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబాయిలో ఒక సొంత గూడును ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ముంబాయిలోని బాంద్రా ప్రాంతంలో అద్దె ఇంటిలో ఉంటున్న శ్రుతి హాసన్ తాజాగా ముంబాయిలోని అందేరి ప్రాంతంలో సొంతంగా ఒక బంగ్లాను కొనుగోలు చేశారు. రెండు బెడ్రూమ్లతో కూడిన ఈ బంగ్లాను ప్రస్తుతం తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్ వర్క్‌ను చేయిం చుకుంటున్న శ్రుతి హాసన్ త్వరలోనే అక్కడికి మకాం మా ర్చనున్నారని సమాచారం. -
శృతిహాసన్‌కు ఝలక్ ఇచ్చిన బండ్ల గణేష్..?
-
ప్రేక్షకుల అంచనాలకు దూరంగా 'రామయ్యా వస్తావయ్యా'
గత కొద్దికాలంగా భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్, 'గబ్బర్ సింగ్' లాంటి సంచలన విజయం దక్కించుకున్న హరీష్ శంకర్ కలయికలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ప్రేక్షకుల వద్దకు వస్తుందంటే భారీ అంచనాలు ఉండటం సహజం. అలాంటి భారీ అంచనాలకు తోడుగా దిల్ రాజు నిర్మాణ సారధ్యం.. ఇటీవల కాలంలో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న సమంత.. గబ్బర్ సింగ్ హిట్ తో శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టారు. వీటన్నింటికి తోడు తమన్ సంగీతం.. హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అక్టోబర్ 11 తేదిన సినీ అభిమానులు ముందుకు వచ్చింది. అయితే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నింపిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అల్లరి చిల్లరిగా తిరిగే రాము ఉరఫ్ నందు అనే స్టూడెంట్.. ఆకర్ష అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు.. తన ప్రేమను ఒప్పింపి..మెప్పించడంలో సఫలమవుతాడు. అయితే ఆకర్ష అక్క పెళ్లికి అతిధిగా రాము వెళుతాడు. పెళ్లికి వెళ్లిన రాము ఆకర్ష తండ్రిని దారుణంగా చంపుతాడు. తాను ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి తండ్రిని రాము ఎందుకు చంపాల్సి వచ్చింది? అందుకు కారణాలేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రామయ్యా వస్తావయ్యా'. డైలాగ్స్ పేల్చడంలో.. డాన్స్ లను ఇరగదీయడంలో... ఫెర్మార్మెన్స్ తో మంత్రముగ్ధుల్ని చేయడంలో యువతరం నటుల్లోజూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్కరనేది కాదనలేం. గతంలో తన చిత్రాలతో జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు కూడా.. అయితే ఇటీవల కాలంలో జూనియర్ కథలను ఎంచుకోవడంలో కొంత తడబాటుకు గురవుతున్నాడని ఇటీవల ట్రాక్ రికార్డును తిరిగేస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్, కామెడీ అంశాలతో మూస చిత్రాలకే పరిమితం అవుతున్నాడనేది పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ ఓ వాదన. ఆ వాదనకు తగ్గట్టూగానే ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా చిత్రాని అంగీకరించాడేమో అనిపిస్తుంది. రామయ్య వస్తావయ్యా చిత్రంలో రాము పాత్ర జూనియర్ ఎన్టీఆర్ కు ఖచ్చితంగా సరిపోయే పాత్రనే. కాని.. జూనియర్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు వైవిధ్యమైన చిత్రాలను ఆశిస్తున్నారనే అంశం ప్రస్తుతం గమనించాల్సిన అంశం. రాము పాత్రకు జూనియర్ పూర్తి న్యాయం చేశాడనే విషయంలో డౌట్ అనవసరం. ఇంకా ఆకర్ష పాత్రలో సమంత మళ్లీ గ్లామర్ కే పరిమితమైంది. తనకు పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. గ్లామర్ తోపాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న అమ్ములు పాత్రను శృతి హసన్ అతిధి పాత్ర రూపంలో దక్కించుకుంది. ద్వితీయార్ధంలో అమ్ములు పాత్ర సినిమాకు కొంత బలాన్ని ఇచ్చింది. హంస నందిని క్లైమాక్స్ లో పాటలో మెరుపులా కనిపించినా.. అంత ప్రాధాన్యత ఉన్న పాత్రేమి కాదు. సినిమా తొలి భాగంలో విద్యుల్లేఖ రామన్ (ఎటో వెళ్లి పోయింది మనసు ఫేం) కామెడి ఆకట్టుకోలేకపోయింది. రావు రమేశ్, రవి శంకర్, కోట శ్రీనివాస్ రావు ఓకే అనిపించారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఓ మోడ్రన్ పాత్రలో రోహిణి హట్టంగడి కనిపించింది. శ్రీ మణి రాసిన 'పండగ చేస్కో', 'కుర్ర ఈడు', 'ఇది రణరంగం' బాగా ఉన్నాయి. అనంత శ్రీరాం రచించిన 'జాబిల్లి', 'ఓ లైలా'(భాస్కరభట్ల), 'నేను ఎపుడైనా' లాంటి సాహిత్య విలువలున్న పాటలకు తమన్ అందించిన స్వరాలు ప్రేక్షకుల్ని ఆలరించాయి. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫి పర్వాలేదనిపించింది. ఇక 'ట్రెండ్ ఫాలోకాను.. క్రియేట్ చేస్తాను' అంటూ గబ్బర్ సింగ్ లో అదరగొట్టిన దర్శకుడు హరీష్ శంకర్ .. రామయ్యా వస్తావయ్యా లాంటి మూస కథను ఎందుకు ఎంచుకున్నాడో అర్ధం కాదు. ఎప్పుడో 80 దశకాల్లో వర్కవుట్ అయ్యే కథ ప్రస్తుత ట్రెండ్ కు ఎలా సరిపోతుందనేది అర్ధం కాని విషయం. పగ, ప్రతీకారం ఎలిమెంట్స్ తో ప్రేక్షకులతోపాటు, సినిమాని కూడా నలిపేశాడు. గబ్బర్ సింగ్ కు ముందు యావరేజ్ దర్శకుడిగా బ్రాండ్ ఉన్న హరీష్... తన రేంజ్ అదేనని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడా అనిపించింది. ఎన్టీఆర్ ఎనర్జీ, సమంత, శృతి హసన్ గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్, మంచి సంగీతాన్ని అందించిన తమన్ కృషిని, ప్రముఖ నటి రోహిణి హట్టంగడి ప్రతిభను వినియోగించుకోవడంలో హరీష్ శంకర్ పూర్తిగా విఫలమయ్యాడు. వైవిధ్యంలేని కథను ఎంచుకున్న హరీష్ .. తన కథనంతో ప్రేక్షకుడ్ని విసిగించాడు. మంచి చిత్రాన్ని రూపొందించడానికి పూర్తి స్వేచ్చను ఇచ్చామని చెప్పిన దిల్ రాజు.. కాస్తా కంట్రోల్ చేసి ఉంటే దసరా సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కవుట్ అయ్యుండేది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విజయం సాధిస్తే ఎన్టీఆర్, సమంత, శృతి హసన్, తమన్ లకు ఆ క్రిడెట్ దక్కుతుంది. ఒకవేళ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే దర్శకుడిగా హరీష్ శంకర్ కారణమని చెప్పవచ్చు. ఏది ఏమైనా భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ లకు అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఊహించని నిరాశే ఎదురవ్వడం ఖాయం. -రాజబాబు అనుముల a.rajababu@sakshi.com For the latest stories, you can like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS