
శ్రుతీహాసన్, రవితేజ
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ సమర్పణలో బి.మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. రవితేజ, శ్రుతీహాసన్‌లపై ఆ పాటను చిత్రీకరించి, ప్యాకప్ చెబుతారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సంగీతం: యస్.యస్. తమన్.
Comments
Please login to add a commentAdd a comment