2021లో బాక్సాఫీస్ రన్ చాలా తక్కువ. కాని ఎక్కువగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న టాప్ యాక్టర్స్, యంగ్ హీరోస్ హిట్ ట్రాక్ అందుకోవడం ఈ ఇయర్ స్పెషాలిటీ. క్రాక్ టు అఖండ వరకు చూసుకుంటే 2021 కమ్ బ్యాక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.
‘క్రాక్’తొ కమ్ బ్యాక్
సంక్రాంతి సీజన్ లో రిలీజైన క్రాక్ మూవీతో మాస్ రాజా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2017 లో విడుదలైన రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ ,ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మాస్ రాజా కు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.
నరేశ్ విజయానికి ‘నాంది’
2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ సుడిగాడు తర్వాత మళ్లీ ఆ స్తాయిలో విజయాన్ని అందుకోవడానికి అల్లరి నరేష్ 2021 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పైగా అల్లరి నరేష్ తన అల్లరిని పక్కన పెట్టి పూర్తిగా సీరియల్ సబ్జెక్ట్ లో నటించి మెప్పించాడు.
సీటీ కొట్టించిన ‘సీటిమార్’
2014లో లౌక్యంతో సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. మధ్యలో చాలా చిత్రాలు చేసాడు కాని కావాల్సిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2021లో సీటీమార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు.
అఖిల్ ఖాతాలో భారీ విజయం
2015లో హీరోగా కెరీర్ ప్రారంభించాడు అఖిల్. హెలో, మిస్టర్ మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటికీ ఫస్ట్ హిట్ మాత్రం దక్కలేదు. కాని ఈ ఇయర్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఈ అక్కినేని హీరోగా మెమొరబుల్ హిట్ గా నిలిచింది.
‘అఖండ’తో నటసింహం బాక్సాఫీస్ వేట
రవితేజ, అల్లరి నరేష్, గోపీచంద్, అఖిల్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు. అఖండతో సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించాడు బాలయ్య. 2017లో విడుదలైన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు బాలయ్య. దాదాపు నాలుగేళ్ల తర్వాత అఖండతో బంపర్ హిట్ కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment