మహాపురుషుడై ఉండాలి | Exclusive Interview with Shruti Hasan | Sakshi
Sakshi News home page

మహాపురుషుడై ఉండాలి

Published Sat, Nov 1 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

మహాపురుషుడై ఉండాలి

మహాపురుషుడై ఉండాలి

 మహా పురుషుడిలాంటి మగాడు కావాలని కోరుకుంటున్నారు శ్రుతిహాసన్. అపజయాలు, విజయానికి నాంది అంటారు. నటి శ్రుతిహాసన్ విషయంలోనూ అది నిజమైంది. ఈ బ్యూటీ ఒకటి కాదు, రెండు కాదు (తమిళం, తెలుగు, హిందీ) మూడు భాషల్లో నటించినా తొలి చిత్రాలు నిరాశపరచాయి. అలాంటి నటికి ట్రేడ్ ఐరన్ లెగ్ ముద్ర వేయకుండా ఉంటుందా? శ్రుతి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అయితే అలాంటి ప్లాప్‌ల నుంచి దశల వారీగా హిట్స్‌తో దూసుకుపోతోంది. తొలుత తెలుగులో సక్సెస్‌ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పూజై చిత్రంలో తమిళంలో ఐరన్‌లెగ్ ముద్ర నుంచి బయటపడ్డారు. త్వరలో బాలీవుడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయడానికి సిద్ధం అవుతున్న ఈ బబ్లీగర్ల్‌తో చిన్న ఇంటర్వ్యూ

 ఇంతకుముందు తమిళ చిత్రాలపై సీత కన్నేశారనే ప్రచారానికి మీ సమాధానం?
మొదట నేను తమిళ నటిననే ప్రస్తావించకండి. నేను భారతీయ నటిని. నాన్న దక్షిణ భారతానికి చెందిన వారు. అమ్మ ఉత్తర భారతానికి చెందినవారు. ఇక ఇల్లు నిజమైన భారత్ విలానే. అందుకే నేను భారతీయ నటినంటున్నాను. ఏ భాషలో మంచి అవకాశం లభిస్తే ఆ భాషలో నటిస్తున్నాను. అందువలన ఏడాదిలో ఎన్ని తమిళ చిత్రాలు చేయాలి, ఎన్ని తెలుగు, హిందీ చిత్రాలు అంగీకరించాలన్న డైరీ నా వద్ద లేదు.
 
  మీ నాన్న వైవిధ్యభరిత చిత్రాలకు ప్రాధాన్యత నిస్తుంటే మీరు కమర్షియల్ బాటపడుతున్నారేమిటి?
  నేను నటించిన 3 చిత్రం వైవిధ్యభరిత కథా చిత్రం కాదా? నా వరకు నేను అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాను. పూజై చిత్రం కమర్షియల్ ఫార్మెట్‌లో వున్నా ఆ చిత్రం లో నా పాత్రను దర్శకుడు హరి చక్కగా తీర్చిదిద్దారు. మరో విషయం ఏమిటంటే మా నాన్నతో నన్ను పోల్చకండి. ఆయన స్థాయి వేరు. నా స్థాయి వేరు.
 
  మీరు నాన్న కూతురా? అమ్మ కూతురా?
  వారిద్దరూ లేకపోతే నేను లేను. ఈ పట్టికలో నా చెల్లెల్ని కూడా చేర్చుకోండి. ఈ ముగ్గురే నా లోకం. వీరు లేకపోతే నేను లేను.
 
  మీ చెల్లెలు అక్షరకు నటనకు సంబంధించిన టిప్స్ ఇస్తారా?
  నిజం చెప్పాలంటే అక్షర చాలా తెలివైన అమ్మాయి. నేను టిప్స్ ఇచ్చేంత చిన్న పిల్ల ఏమి కాదు. తనే చాలా విషయాల్లో నాకు టిప్స్ చెబుతుంటుంది.
 
  బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో గ్లామరస్ పాత్రల్లో రెచ్చిపోతున్నారనే ప్రచారం ఉంది కదా?
  గ్లామర్‌కు హద్దు లేమిటన్న విషయం నాకు తెలియదు. పాత్ర స్వభావాన్ని బట్టి నటిస్తుంటాను. నచ్చితే చూడండి. లేకపోతే చూడకండి.
 
 మీ నాన్న కమలహాసన్ పక్కా నాస్తికుడు. మీరేమో గుళ్లు, గోపురాలు తిరుగుతూ ఆస్తికురాలనిపించుకుంటున్నారే?
 నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. కుమారస్వామి నా ఇష్టదైవం. నా తండ్రి ఇచ్చిన స్వతంత్రమే నన్ను ఆస్తికురాలిని చేశాయి.
 
  పెళ్లెప్పుడు చేసుకుంటారు? కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
 అందరమ్మాయిలు తన మగడు మహాపురుషుడులా ఉం డాలని కోరుకుంటారు. నేను అంతే. మంచి మనసు, మంచి చావ కలిగిన వాడై ఉండాలి. ఇక ఇంటిలో నాకు పెళ్లి కొడుకును చూస్తారా? అన్న విషయం తెలియదు. ప్రేమ వివాహమే జరుగుతుందనుకుంటున్నాను.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement