ఇద్దరు శ్రుతీహాసన్‌లు కావాలి! | i love Music says shruti hassan | Sakshi
Sakshi News home page

ఇద్దరు శ్రుతీహాసన్‌లు కావాలి!

Feb 14 2015 11:26 PM | Updated on Sep 2 2017 9:19 PM

ఇద్దరు శ్రుతీహాసన్‌లు కావాలి!

ఇద్దరు శ్రుతీహాసన్‌లు కావాలి!

మీకు పాటలు పాడటం ఇష్టమా? నటనంటే ఇష్టమా? అని శ్రుతీహాసన్‌ని అడిగితే.. ‘‘రెండు కళ్లల్లో ఏది ముఖ్యమో చెప్పమంటే ఏం చెబుతాను’’ అంటారు.

 మీకు పాటలు పాడటం ఇష్టమా? నటనంటే ఇష్టమా? అని శ్రుతీహాసన్‌ని అడిగితే.. ‘‘రెండు కళ్లల్లో ఏది ముఖ్యమో చెప్పమంటే ఏం చెబుతాను’’ అంటారు. సంగీతం అంటే ఈ బ్యూటీకి చిన్నప్పట్నుంచీ ప్రాణం. కానీ, ఇప్పుడు కథానాయికగా బిజీ కావడం వల్ల సంగీతానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం ఏడు చిత్రాల్లో నటిస్తున్నాను. దాంతో ఏదైనా మ్యూజికల్ ఆల్బమ్ తయారు చేయాలని ఉన్నా తీరిక చిక్కడం లేదు. సంగీతం మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టే, అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు పాడుతున్నాను. ఒకవేళ పూర్తి స్థాయి గాయనిగా, నటిగా కొనసాగాలని ఆశపడితే అప్పుడు ఒకరు కాదు... ఇద్దరు శ్రుతీహాసన్‌లు కావాలి’’ అన్నారు సరదాగా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement