నచ్చినోడు ఇంకా దొరకలేదు | Kajal Agarwal makes decision on marriage | Sakshi
Sakshi News home page

నచ్చినోడు ఇంకా దొరకలేదు

Published Mon, Feb 2 2015 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

నచ్చినోడు ఇంకా దొరకలేదు

నచ్చినోడు ఇంకా దొరకలేదు

నచ్చినోడు ఇంకా నాకు దొరకలేదంటున్నారు నటి కాజల్ అగర్వాల్. అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మరో పక్క కాజల్ పెళ్లి ఆలోచనలో పడింది. వరుడి అన్వేషణ అధికమైంది వంటి ప్రచారాల్లో ఈ ముద్దుగుమ్మ సతమతమవుతోంది. అయితే, ఈ వ్యవహారం గురించి కాజల్ ఏ మంటుందో చూద్దాం.. అభిమానులు మా నుంచి మంచి చిత్రాలను ఆశిస్తుంటారు. మాకు మంచి కథనాలు ఎంచుకుని చేయాలని ఉంటుంది. అయితే, కొన్ని సమయాల్లో ఊహించినవి జరగక పోవడం సర్వసాధారణం. ఇక, నా విషయానికి వస్తే, తెలుగు, తమిళం, హిందీ, అన్ని భాషల్లోను మంచి అవకాశాలే వస్తున్నాయి.
 
 ఆ విధంగా చూస్తే, నేను చాలా అదృష్ట వంతురాలిని. ఇటీవల నా చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. వ్యక్తిగత విషయం ప్రస్తావిస్తూ, నా గురించి ఇటీవల రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి గురించి మీడియా ఎక్కువగా రాద్ధాంతం చేస్తున్నది. పెళ్లి  అన్నది జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. సరైన భాగస్వామి లభించినప్పుడు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అయితే, అది ఎప్పుడు అన్నది చెప్పలే ను. గత కొన్ని ఏళ్లుగా బిజీగా నటిస్తున్నాను. ఎంత బిజీ అంటే, ప్రేమించడానికి కూడా తీరిక లేనంతగా. నాకు నచ్చిన వ్యక్తి ఇప్పటికి తారాస పడలేదు. ప్రస్తుతానికి సినిమాను ప్రేమిస్తున్నాను.
 
 నటనపై దృష్టి సారిస్తున్నా. సినిమా, వ్యక్తిగతం అనేవి వేర్వేరు అన్నది నా భావన. కార్పొరేట్ సంస్థల్లో కూడా ఉద్యోగాలు చేసే మహిళలు వివాహానంతరం తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. సినిమాల్లో నటులు కూడా పెళ్లి అనంతర ం సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నారు. నాయకీ మణులు సినీ జీవితం మాత్రం అలా కాదు. పెళ్లి అయితే, ఇక వారి పనైనట్టు లేదు. అక్క, వదిన పాత్రలతో ప్రమోషన్ ఇచ్చినట్టే. అయితే, ఇటీవల అమలా పాల్‌తోపాటు కొందరు హీరోయిన్లు వివాహానంత రం కూడా అదే స్థాయిలో కొనసాగడం ఆనందం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement