నచ్చినవాడు తగిలితే ప్రేమిస్తా
నేను ప్రేమించడానికి అర్హతలున్న వ్యక్తి ఇంకా తారసపడలేదు అంటున్నారు నటి తమన్న. వయసొచ్చి పెళ్లికాని హీరోయిన్లలో ఈ అమ్మడు ఒక్కరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే దక్షిణాదిలోని తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ పాపులర్ నటి తమన్న. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో ఆర్య సరసన శరవణనుమ్ శివ ఒన్నా పడిచ్చవంగా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా కార్తీ సరసన ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు) ఒకటి చేస్తున్నారు.
దీంతో తమిళంలో మూడువసారి రౌండ్ కొట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. నటిగా దశాబ్దకాలం అనుభవం ఉన్న తమన్నకు ఎదురయ్యే ప్రశ్న ఏముంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని ప్రేమిస్తున్నారు? పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నల వర్షం కురుస్తోందామెపై అయితే అలాంటి ప్రశ్నలకు తమన్న తప్పు పట్టడం లేదు. వారి ఏమంటున్నారో ఆమె మాటల్లోనే నన్ను కలుసుకునే వారంతా ఎవరి ప్రేమిస్తున్నారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.
వాళ్లలా అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను చిత్రరంగ ప్రవేశం చేసి పదేళైంది. అందుకే వివాహం గురించి అడుగుతున్నారు. అయితే నా జీవితంలో అమ్మ, నాన్న, అన్నయ్యల ప్రేమ ఎప్పుడూ లభిస్తుంది. ఇకపోతే నేనెవర్నీ ప్రేమించ లేదు. అలాంటి అర్హత గల వ్యక్తి ఇంకా ఎదుటపడలేదు. సినిమాలో బిజీగా ఉండడం వలన ప్రేమించడానికి సమయం లేదు. అయితే నచ్చిన వాడు ఎదురైతే తప్పకుండా ప్రేమిస్తాను.