ఐటమ్ సాంగ్‌లో శ్రుతిహాసన్ | Shruthi Hassan ready for Item songs | Sakshi
Sakshi News home page

ఐటమ్ సాంగ్‌లో శ్రుతిహాసన్

Published Thu, Feb 26 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

ఐటమ్ సాంగ్‌లో శ్రుతిహాసన్

ఐటమ్ సాంగ్‌లో శ్రుతిహాసన్

ఆర్య చిత్రంలో ఐటమ్‌సాంగ్‌కు పచ్చజెండా ఊపా రు నటి శ్రతిహాసన్. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి శ్రతిహాసన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ యమ బిజీగా ఉన్నారు. అయినా అవసరమైతే ఐటమ్‌సాంగ్‌కు రెడీ అంటున్నారు. ఈ విషయంలో చాలామందిలా తన ఇమేజ్‌కు డామేజ్ లాంటి సందేహాలకు తావివ్వకుండా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధం అంటున్న శ్రుతి గట్స్‌ను మెచ్చుకోవలసిందే. ఒక ప్రముఖ నటి నాయకిగా నటిస్తున్న చిత్రంలో మరో ప్రముఖ నటి ఐట మ్ సాంగ్‌కు ఓకే అనడానికి ఆలోచిస్తారు. అయితే శ్రుతి మాత్రం వెనుకాముందు ఆలోచించకుండా నేను రెడీ అంటున్నారు.
 
 ఆ మధ్య తెలుగు చి త్రం ఆగడులో తమన్న హీ రోయిన్. అందులో శ్రతి హాసన్ ఐటమ్ సాంగ్ ఆడి దుమ్ము దులిపేశారు. అందు కు పారితోషికం కూడా అధికంగానే పుచ్చుకున్నారనే ప్రచారం జరిగిందనుకోండి. తాజాగా మరోసారి ఐటమ్‌సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆర్య, అనుష్క జంటగా ఇరండామ్ ఉలగం చిత్రం తరువాత కలసి నటిస్తున్న ద్విభాషా చిత్రం సింగపూర్ డేస్. ఇది మలయాళంలో విజయం సాధించిన బెంగళూరు డేస్ చిత్రానికి రీమేక్. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలముడి దర్శకత్వం వహిస్తున్నారు. పీవీవీ సినిమా పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో శ్రతిహాసన్ ఐటమ్‌సాంగ్ చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement