Item Songs
-
ఆ ఐటం సాంగ్స్‌కు డబ్బు తీసుకోలేదు: నోరా ఫతేహి
నోరా ఫతేహి.. ఐటం సాంగ్స్‌తో అల్లాడించే బ్యూటీని ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయట! అలాంటి దీన పరిస్థితిలోనూ రెండు ఐటం సాంగ్స్‌ను ఉచితంగా చేశానంటోంది అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ఫారిన్ వెళ్తున్న సమయంలో దిల్బర్, కమరియా పాటలు ఆఫర్ చేశారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించాను. డబ్బు అవసరం.. అయినా..మొదట కమరియా పాట షూటింగ్, రెండు వారాల తర్వాత దిల్బర్ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నాను. ఈ రెండు సాంగ్స్‌కు నేను పారితోషికం అందుకోలేదు. ఫ్రీగానే చేశాను. నిజానికి అప్పుడు నాకు డబ్బు అవసరం చాలా ఉంది. తినడానికి, ఇంటి అద్దె కట్టడానికి డబ్బు లేదు. అయినా సరే మనీ కంటే ముందు నన్ను నేను నిరూపించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాను. అలాగే వాటిని ఐటం సాంగ్లా కాకుండా స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లా చూపించాలనుకున్నాను. కొరియోగ్రఫీపై ఎక్కువ ఫోకస్ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలన్నాను. కొరియోగ్రఫీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అలా దిల్బర్ సాంగ్‌లో నాతో పాటు స్టేజీపై ఉన్న డ్యాన్సర్లతో వారం రోజులపాటు ప్రాక్టీస్ చేయించాను. ఆ పాటకోసం నాకు చాలా చిన్న బ్లౌజ్ తీసుకొచ్చారు. అందంగా కనిపించాలి కానీ వల్గర్‌గా కాదని దాన్ని వేసుకోనన్నాను. దీంతో బ్లౌజు సైజు పెంచి తీసుకొచ్చారు అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ 8: హౌస్‌మేట్స్‌కు దీపావళి సర్ప్రైజ్ -
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
-
Item Songs 2021: ఈ ఏడాది 'ఊ'పేసిన ఐటమ్ సాంగ్‌లు ఇవే..
సినిమా అంటే యాక్షన్, రొమాంటిక్, కామెడీ సీన్లు, పాటలు వంటి రకారకాల వినోదాల మేళవింపు. ఒక పక్కా కమర్షియల్ సినిమా అంటే అన్నీ ఉండి తీరాల్సిందే. ఆకలితో ఉన్నవాడికి విందు భోజనంలా వడ్డించాలి సినిమా దర్శకుడు. అప్పుడే ప్రేక్షకులు సినిమా అనే రుచిని ఆస్వాదిస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు. ఇక మాంచి కమర్షియల్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ప్రతీ మాస్ ప్రేక్షకుడు స్పెషల్ ఫోకస్ పెడతాడు సినిమాపై. సినిమాలో ఐటమ్ సాంగ్ లేదంటే పెదవి విరుస్తారు ఆడియెన్స్. థియేటర్లలో స్పెషల్ సాంగ్ వచ్చిందంటే చాలు విజిల్స్, పేపర్స్ విసిరేస్తూ గోల గోలగా సందడి చేస్తారు. ఇంతలా కేక పెట్టించే ఐటమ్ సాంగ్‌లో ఎవరూ స్టెప్పులేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూసే పక్కా మాస్ ఆడియెన్స్ కూడా ఉన్నారు. అందుకే ఈ ఐటమ్ సాంగ్స్‌లో తమ అందాలతో కట్టిపడేస్తున్నారు హీరోయిన్స్. ఇదివరకు అయితే ఈ సాంగ్స్‌లో సాధారణ నటీనమణులు నర్తించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే తమ ముందు ఐటమ్ సాంగ్స్ కూడా తక్కువే అని నేరుగా హీరోయిన్లే ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత చేసిన 'ఊ అంటావ మావ'తో ఐటమ్ సాంగ్స్‌కు కొత్త కళ వచ్చింది. ఇలా ఈ ఏడాది వచ్చిన 'భూమ్ బద్దలు' నుంచి 'ఊ అంటావా మావ' వరకు అలరించిన స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం. 1. ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ (పుష్ప) 2. ఛాంగురే ఐటమ్ సాంగురే (గల్లీ రౌడీ) 3. పెప్సీ ఆంటీ (సిటీమార్) 4. మందులోడా (శ్రీదేవి సోడా సెంటర్) 5. పైన పటారం (చావు కబురు చల్లగా) 6. రంభ ఊర్వశి మేనక (అల్లుడు అదుర్స్) 7. డించక్ డించక్ డింకా (రెడ్) 8. భూమ్ బద్దలు (క్రాక్) ఈ స్పెషల్ సాంగ్స్‌తో పాటు నాగశౌర్య నటించిన 'వరుడు కావలెను' సినిమాలోని 'దిగు దిగు నాగ' సాంగ్ కూడా చాలా అలరించింది. అయితే ఈ పాటలో కూడా హీరోయిన్ రీతు వర్మ నర్తించింది. -
సుకుమార్-డీఎస్పీ కాంబోలో హిట్టైన స్పెషల్ సాంగ్స్
1. అ అంటే అమలాపురం (ఆర్య, 2004) ఈ పాటలో అభినయ తన అభినయంతో కుర్రకారును ఓ ఊపు ఉపేసింది. అప్పట్లో ఈ స్పెషల్ వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్‌ను బాలీవుడ్ నటుడు సోనూసూద్ హీరోగా చేసిన 'మాక్జిమమ్' సినిమాలో రీమేక్ కూడా చేశారు. 2. 36 24 36 (జగడం, 2007) రామ్ పోతినేని, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం జగడం. గ్యాంగ్‌స్టర్ అవ్వాలని తపించే హీరో పెద్ద పేరు తెచ్చుకున్న ఒక గ్యాంగ్‌స్టర్ వద్ద చేరి సెటిల్మెంట్లు చేస్తాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్‌కి రెస్పాన్స్ మాములుగా రాలేదు. 3. రింగ రింగ (ఆర్య 2, 2009) ఆర్య తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ఆర్య 2. అప్పటికే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు అంచనాలు పెరిగిపోయాయి. అలా అంచనాలతో వచ్చిన ఈ సాంగ్ ఏ ఒక్క అభిమానికి ఉత్సాహన్ని తెచ్చింది. ఇంతే కాకుండా ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్టయ్యాయి. 4. డియ్యాలో డియ్యాల (100% లవ్, 2011) అక్కినేని నాగ చైతన్య, తమన్నా జంటగా లవ్లీ మూవీ 100% లవ్. ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా శ్రోతలను తెగ అలరించాయి. చంద్రబోస్ సాహిత్యమందించిన ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 5. లండన్ బాబు (1 నేనొక్కడినే, 2014) సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సుకుమార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం 1 నేనొక్కడినే. ఈ సినిమాలో మహేశ్ బాబు రాక్‌స్టార్ పాత్రలో అలరించారు. హీరో తన తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో లండన్ వెళ్తాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ పర్లేదనిపించింది. 6. జిగేల్ రాణి (రంగస్థలం 2018) అప్పటివరకు అంతగా గుర్తింపు లేని ఆర్టిస్‌లతో స్పెషల్ సాంగ్స్ చేయించారు డైరెక్టర్ సుకుమారు. కానీ జిగేల్ రాణిగా మాత్రం హీరోయిన్ పూజ హెగ్డేను చూపించారు. పూజ గ్రేస్, డ్యాన్స్‌తో ఆ పాట బ్లాక్ బస్టర్ అయింది. ఈ సాంగ్‌లో రామ్ చరణ్‌కు జోడిగా సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది పూజ. 7. బ్రేకప్ ప్యాట్చప్ (కుమారి 21F, 2015) ఈ బ్రేకప్ ప్యాట్చప్ సాంగ్ సుకుమార్ కథ అందించి, నిర్మించిన కుమారి 21Fలోది. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా.. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. -
ఐటమ్ అంటే నాకిష్టం!
సాక్షి, తమిళసినిమా: ఐటమ్ సాంగ్స్ నాకిష్టం అంటోంది నటి తమన్నా.. స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లో నటించడానికి ఒకప్పుడు భయపడేవారు. కానీ, ఇప్పుడు అది ఫ్యాషన్ అయ్యింది. ఇమేజ్ను సైతం పట్టించుకోకుండా స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఒక చిత్రంలో నటిస్తే వచ్చే పారితోషికంలో సగం ఒక్క ఐటమ్ సాంగ్‌లో నటిస్తే వచ్చేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తత్వాన్ని బాగా ఒంటబట్టిచుకున్న ఈ తరం హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లకు అస్సలు వెనుకాడడం లేదు. తమన్నా, శ్రియ, కాజల్ అగర్వాల్ ఇలా టాప్ హీరోయిన్లందరూ సింగిల్సాంగ్కు చిందేయడానికి సిద్ధం అంటున్నారు. అయితే ఇందుకు వారు ఒక్కో రీజన్‌ను రెడీగా పెట్టుకుంటున్నారు. నటి తమన్నా ఇప్పటికే చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లో నటించారు. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్‌లోనూ తన అందాలతో అదరగొట్టారు. ఇలా ఐటమ్ సాంగ్స్‌లో నటించడంపై తాజగా తమన్నా స్పందించారు. ‘ సినిమాల్లోకి మొదట్లో నాకు డాన్స్‌తోనే గుర్తింపు లభించింది. ఇంకా చెప్పాలంటే డాన్స్‌లో ప్రతిభను చాటుకునే అవకాశాలు చాలా తక్కువ మంది హీరోయిన్లకే వస్తుంటాయి. అలాంటి అవకాశాలు నాకు ఎక్కువగానే వచ్చాయి. అందుకే డాన్స్‌కు ప్రాధాన్యం కలిగిన పాటల్లో నటించడం నాకు చాలా ఇష్టం’ అంటూ స్పెషల్ సాంగ్స్‌లో నటించడాన్ని ఈ అమ్మడు సమర్థించుకుంది. మొత్తం మీద తొలి రోజుల్లో నటనతో కాకుండా డాన్స్, అందచందాలతో నెట్టుకొచ్చానని ఈ అమ్మడు చెప్పకనే చెప్పిందన్నమాట. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం ఎఫ్-2 చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. అందుకే ఎఫ్-2 సినిమా రిజల్ట్ కోసం చాలా ఆతృతంగా ఎదురుచూస్తోందట. -
మీటూ ఎఫెక్ట్: ఐటమ్ అవుట్
‘పటాకా’ సినిమాలో మలైకా అరోరా మీద తీసిన ‘హెలో హెలో’ ఐటమ్ సాంగ్. ఈ సాంగ్‌ని సినిమాలోంచి తొలగించారు దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్త్రీల వైపు నుంచి ఆలోచించడానికి కాస్త సున్నితత్వం కావాలి. బాలీవుడ్ డైరెక్టర్లు ఇప్పుడు ‘ఐటమ్ సాంగ్స్’ విషయంలో సున్నితంగా ఆలోచించడం మొదలుపెట్టారనే అనిపిస్తోంది. ఒక డైరెక్టర్ ‘నేనిక నా సినిమాల్లో ఐటమ్ సాంగ్ పెట్టనేపెట్టనని’ గత ఏడాది ప్రకటిస్తే, ఇంకో డైరెక్టర్ ఈ ఏడాది.. పెట్టిన ఐటమ్ సాంగ్‌ని కూడా సినిమాలోంచి తీసేశాడు. సంస్కారవంతమైన ఈ ధోరణి కొనసాగితే, అన్ని భాషల చిత్ర పరిశ్రమలూ ఈ మార్గాన్ని అనుసరిస్తే.. అవాంఛనీయ ప్రభావాలు లేకుండా.. ఆరోగ్యకరమైన వినోదం మాత్రమే ప్రేక్షకులకు అందుతుంది. సమాజంలో మహిళల్ని ఆటబొమ్మలుగా చూసే దృష్టీ మారుతుంది. ఐటమ్ సాంగ్ కూడా మీ టూ అంటోంది. జోక్ కాదు సీరియస్! ఇండియన్ సగటు సినిమా ఫార్మూలాలో పాటలతోపాటు ఐటమ్ సాంగ్స్ కూడా అనివార్యం. కథతో, దాని నేపథ్యంతో సంబంధం లేకుండా.. అసందర్భంగా.. కేవలం.. ప్రేక్షకులకు (మేల్) కిక్ ఇవ్వడానికి మాత్రమే ఉంటాయీ సాంగ్స్. జనాల్లో ఆ పాటలు ఎంత పాపులరో.. ఐటమ్ గర్ల్స్కీ అంత క్రేజ్. శరీర వర్ణన.. శృంగార రస ప్రాధాన్యంగానే ఈ పాటలు సాగుతాయి. చుట్టూ పదిమంది మగవాళ్లను కవ్విస్తూ.. పాట పాడుతుంది.. డాన్స్ చేస్తుంది ఐటమ్ గర్ల్. వాళ్లంతా ఆమె కేసి మోహంగా చూస్తుంటారు.. ఆమెను తాకడానికి ప్రయత్నిస్తుంటారు. పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంకొన్ని పాటల్లోనైతే ఈ సోలో సాంగ్ నాయిక తనను తాను తినే వస్తువుగా .. మిరపకాయ బజ్జీగా.. తందూరీ చికెన్‌గా.. ఆల్కహాల్‌గా అభివర్ణించుకుంటూ.. కొరుక్కుతినమని.. జుర్రుకోమనే హింట్స్ ఇస్తూ స్టెప్స్ వేస్తుంటుంది. మరికొన్ని పాటల్లో ఒక హీరో ముగ్గురు ఐటమ్ గర్ల్స్‌తో గంతులేస్తుంటాడు.. సేమ్ అలాంటి లిరిక్స్‌తోనే. స్వరంలో జీర.. ముఖంలో మోహం టాకీ శకం నుంచే స్పెషల్ సాంగ్స్ సీక్వెన్స్ ఉన్నాయేమో కాని.. 1970ల నుంచి ఈ ధోరణి తప్పనిసరి అయిపోయిందని మాత్రం చెప్పొచ్చు. ఈ మధ్యే విడుదలైన ‘స్త్రీ’ అనే హిందీ సినిమాలోనూ నోరా ఫతేహీ డాన్స్ చేసిన ‘కమరియా’ అనే ఐటమ్ సాంగ్‌ను పెట్టారు. మహిళలను కించపర్చడం, అణచివేయడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించే చెప్పే ఈ సినిమా ఈ పాటలో మాత్రం నోరా ఫతేహీని ఓ సెక్స్‌వల్ ఆబ్జెక్ట్గానే చూపిస్తుంది.. కెమెరాతో ఆ అమ్మాయి శరీర సౌష్ఠవాన్ని జూమ్ చేసి చూపిస్తూ! మహిళలకు సంబంధించి నాటి తీరు.. నేటి ధోరణి ఒకటే అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ అంతే. ప్రతి పాట.. ఓ హస్కీ వాయిస్.. లస్ట్ ఎక్స్ప్రెషన్తో సినిమాలో పండాల్సిందే. కాసులు కురిపించాల్సిందే. అంటే ఆమె బాడీ ఓ కమాడిటీ. మూడు నిమిషాల పాటతో చూపించి మిగతా సినిమాలో లేని దమ్మును బ్యాలెన్స్ చేసుకోగలమని మూవీ మేకర్స్ ధీమా. తట్టుకోలేకే.. ‘తను’ వచ్చేసింది! ఇలాంటి పాటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయా? అలజడిని సృష్టిస్తాయా? ఆడవాళ్ల గౌరవాన్ని పెంచుతాయా, వాళ్లను ఓ విలాస వస్తువుగా చూపిస్తాయా? విలాస వస్తువుగానే చూపిస్తాయి. అమ్మాయిలను తమతో సమానంగా కాదు.. తమ కోర్కెలు తీర్చే బొమ్మగా చూడాలనే సంకేతాలను పంపిస్తాయి. ఈ పాటలు ఐటమ్ గర్ల్ అభినయ కౌశలానికి ప్రతీకలు కావు. ఆడవాళ్లను ఆబ్జెక్టిఫై చేసే సన్నివేశాలు. ఈ పాటల చిత్రీకరణ ఎలా ఉంటుందో.. సెట్స్‌లో ఐటమ్‌సాంగ్ చేస్తున్న నటి పట్ల మగ నటులు, మగ సిబ్బంది ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని తనుశ్రీ దత్తా ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. ‘‘హార్న్ ఓకే ప్లీజ్’’ సినిమాలో తనుశ్రీ దత్తాతో ఒక ఐటమ్ సాంగ్‌లో ఆమెతో ఇంటిమేట్ స్టెప్స్ కావాలని సీనియర్ నటుడు నానాపటేకర్ ఆ సినిమా కొరియోగ్రాఫర్‌ను కోరడం.. ఆమెను వేధించడంతో తనుశ్రీ దత్తా ‘మీటూ’ అంటూ గొంతెత్తిన విషయం తెలిసిందే కదా! ఇలాంటి పాటల వల్ల వాటిని అభినయిస్తున్న నటీమణులకెంత హాని జరుగుతుందో.. ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో.. బయటి మహిళలకూ అంతే హానీ, అన్ని సమస్యలూ ఎదురవుతున్నాయి. సినిమా కంటే కూడా ఇలాంటి పాటల వల్ల ఎక్కువ ప్రభావం ఉంటోందనేది స్త్రీవాదుల అభిప్రాయం. ‘ఐటమ్స్’కి కరణ్, విశాల్ ‘నో’ కొంచెం సున్నితంగా ఆలోచించే సినీ నిర్మాత, దర్శకులు ఇలాంటి ఐటమ్ నంబర్స్ పట్ల కాస్త అపరాధభావాన్ని ప్రదర్శించిన రుజువులూ ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్.. 2017లో ఐటమ్ సాంగ్స్‌ను తన సినిమాల్లో చూపించినందుకు చింత వ్యక్తం చేస్తూ ‘‘ఒక అమ్మాయిని పది మంది మగవాళ్ల మధ్యలో తిప్పుతూ.. వాళ్లంతా ఆమెను ఆబగా చూస్తూ పాటను చిత్రీకరించామంటే.. నిజంగా సమాజానికి మనం తప్పుడు సంకేతం ఇస్తున్నట్లే లెక్క అని చాలా ఆలస్యంగా గ్రహించాను. అందుకే ఇక మీదట నా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండవు’’ అని ప్రకటించాడు. విశాల్ భరద్వాజ్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఈ మధ్యే విడుదలైన ‘పటాకా’ సినిమాలో మలైకా అరోరా మీద ‘‘హెలో హెలో’’ అనే ఓ స్పెషల్ సాంగ్‌ను పిక్చరైజ్ చేశాడు. కానీ సినిమాలో పెట్టలేదు. కారణం ఇదీ అని చెప్పలేదు కాని.. ఐటమ్ సాంగ్ స్థానాన్ని మాత్రం తప్పించేశాడు విశాల్. ఇది మంచి పరిణామం. మహిళను ఇంకా సెకండ్ సిటిజన్‌గానే చూస్తున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులున్న సమాజాల్లో జెండర్ సెన్సిటివిటీ సినిమా మాధ్యమం నుంచే మొదలవ్వాలి. అదే ప్రచారం చేయాలి. మీ టూ ఉద్యమం ఆ స్పృహను కలిగిస్తుందని ఆశపడదాం. కరణ్ జోహార్, విశాల్ భరద్వాజ్ లాంటి వాళ్లు ఇంకెంత మందికి స్పూర్తినిస్తారో చూద్దాం! అది పాట.. అంతవరకే ‘‘ఐటమ్ సాంగ్స్‌లో నటించినందుకు నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. నేను అబ్జెక్టిఫై అయినట్టు కూడా ఫీలవలేదెప్పుడు.. అఫ్కోర్స్ ఇలాంటి పాటల్లో నటించినందుకు నా మీద మగవాళ్ల చూపులు, వాళ్ల అటెన్షన్ ఎలా ఉంటుందో తెలుసు.. కాని నో రిగ్రెట్స్’’ – మలైకా అరోరా, (‘దిల్ సే’లో ‘ఛయ్యా.. ఛయ్యా’, ‘దబాంగ్’లో ‘మున్నీ బద్నామ్ హుయీ’ వంటి ఐటమ్ సాంగ్స్ ఫేమ్) కొంచెం జాగ్రత్త అవసరం ‘‘ఐటమ్ సాంగ్స్‌లో నటించే నటీమణులు.. ‘ఓకే ఆల్రైట్.. నా సెన్సువాలిటీని నేను సెలబ్రేట్ చేసుకుంటాను..’ అనే ఎరుకతో ఉంటే మంచిదే. వండర్ఫుల్. సమస్యే లేదు. కాని సెన్సువాలిటీని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఆ నటీమణులు ఆబ్జెక్టిఫై అయి.. సినిమా వ్యాపారానికి సాధనాలుగా మారితేనే సమస్య. – షబానా ఆజ్మీ, ప్రసిద్ధ బాలీవుడ్ నటి (‘స్త్రీ’ సినిమాలో ‘కమరియా’ పాటకు నోరా ఫతేహీ స్టెప్పులు) – సరస్వతి రమ -
మస్త్ హ్యాపీ
వెండితెరపై సెంచరీని ఎప్పుడో పూర్తి చేసిన అందాల తార రంభ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ సౌత్‌లోనే కాదు, హిందీ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటారు. బుల్లితెరపై కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఇప్పుడు రంభను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే... ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చారు. 2010లో కెనడాకి చెందిన ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్నారు రంభ. ఈ దంపతులకు ఆల్రెడీ లాణ్య, షాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ నెల 23న బేబీ బాయ్‌కి జన్మనిచ్చాను. పేరెంటింగ్ లైఫ్ చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు రంభ. కాగా, 2007లో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన రంభ 2008లో కీలక పాత్ర చేసిన ‘దొంగ సచ్చి నోళ్లు’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. బుల్లితెరపై మాత్రం కనిపిస్తున్నారు. -
ఐటమ్ సాంగ్స్‌ను బ్యాన్ చేయాలి
మున్నీ బద్నామ్ హుయీ డార్లింగ్ తేరే లియే... చిక్నీ చమేలీ చిక్నీ చమేలీ... మై నేమ్ ఈజ్ షీలా... తెరపై తారలు ఈ ఐటమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఆ మాటకొస్తే ఐటమ్ సాంగ్స్ కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు ఉంటారు. అలాంటి క్రేజీ సాంగ్స్‌కి ఇక ఫుల్స్టాప్ పెట్టండి అని ఎవరైనా అంటే ‘ఎందుకమ్మా అంత కోపం’ అంటారు. ఇప్పుడు కంగనా రనౌత్‌ని అలానే అంటున్నారు. ఎందుకంటే సూటిగా సుత్తి లేకుండా ఈ హాట్ గర్ల్ ‘ఐటమ్ సాంగ్స్‌ని బ్యాన్ చేయండి’ అనేశారు. టాప్ హీరోయిన్స్ సైతం ఐటమ్ సాంగ్‌లో యాక్ట్ చేస్తుంటారు. కానీ కంగనా రనౌత్ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైనా ఒక్క ఐటమ్ సాంగ్‌లోనూ కనిపించలేదు. దానికి కారణం ఏంటి? అని కంగనాను అడిగితే– ‘‘నాకు ఆనందాన్నిచ్చేవి అందరికీ నచ్చాలి, ఆనందాన్నివ్వాలని రూలేం లేదు. నాకు ఫెయిర్‌నెస్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం, పెద్ద హీరోలతో యాక్ట్ చేయడం, ఐటమ్ సాంగ్స్‌లో కనిపించటం పెద్దగా నచ్చవు. కానీ వాటితో కెరీర్‌కి వచ్చే బూస్టప్ మామూలుగా ఉండదు. అయినా నాకు నచ్చవు. ఐటమ్ సాంగ్స్‌లో పెద్దగా చేయటానికి ఏమీ ఉండదు. ఎక్కువ శాతం అవి మహిళలను తక్కువ చేసే విధంగానే ఉంటాయి. ఐటమ్ సాంగ్స్‌లో ‘మోహినీ, మున్నీ’ అని పేర్లు వినిపిస్తుంటాయి. అలా పిలిపించుకోవటం నాకు నచ్చదు. నా అభిప్రాయం ఏంటంటే ఐటమ్ సాంగ్స్‌ని బ్యాన్ చేయాలి. సొసైటీకి హాని కలిగించే వాటిలో భాగం అవ్వడానికి నేను రెడీగా లేను. రేపు సొసైటీలో మన ఆడపిల్లలను ఇలాంటి పేర్లు పెట్టి పిలవలేం కదా. ఇలాంటి పాటలను పిల్లలు చూస్తుంటారు. వీటి ద్వారా వాళ్లేం నేర్చుకుంటారు? ఏమీ ఉండదు కదా. అందుకే మనం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి’’ అని పేర్కొన్నారు కంగనా. -
చిన్నారులతో ఐటెమ్ సాంగ్స్‌కు డ్యాన్సులు
-
మాస్ అమ్మా... మాస్!
బీట్... ఒక్క బీట్...హార్ట్ బీట్‌ని పెంచేస్తుంది! నోట్... ఒక్క మాస్ నోట్...మనందరి చేత స్టెప్పులేయిస్తుంది!రూరల్ టు సిటీ... సిటీ టు రూరల్....ఏ రూటులోని థియేటర్లోనైనా...ఎంత రేటు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడినైనా... వయసెంతైనా...స్టెప్పులేయించగల సత్తా... పాడించగల పట్టు... ఐటమ్ పాటకున్న ప్రత్యేకతలు!! మరి, మూడు గంటల సినిమాలో మూడున్నర నిమిషాల ఐటమ్ పాటలోసందడి చేసే భామలు? చిందేసే చిచ్చుబుడ్డీలు...కనువిందు చేసే కాకర పువ్వొత్తులు...టెన్ థౌజెండ్‌వాలా టపాసులు! సిన్మాలో వీళ్ల వెలుగులు, సౌండులు కాసేపే!కానీ, థియేటర్లను హోరెత్తించే ఈ స్పెషల్ సాంగులు..మాస్ అమ్మా... మాస్! రత్తాలూ... రైట్ రైట్! రత్తాలు రాకతో సంక్రాంతి పండక్కి థియేటర్లలో దీపావళి వచ్చేసింది. చిరంజీవి రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రత్తాలూ... రత్తాలూ’లో చిరూతో కలసి రాయ్ లక్ష్మీ అంతలా రఫ్ఫాడించేశారు మరి! రాయ్ లక్ష్మీ అంతకు ముందు ఎన్ని ఐటమ్ సాంగులు చేసినా... రత్తాలు మాత్రం ఆమెకు, ప్రేక్షకులకూ స్పెషల్! డ్యాన్సులో చిరు గ్రేసు, సాంగులో చిరూతో రాయ్ లక్ష్మీ వేసిన స్టెప్పులు... పట్టాలు ఎక్కిన రైలు వెళ్లేంత స్పీడులో ప్రేక్షకుల చేత స్టెప్పులేయించాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి! ఇందులో రత్తాలు హాట్ అప్పియరెన్స్‌కి ప్రేక్షకులు రైట్... రైట్... అని ఓటేశారు. స్వింగ్ జరా... సెన్సేషన్రా! దీపావళికి నెల ముందు.. సరిగ్గా దసరా టైమ్‌లో... థియేటర్లలో సాలిడ్ సౌండ్ వినబడింది. ఎవరది? అంత సౌండ్ చేసింది? అని చూస్తే... తమన్నా! ఎన్టీఆర్‌తో స్టెప్పులు కలిపారు. థియేటర్లలో ఎవరి సీటుల్లో వాళ్లు కూర్చుంటే... అందరి చేత ‘స్వింగ్ జరా’ సాంగుతో స్టెప్పులేయించారు. కళ్లల్లో కసి, స్టెప్పుల్లో సెక్సీనెస్, ఎన్టీఆర్ రావణతాండవం... వెరసి సాంగ్ సెన్సేషన్! తెలుగు ప్రేక్షకులకు తమన్నా అందాలు కొత్తేం కాదు. ఎన్టీఆర్‌తో కలసి ఆల్రెడీ ఓ సినిమా చేశారు. కానీ, ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ సూపరో... సూపరు! అందుకే, పాట అంత హిట్టయ్యింది. సూయ... సూయ... స్టైలిష్ అనసూయ! రత్తాలొచ్చిన నెలన్నర తర్వాత థియేటర్లలో నిఖార్సైన నాటు బాంబు పడింది. ఈ నాటు బాంబు పేరు... అనసూయ. రత్తాలు చిరూతో వస్తే... చిరు మేనల్లుడు ‘విన్నర్’ సాయిధరమ్ తేజ్‌తో అనసూయ వచ్చారు. ‘సూయ సూయ అనసూయ’ అని ఆమె పేరుపైనే పాట రాయడం అనసూయకు దక్కిన అరుదైన అదృష్టం. హాట్ యాంకర్ అనసూయ హస్కీ లుక్స్, సెక్సీ స్టెప్పులకు తోడు ప్రముఖ యాంకర్ సుమ పాడడంతో ఈ పాటకు మాంచి క్రేజ్ వచ్చింది. థియేటర్లలో బాగానే సౌండ్ చేసిందీ సాంగ్! సిరిమల్లి... హాట్ రెడ్ చిల్లి! లేట్ కాలేదు... నాటు బాంబు వచ్చిన వారం రోజులకు దీవాలి టపాసు వచ్చేసింది. ఈ టపాసు స్టెప్పులకు పోరగాళ్లు ఫుల్ టాస్. ఫుల్ టు బిందాస్! ఈ టపాసు పేరు... హంసా నందిని. అసలే, ఐటమ్ సాంగులకు కేరాఫ్ అడ్రస్ ఈ రెడ్ చిల్లి. ‘మిర్చి’ నుంచి లాస్ట్ ఇయర్ ‘శ్రీరస్తు శుభమస్తు’ వరకు పలు సిన్మాల్లోని ఐటమ్ సాంగుల్లో ఘాటు ఘాటుగా కనిపించారు. ఈ ఏడాది రాజ్‌తరుణ్ ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’లో ‘నా పేరే సింగపూర్ సిరిమల్లి’ అంటూ చిచ్చుబుడ్డిలా వెలుగులు విరజిమ్మారు. పాటలో చెప్పినట్టు హంసా నందిని అందం హాట్ హాట్ రెడ్ చిల్లీనే. కొంటె కుర్రాళ్ల గుండెల్లో లొల్లి లొల్లీనే! టైమ్ లేదు గురూ... శ్రియ చమక్కులు! ‘టైమ్ లేదు గురూ...’ అంటూ కృష్ణవంశీ ‘నక్షత్రం’లో కనిపించారు శ్రియ. కానీ, అప్పటికి చాలా టైమైంది... తెలుగు తెరపై ఐటమ్ బాంబు పేలి! ఇటువంటి పాటల్లో శ్రియ చమక్కులు చూపించి! మార్చి మొదట్లో హంస హోయలొలికిస్తే... ఆగస్టు ఫస్టు వీక్‌లో శ్రియ సౌండ్ చేశారు. హీరోయిన్లను అందంగా చూపడంలో స్పెషలిస్ట్ అయిన కృష్ణవంశీ, మోడ్రన్ డ్రస్సుల్లో శ్రియను సెక్సీగా చూపించారు. దాంతో కుర్రకారు హ్యాపీ.ఎ ఫర్ అందగత్తె... సి ఫర్ క్యాథరిన్! ఎ ఫర్ అందగత్తె. బి ఫర్ బాంబ్... ఐటమ్ బాంబ్! ఎవరు? సి ఫర్ క్యాథరిన్. కావాలంటే... ‘జయ జానకి నాయక’లో ‘ఎ ఫర్ యాపిలు... బి ఫర్ బుజ్జులు’ చూడండి. క్యాథరిన్ చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. గట్టిగానే పేలిందీ బాంబ్. బెల్లకొండ శ్రీనివాస్ మంచి డ్యాన్సర్. అతని పక్కన అందంతో, అదరగొట్టే స్టెప్పులతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశారు క్యాథరిన్. స్వీట్ సన్నీ.. ప్యారీ పూజ...రెడీ టు బ్లాస్ట్! జస్ట్... టూ వీక్స్ వెయిట్ చేస్తే చాలు! థియేటర్లలో ఇంకో ఐటమ్ బాంబు పేలుతుంది. మామూలు బాంబ్ కాదిది.. ఇంటర్నేషనల్ బాంబ్! పేరు... సన్నీ లియోన్. ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని శృంగార తార. వచ్చే నెల 3న థియేటర్లలోకి వస్తున్న రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’లో ఐటమ్ సాంగ్ చేశారు. అది ఏ రేంజ్లో పేలబోతుందో... ‘డియో డియో డిసక’ పాట వింటే అర్థమవుతుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన బీట్‌లో మాస్‌ని ఊపేసే ఓ మేజిక్ ఉంది. ఆల్రెడీ నెట్టింట్లో ‘డియో డియో’ ట్యూన్, సన్నీ స్టిల్స్, మేకింగ్ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. ఓన్లీ... ఈ ఒక్క పాటకు కోటి రూపాయలు ఖర్చు పెట్టారట! సన్నీ లేడీ 50 లక్షలు తీసుకుంటే... మేకింగ్‌కి మరో 50 లక్షలు ఖర్చు చేశారు. ఈ పాటను నాలుగు రోజులు తీశారు. ‘‘నా సినిమాల్లో నేను తీసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. అందుకే, ‘ది బెస్ట్’ సాంగ్‌ని ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను’’ అని చిత్రదర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. ఇక, ఐటమ్ సాంగ్‌తో బ్లాస్ట్ చేయడానికి రెడీ అవుతోన్న మరో బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పటివరకు ఈమె ఏ సినిమాలోనూ ఐటమ్ గాళ్‌గా కనిపించలేదు. రామ్‌చరణ్ ‘రంగస్థలం’తో ఆ లోటు తీర్చేస్తున్నారు. çసుకుమార్ సినిమాల్లో ఐటమ్ బాంబులు ఏ రేంజ్లో పేలాయో? సుక్కు సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత రెచ్చిపోతారో? ప్రత్యేకంగా చెప్పాలా!! సో, ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేయబోయే పాట ఆల్రెడీ హిట్టని ప్రేక్షకులు ఫిక్సయ్యారు! - సత్య పులగం -
ఐటమ్‌సాంగ్స్ బాటలో..
సినిమా ఎవరిని ఎటు పయనింపజేస్తుందో ఎవరికి తెలియదు. ఎవరైనా దాని దారిలో పోవలసిందే. నటి క్యాథిరిన్ ట్రెసా పోకడ అలానే ఉంది. మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీకి ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చినా, ఆ తరువాత సన్నగిల్లాయి. నిజానికి మెడ్రాస్ చిత్రంలో మప్సల్స్ ఏరియా యువతిగా ఆ పాత్రలో క్యాథరిన్‌ట్రెసా బాగానే ఇమిడింది. ఆ తరువాతనే అమ్మడిని కనిదన్ లాంటి చిత్రాల్లో గ్లామరస్‌కు మారిపోయింది. కోలీవుడ్‌లో అవకాశాలు ఎండమావులుగా కనిపించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌పై దృష్టిసారించింది. అక్కడ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నా, అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలు, గ్లామర్ పాత్రలే తలుపుతడుతున్నాయి. ఇటీవల నటించిన తెలుగు చిత్రం ‘గౌతమ్‌నందా’లో క్యాథరిన్ట్రెసాను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా తాజాగా రానాకు జంటగా నటించిన నాన్ ఆణైయిట్టాల్( తెలుగులో నేనేరాజు నేనేమంత్రి) చిత్రంలోనూ అందాలారబోతలో ఇరగదీసిందంటున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. అయితే దీనిపై క్యాథరిన్ ట్రెసా చాలా ఆశలు పెట్టుకుందట. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనను గ్లామర్ పాత్రలకే వాడుకుంటున్నారనే చింత ఏమాత్రం లేదట. దీంతో ఐటమ్ సాంగ్స్ క్యాథరిన్ ట్రెసా తలుపు తడుతున్నాయట. కథానాయకి అవకాశాలు ముఖం చాటేస్తే తన అందాలను నమ్ముకుని ఐటమ్ సాంగ్స్ బాట పట్టాలనే ఆలోచన క్యాథరిన్‌కు లేకపోలేదట. ప్రస్తుతం హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌కు చాలా గిరాకీ ఉందన్న విషయాన్ని గ్రహించిన ఈ జాణ అలాంటి లెగ్ షేక్ పాటలకు గేట్లు తెరుస్తున్నట్లు భావించాల్సి వస్తోందంటున్నాయి సినీ వర్గాలు. -
అందుకు రూ.65 లక్షలా?
ప్రముఖ కథానాయికలు ఐటమ్ సాంగ్స్‌లో అందాలారబోతకు సిద్ధం అవడానికి ప్రధాన కారణం పెద్ద మొత్తంలో పారితోషికం ముట్టడమేనన్నది జగమెరిగిన సత్యం. ఒక వేళ ఆబ్లిగేషన్ కోసం అలా నటించానని ఎవరైనా చెబితే అది సత్యదూరమే అవుతుంది. అదే విధంగా ఇవాళ ఏ ఒక టాప్ నటి స్పెషల్ సాంగ్ పేరుతో గ్లామరస్‌గా నటించడానికి కాదనడం లేదు. తాజాగా నటి క్యాథరిన్ ట్రెసా అలాంటి భారీ పారితోషికానికి ఐటమ్ సాంగ్ చేయడానికి సై అన్నదన్నది టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ వరుస కడుతున్న ఈ భామ మెడ్రాస్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అయ్యింది. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా సంసారపక్షంగా కనిపించి గుర్తింపు పొందిన క్యాథరిన్ ట్రెసా ఆ తరువాత అందాలారబోతలో విజృంభించిందనే చెప్పాలి. కణిదన్, కథకళి తమిళ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా ఆర్యతో కడంబన్, విష్ణువిశాల్‌కు జంటగా కథానాయకన్ చిత్రాలతో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా తెలుగులో ఒక ఐటమ్ సాంగ్‌లో నటించడానికి సిద్ధం అవుతోంది. ఇందుకు ఈ జాణ డిమాండ్ చేసిన పారితోషికమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వర్ధమాన టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో క్యాథరిన్ ట్రెసాను ఒక ఐటమ్ సాంగ్‌లో నటించమని అడగ్గా రూ.40 లక్షలు డిమాండ్ చేసిందట. అందుకు నిర్మాత వర్గం ఓకే అనడంతో పాట రిహార్సల్‌కు వెళ్లిందట. ఆ పాటకు మామూలు గ్లామర్ కాదు పరిధులు దాటే గ్లామరస్‌గా నటించాలని గ్రహించిన క్యాథరిన్ ట్రెసా అదనంగా మరో రూ.25 లక్షలు పారితోషికం ఇస్తేనే అందాలారబోయడానికి సిద్ధం అని అనడంతో అందుకు ఆ చిత్ర నిర్మాత అంగీకరించారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తం మీద ఒక ఐటమ్ సాంగ్‌కు రూ.65 లక్షలు అందుకుంటోందనే టాక్ స్ప్రెడ్ అయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొసమెరుపేంటంటే ఇంతకు ముందు కూడా ఇదే హీరోతో సింగల్ సాంగ్‌లో చిందేయడానికి మిల్కీబ్యూటీ తమన్నా భారీ మొత్తాన్ని పుచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది. -
ఇచ్చింది పుచ్చుకుని నటించా!
డబ్బు..డబ్బు..డబ్బు. ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతోంది. ఇందుకు అతీతులంటూ ఎవరూ ఉండరు. ఇక తారల విషయానికి వస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీను అనుసరిస్తుంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ సాంగ్‌కు అధిక పారితోషికం చెల్లిస్తే తానూ ఆడటానికి రెడీ అని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తానేమీ తక్కువ కాదు అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు కూడా ఈ మధ్య తెలుగు చిత్రం జనతా గ్యారేజ్‌లో నేను పక్కా లోకల్ అంటూ సింగిల్ సాంగ్‌లో రెచ్చిపోయి స్టెప్పులేశారన్నది గమనార్హం. అందుకు తగిన పారితోషికాన్ని పుచ్చుకున్నారు. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ తమిళంలో అజిత్ 57వ చిత్రంతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150, నటుడు రానాతో మరో చిత్రంలో నటిస్తున్నారు. ధనుష్‌తో మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే జీవాకు జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి కాజల్ పేర్కొంటూ సాధారణంగా హీరోయిన్లు మంచి కథ, కథాపాత్ర ఉంటే చాలని అంటుంటారన్నారు. వాటితో పాటు మంచి పారితోషికం కూడా చాలా ముఖ్యమని తాను అంటానన్నారు. తాను 22 ఏళ్ల వయసులో చిత్రరంగ ప్రవేశం చేశానని, తనకు ఇక్కడ గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరని చెప్పారు. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. మొదట్లో ఇచ్చిన పారితోషికాన్ని కాదనకుండా పుచ్చుకుని నటించేదాన్నని, అదే విధంగా వచ్చామా.. నటించామా.. వెళ్లామా.. అన్నట్టుగా ఉండేదాన్నన్నారు. అలాగే కొన్ని చేయకూడని చిత్రాలు చేశానని, కొన్ని తప్పటడుగులు వేశానని చెప్పారు. ఆ తరువాత కాస్త తెలివిమీరానని , అయితే అతితెలివి కూడా ఇక్కడ పనికిరాదన్నారు. పారితోషికం చాలా ముఖ్యం అని గ్రహించానని చెప్పారు. ప్రతి ఏడాది చేసిన చిత్రాలు, పొందిన పారితోషికాన్ని క్యాలుక్యులేట్ చేసుకుని తరువాత ఏడాది నటించే చిత్రాలకు పారితోషికం గురించి నిర్ణయించుకుంటానని తెలిపారు. అదే విధంగా పాత్రల ఎంపిక విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటున్నాననీ, పాత్ర, పారితోషికం సంతృప్తిగా ఉంటేనే నటించడానికి అంగీకరిస్తున్నానని కాజల్‌అగర్వాల్ పేర్కొన్నారు. -
ఐటమ్ ఫీస్ట్!
‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా?’ అన్నట్టు.. ‘సిచ్యువేషన్ ఏదైతే ఏంటి.. సినిమా ప్రేక్షకులకు రీచ్ కావడంలో ఐటమ్ సాంగ్ హెల్ప్ అయ్యిందా? లేదా?’ అనేది ఫిల్మ్ మేకర్స్ థియరీ. మాస్ ప్రేక్షకుల్లో సినిమా గురించి దండోరా వేయడంలో ఈ పాటలను మించినవి లేవు. పైగా రెగ్యులర్ ఐటమ్ డ్యానర్స్ కాకుండా స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్‌కి చిందేస్తే ఆ క్రేజే వేరు. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం హీరోయిన్లకు బాగా తెలుసు. మూడు నాలుగు రోజుల్లో చిత్రీకరించే ఐదు నిమిషాల ఐటమ్కు స్టార్ హీరోయిన్లు చెప్పే రేటు యమా ఘాటుగా ఉంటుంది. సినిమాకు స్పైస్ కావాలంటే ఐటమ్ సాంగ్ కంపల్సరీ. పైగా స్టార్ హీరోయిన్ చేస్తే క్రేజే వేరు కాబట్టి, ‘వామ్మో ఇంతా’ అనుకున్నప్పటికీ, పైకి చిరునవ్వులు చిందిస్తూ భారీ చెక్ ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. శ్రుతీహాసన్, కాజల్ అగర్వాల్, తమన్నా, అంజలి.. వంటి స్టార్ హీరోయిన్లు తెరపై స్పెషల్ సాంగుల్లో సందడి చేస్తున్నారు. తమన్నా అయితే కొత్త హీరోల సరసన కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ‘అల్లుడు శీను’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘స్పీడున్నోడు’లో మరోసారి, నిఖిల్‌కుమార్ ‘జాగ్వార్’లోనూ తమన్నా ఐటమ్ సాంగ్స్ చేశారు. ‘జాగ్వార్’లో సాంగ్‌కి తమన్నా షూటింగ్ చేసింది రెండు రోజులు మాత్రమే. అందుకుగాను రూ.72 లక్షలు, ‘స్పీడున్నోడు’కి కోటి రూపాయలు తమన్నా అకౌంట్లో చేరాయట. ఇక కాజల్ గురించి చెప్పాలంటే... ‘జనతా గ్యారేజ్’లో ‘నేను పక్కా లోకల్..’ ఐటమ్ సాంగ్ ఆమెలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీసింది. ఈ బ్యూటీ లక్కీ నంబర్ 9 అట. అందుకని, ఈ పాటకు రూ.63 లక్షలు తీసుకున్నారట. ఆరూ మూడు కూడితే తొమ్మిదేగా! ఈ ఏడాది ఐటమ్ సాంగ్‌తో హల్ చల్ చేసిన మరో హీరోయిన్ అంజలి. లిరిక్స్‌లో రాసినట్టు ‘సరైనోడు’లో ఐటమ్ సాంగ్ బ్లాకు బస్టరే. నిర్మాతలు అంజలికి రూ.45 లక్షలు ఇచ్చారట. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్‌తో పాటు రాయ్ లక్ష్మి స్టెప్పులేసిన ‘తప్పు తప్పే..’ సాంగ్ మాస్‌ను ఓ ఊపు ఊపింది.మొత్తం మీద స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్ చేస్తే... పారితోషికం పరంగా వాళ్లకు అడ్వాంటేజ్... క్రేజ్ పరంగా సినిమాకీ అడ్వాంటేజ్... ఆడియన్స్కేమో ఐ-ఫీస్ట్. -
ఎక్కువిస్తే ఆడేస్తా!
ఎక్కువ డబ్బు ఇస్తే ఆడడానికి నేనెప్పుడూ రెడీ అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడి మంచి నటే కాదు మంచి డ్యాన్సర్ కూడా. ఇటీవలే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో నటించి ఆయన నుంచి మంచి డాన్సర్ అనే కితాబును కూడా అందుకున్నారు.అందాలారబోత విషయంలో హద్దులు చెరిపేయడానికి ఎప్పుడూ సిద్ధమే అనే ఈమె ఇటీవల ఐటమ్ సాంగ్స్‌కూ సై అనడం చూస్తున్నాం. ఇంతకు ముందు టాలీవుడ్లో దుమ్మురేపిన తమన్నా ఇప్పుడు కోలీవుడ్‌లో సత్తాచాటుతున్నారు. దేవి చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన ఈ జాణ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని కాస్త సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. నటులతో సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ నటీమణుల కోరికను తాను స్వాగతిస్తున్నానని పేర్కొని పెద్ద చర్చకే తెరలేపారు. కథానాయకుల పారితోషికాలు కథానాయికల కంటే పలు రెట్లు అధికంగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఇకపోతే తాను కొత్త నటులతో సింగిల్ సాంగ్‌లో నటించి అధిక పారితోషికం పుచ్చుకుంటున్నాననే ప్రచారం జోరుగా సాగుతోందని, అందులో తప్పేముంది ఎవరైనా డబ్బు కోసమే పని చేస్తారని అన్నారు. అయినా ప్రత్యేక గీతంలో నటించడం సాధారణ విషయం కాదన్నారు. తానే కాదు కాజల్‌అగర్వాల్, శ్రుతిహసన్ లాంటి వాళ్లూ ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తున్నారని తమన్నా తనను సమర్థించుకునేలా మాట్లాడారు. -
ఐటమ్ అచ్ఛా హై
హోటల్లో భోజనం తినడానికి వెళ్లినప్పుడు ఏదైనా డిష్ బాగుంది అనుకుంటే తమన్నాగారు ‘ఐటమ్ అచ్ఛా హై’ అంటారట. డిష్ బాగుండాలంటే పదార్థం బాగుండాలి. వండినవాడి చేతిలో మ్యాజిక్ ఉండాలి. ఆ గిన్నె దగ్గర్నుంచి పైన పెట్టిన క్యారెట్ పువ్వుతో సహా ప్రజెంటేషన్ అదిరిపోవాలి. సినిమా పాత్రలూ అంతే. యాక్టర్లో సబ్స్టెన్స్ ఉండాలి. డెరైక్టర్ చేతిలో మ్యాజిక్ ఉండాలి. ప్రొడక్షన్ హౌస్‌కి ప్రజెంటేషన్ స్టైల్ ఉండాలి. ‘‘అవును.. నేను ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాను. భలే మజా వస్తుంది. ఫెర్ఫార్మెన్స్ ఉంటుంది... డబ్బూ ఉంటుంది’’ అంటున్న తమన్నాతో సాక్షి అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ ‘ఐటమ్ అచ్ఛా హై’...... ► హాయ్ తమన్నా.. పదేళ్లుగా నటిస్తున్నప్పటికీ.. ఇంకా తనివి తీరినట్లు లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ, బిజీ బిజీగా ఉంటున్నారు? అదేంటండీ.. నేను ఎక్కువ సినిమాల్లో నటించడం మీకిష్టం లేదా? వద్దంటే చెప్పండి.. మానేయడానికి ప్రయత్నిస్తా (నవ్వుతూ..). అప్పుడు నా అభిమానులు ఊరుకోరు. ప్లస్ నేనూ అంత త్వరగా సినిమాలు వదులుకోలేను. మీకో విషయం చెప్పనా? లవ్‌లో పడ్డాను. ► ఇంత సూటిగా చెప్పారంటే.. ప్రొఫెషన్తోనే లవ్‌లో పడి ఉంటారు... కరెక్ట్‌గా గెస్ చేశారు. ‘యస్.. ఐయామ్ ఇన్ లవ్ విత్ మై ప్రొఫెషన్’. ఇక వేరే దేని గురించీ ఆలోచన లేదు. సినిమాలు.. సినిమాలు... సినిమాలు... అంతే. ► అవునూ! అంతకు ముందు ఎప్పుడూ మీతో పాటు మీ అమ్మగారు తోడుగా వచ్చేవారు. ఈ మధ్య ఎక్కడా కనిపించడంలేదేంటి? తెలుగులో మొదటి సినిమా ‘శ్రీ’లో నటించినప్పుడు నా వయసు 15. అప్పుడు నాకు తెలుగు రాదు.. హైదరాబాద్‌లో ఎవరూ తెలీదు. ఊరి కాని ఊరిలో.. భాష కాని భాషలో.. పదిహేనేళ్ల అమ్మాయి సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే, నాకు తోడుగా నాతో పాటు అమ్మ హైదరాబాద్ వచ్చింది. నేనిక్కడ అలవాటయ్యే వరకూ నన్ను అంటిపెట్టుకునే ఉంది. నాకు ఏ టెన్షన్స్ లేకుండా చూసుకుంది. ఏడెనిమిదేళ్లు నాతో పాటే షూటింగ్స్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు నా వయసు 26 ఏళ్లు. కొంచెం పెద్దమ్మాయిని అయ్యాను కదా! ఇంకా అమ్మ హెల్ప్ కోరుకోవడం భావ్యం కాదనిపించింది. అమ్మ కూడా ఇప్పుడు ఇంటి పట్టున ఉండి నాన్న బాగోగులు చూసుకోవాలను కుంటోంది. ఆమె ఆలోచనలో న్యాయం ఉంది. అందుకే ఓకే అనేశా. ► హీరోయిన్గా ఈ పదేళ్ల కెరీర్లో వచ్చిన సినిమాలను కాదనకుండా చేశారు. ఇప్పుడు మీకు నచ్చిన సినిమాలు, క్యారెక్టర్లు ఎంపిక చేసుకునే స్టేజిలో ఉన్నారని అనుకుంటున్నారా? యస్... ఉన్నాను. (రెండు సెకన్లు ఆలోచించి) మనసుకి ఏమాత్రం నచ్చకపోయినా, ఆ సినిమాకి ‘నో’ చెప్పే స్టేజిలోనే ఉన్నాను. అంత మాత్రాన ఇప్పటివరకూ చేస్తూ వచ్చిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ‘నో’ అంటాననుకోవద్దు. టిపికల్ ఫోర్ సాంగ్స్, మాస్ మసాలా ఫైట్స్ గట్రా ఉన్న కమర్షియల్ సినిమాలు నాకింకా ఇష్టమే. అలాంటి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఇప్పుడు వాటిని వదులుకుని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వను. ఎట్ ద సేమ్ టైమ్... ఏదో కొంచెం కొత్తగా ఉన్న క్యారెక్టర్లు, సినిమాలు చేయాలనుంది. ‘అభినేత్రి’లో నాకు అటువంటి కొత్తదనం కనిపించింది. నా క్యారెక్టర్లో రెండు షెడ్స్ ఉన్నాయి. చీర కట్టుకుని పల్లెటూరి అమ్మాయిలా కనిపించడంతో పాటు గ్లామరస్ రోల్ చేశా. ► కొత్త రకం సినిమాలు చేయకపోతే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తామని భయమా? ఆ భయం కచ్చితంగా ఉంటుంది. ఓ హీరోయిన్గా, యాక్టర్‌గా కొత్తగా చేయకపోతే ప్రేక్షకులు దూరం పెట్టేస్తారని భయం. హీరోయిన్గా ఉన్నప్పుడు కమర్షియల్ సినిమాలు చేయక తప్పదు. వాటి ద్వారా మెప్పిస్తూనే.. కొంచెం డిఫరెంట్‌గా ఉండే మూవీస్‌లో కొత్త రకం క్యారెక్టర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కెరీర్‌కి లాంగ్విటీ ఉంటుందని నా నమ్మకం. ► అయితే.. ఇప్పటివరకూ చేసిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మీకు ఎలాంటి గుర్తింపు ఉందనుకుంటున్నారు? ఐ డోంట్ నో. నాకెలాంటి ఇమేజ్ ఉందో తెలీదు గానీ... ‘బాహుబలి’ ముందు ఎవరూ అవంతిక వంటి పాత్రలో నేను నటించగలనని అనుకోలేదు. ఆరడుగుల ఎత్తున్న ప్రభాస్ పక్కన ఉండగా... నేను కత్తి కత్తి పట్టుకుని నరికేస్తుంటే వర్కౌట్ అవుతుందా? అని ఆలోచించా. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. సో, డిఫరెంట్ క్యారెక్టర్లు ఎటెంప్ట్ చేయడం ముఖ్యమని ఫీలయ్యా. మనం డిఫరెంట్‌గా చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కూడా కుదిరింది. ► నిర్భయ వంటి ఘటనలు జరిగినప్పుడు హీరోయిన్లు వేసుకునే డ్రస్సులు కారణం అంటూ కొంతమంది మీకు లింకు పెడుతున్నారు. వాళ్లకు మీ సమాధానం? ఏం చెప్పినా వాళ్ల బుద్ధి మారదు. హీరోయిన్గా నేనేం చెప్పినా పట్టించుకోరు. వేసుకునే డ్రస్సులను బట్టి అమ్మాయిలను జడ్జ్ చేయడమనేది మారాలి. మన దేశంలో అమ్మాయిలకు చాలా నిబంధనలున్నాయి. మారడానికి ఇంకా టైమ్ పడుతుంది. ► ‘బేటీ బచావో... బేటీ పడావో’కి మీరు బ్రాండ్ అంబాసిడర్... మరి మీ వంతుగా ఏం చేస్తున్నారు? మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కారణం చదువు లేకపోవడమే. ఎప్పుడైతే తమ కాళ్ల మీద నిలబడతారో అప్పుడు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అందుకే స్త్రీలు చదువుకోవాలి. గాళ్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకుంటున్నా. ►ప్రేక్షకులకు మీరెలా గుర్తుండాలనుకుంటున్నారు? ఓ మంచి యాక్టర్‌గా గుర్తుంటే బాగుంటుంది. ► అలాంటప్పుడు విద్యాబాలన్, కంగనా రనౌత్ తరహాలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యొచ్చుగా! కమర్షియల్ మూవీయా? లేడీ ఓరియెంటెడా? అని ఆలోచించడం ముఖ్యం కాదు. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడం ముఖ్యం. విద్యాబాలన్, కంగనా చేసే సినిమాలు వాళ్లకు మంచి పేరు తెస్తున్నాయి. కానీ, స్టార్ హీరో సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ వాళ్ల సినిమాలకు రావడం లేదు. ఒక్కోసారి లో బడ్జెట్లో తీసిన సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అని కాకుండా కంటెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే కలెక్షన్స్ రాబట్టడం పెద్ద కష్టం కాదు. మంచి కంటెంట్ ఉంటే అటువంటి సినిమాలు నేను కూడా చేస్తా. ► సౌత్‌లో మీ దగ్గరకి అలాంటి స్క్రిప్ట్స్ రాలేదా? వచ్చాయి. ఆ స్క్రిప్ట్స్‌లో కొన్ని చాలా బాగున్నాయి. విన్నప్పుడు బాగానే ఉంటాయి. ఎగ్జిక్యూషన్ లెవల్‌కి వచ్చేసరికి ఆ స్టాండర్డ్ రాదు. అదే పెద్ద సమస్య. స్క్రిప్ట్‌తో పాటు దర్శకుడు కూడా చాలా ముఖ్యం. అతను ఈ స్క్రిప్ట్‌ను సరిగ్గా తీయగలడా? లేదా? అనేది ఇంకా ముఖ్యం. ►తమన్నా కమర్షియల్ సినిమాలే చేస్తుంది. చాన్స్ వచ్చినా యాక్టింగ్‌కి స్కోప్ ఉన్నవి చేయడంలేదని విమర్శించేవారికి మీ సమాధానం? ఏం లేదు. ఒక్కో సినిమా చేయడానికి ఒక్కో టైమ్ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్‌లో ‘ది బెస్ట్’ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ కథలను బట్టి మారుతున్నాను. అందర్నీ పట్టించుకుంటూ, విమర్శలకు విలువ ఇస్తే పని చేయలేం. అప్పుడు నటించడం చాలా కష్టమవుతుంది. ► యాక్టర్‌గా కమర్షియల్ సినిమా లేదా పర్ఫార్మెన్స్ మూవీ ఏది శాటిస్ఫ్యాక్షన్ ఇస్తుంది? రెండూ ఉండాలండీ. అప్పుడే కెరీర్ బ్యాలెన్స్ అవుతుంది. ముందు చెప్పినట్టు కమర్షియల్, ఆర్ట్ ఫిల్మ్స్ కంటే మంచి సినిమాలు చేయడం ముఖ్యం. కొన్నిసార్లు కమర్షియల్ సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్లు లభిస్తాయి. ఇండస్ట్రీ ఇంతే. కొన్ని రోజులు బాగుంటుంది. కొన్ని రోజులు బాగోదు. ఎప్పుడూ మనకు నచ్చినవి దొరకవు. ► స్టార్ హీరోల పక్కన నటిస్తూనే కొత్త హీరోల పక్కన ఐటమ్ సాంగ్స్ చేయడానికి కారణం? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పక్కన ‘అల్లుడు శీను’లో నేను చేసిన ఐటమ్ సాంగ్ బాగుంటుంది. మంచి బీట్తో సాగే ఆ పాటకు డ్యాన్స్ చేయడం అంటే చిన్నపాటి సవాలే. అందుకే చేశాను. ‘కొత్త హీరో పక్కన తమన్నా ఐటమ్ సాంగ్ చేయడం ఏంటి?’ అని ఎవరూ కామెంట్ చేయలేదు. సాంగ్‌ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయమైన ‘జాగ్వార్’లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా బాగుంటుంది. అయినా స్పెషల్ సాంగ్స్ చేస్తే తప్పేంటి? ► ఒక్కోసారి నెగటివ్ కామెంట్స్ వచ్చే చాన్స్ ఉంది. రిస్క్ అవుతుందేమో అనిపించలేదా? సాంగ్, కొరియోగ్రఫీ బాగుంటే ఐటమ్ సాంగ్స్ చేయడంలో తప్పు లేదు. ఎవరు కొరియోగ్రఫీ చేస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓ ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు లిరిక్స్, స్టెప్స్, ట్యూన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తా. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. తెలుగులో కాజల్ అగర్వాల్, శ్రుతీహాసన్.. చేశారు. నాకు రిస్కేమీ అనిపించలేదు. ► కాజల్, శ్రుతిలు స్టార్స్‌తో ఐటమ్ సాంగ్స్ చేశారు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారనే మీరు కొత్త హీరోల పక్కన చేశారని టాక్? నేను రెమ్యునరేషన్ ఎప్పుడూ ఎక్కువే తీసుకుంటాను. ► మంచి పాత్ర, సినిమా కంటే రెమ్యునరేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు? లేదండీ. మంచి క్యారెక్టర్, రెమ్యునరేషన్.. రెండూ నాకు ముఖ్యమే. డబ్బులు లేకుండా ఎవరు పని చేస్తారు చెప్పండి? ఉదాహరణకు.. మీరు జర్నలిస్ట్‌గా చేస్తున్నారు. జీతం ఇవ్వకపోయినా శాటిస్ఫ్యాక్షన్ కోసం చేస్తారా? అసలు జీతం తీసుకోకుండా ఎవరైనా ఉద్యోగం చేస్తారా? ఒకవేళ చేస్తే వాళ్లు ఫైనాన్షియల్‌గా ఫుల్ సౌండ్ అయ్యుండాలి. అలా కాకపోయినా ‘సర్వైవల్ ప్రాబ్లమ్’ ఉండి ఉండకపోవచ్చు. రెమ్యునరేషన్ ఎక్కువని తమన్నా ఐటమ్ సాంగ్స్ చేస్తుందనేవాళ్లని నేను తప్పుపట్టడం లేదు. కానీ, ‘మనం జీతం తీసుకోకుండా పని చేస్తున్నామా?’ అని వాళ్లు తమకు తాము ఈ ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది. ►నిర్మాతగా మారుతున్నారట? ఈ జీవితంలో నేనా పని చేయను. నాకు ప్రొడక్షన్ అర్థం కాదు. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని అర్థం చేసుకుని చేయాలి. ప్రొడక్షన్ చేయాలంటే ఆ మైండ్ సెట్ మరోలా ఉండాలి. నాకా మైండ్‌సెట్ లేదు. ►హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని హాలీవుడ్, బాలీవుడ్లో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేమంటారు? వాళ్లు చెప్పింది కరెక్టే. హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. మార్కెట్ కూడా అలాగే ఉంది. సినిమా ఫ్లాపయితే హీరోయిన్ కంటే హీరోకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాయిన్‌కి రెండు వైపులా మనం చూడాలి. అయితే.. రెమ్యునరేషన్లలో డిఫరెన్స్ మరీ ఎక్కువుంది. కొంచెం తగ్గాలనేది నా అభిప్రాయం. ► సక్సెస్.. ఫెయిల్యూర్స్‌కి మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? రెండిటినీ నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. హిట్టయినా.. ఫ్లాపైనా.. మరో సినిమా చేయాలి. ఏం వచ్చినా ముందుకు వెళ్లాలి. ►‘ఐయామ్ ఇన్ లవ్ విత్ ప్రొఫెషన్’ అని మొదటి ప్రశ్నలోనే చెప్పేశారు. చివరి ప్రశ్నలో ఎవరైనా అబ్బాయితో ప్రేమలో పడే ఆలోచన ఉంటే చెప్పండి.? నా మనసుకి నచ్చినవాడు ఇంకా తారసపడలేదండి. ఒకవేళ ప్రేమలో పడితే అప్పుడు మీకు చెప్తా (నవ్వేస్తూ). - సత్య పులగం -
ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత .
-
ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత
-
ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత
చెన్నై : 300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మి పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. గాంధర్వ కన్య, సీతారాములు, కలుసుకోవాలని, బెబ్బులి, బంగారు బాబు, స్టేట్ రౌడి లాంటి చిత్రాల్లో ఆమె చేసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఐటమ్ సాంగ్స్ తో ఊపు ఊపేసిన జ్యోతిలక్ష్మి పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యారు.. చాలా కాలం పాటు మీడియా కంట పడకుండా ఉన్న జ్యోతిలక్ష్మి, తరువాత బుల్లితెరపై హుందాగా కనిపించే పాత్రల్లో నటించారు.గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆ మృతికి పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్‌సిగ్నల్?
ఇప్పటివరకూ కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కాజల్ అగర్వాల్ దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఓ నాలుగైదు చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారు. ఐటమ్ సాంగ్స్ మాత్రం చేయలేదు. ఈ ఏడాది అది కూడా చేయనున్నారని సమాచారం. రామ్‌చరణ్ సరసన ‘మగధీర’, ‘నాయక్’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాల్లో కథానాయికగా నటించిన కాజల్ ఇప్పుడు ఈ హీరోతో ప్రత్యేక గీతానికి నర్తించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధ్రువ’లో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌తో రకుల్ ప్రీత్‌సింగ్ జతకట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులోనే కాజల్ అగర్వాల్ ఒక ప్రత్యేక నృత్య గీతంలో కనిపించనున్నారని వినికిడి. ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం కాజల్ తమిళంలో ‘కవలై వేండామ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, తన తొలి చిత్రం ‘లక్ష్మీ కల్యాణం’ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరో రానా దగ్గుబాటి సరసన నటించనున్నారు. ఆ మధ్య కథానాయకుడు రానా, కాజల్ పాల్గొనగా ఫొటోషూట్ కూడా చేశారు. -
గుండె జారి గల్లంతయ్యిందే!
వెన్నెలింత వేడిగా.. ఎండ ఇంత చల్లగా... అనే పాట గురించి తెలిసే ఉంటుంది. ప్రేమలో ఫుల్‌గా మునిగిపోయి, వెంకీ, నయనతార ‘తులసి’లో పాడుకున్న పాట ఇది. ఇప్పుడు రాయ్ లక్ష్మి.. అదేనండి.. లక్ష్మీరాయ్ హాట్ హాట్ ఫొటోగ్రాఫులు చూసిన కుర్రకారు ఎండ ఏదో వెన్నెలేదో తెలియక తికమకపడిపోతున్నారు. ఆ రేంజ్లో ఉన్నాయి అమ్మడి ఫొటోలు. హిందీ చిత్రం ‘జూలీ-2’లో ఇంతకుముందు ఏ చిత్రంలోనూ కనిపించనంత హాట్‌గా కనిపించనున్నారు రాయ్ లక్ష్మి. ఆ ఫొటోలు చూసి, ఇంత హాట్‌గా కనిపిస్తే, మా గుండె జారి గల్లంతయిపోతుందని ఆమె ఫ్యాన్స్ తీపి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్లో తనకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రాయ్ లక్ష్మి. ఆ సంగతలా ఉంచితే.. ఒకవైపు కథానాయికగా నటిస్తూ, అడపా దడపా ఆమె ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ‘బలుపు’, పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాల్లో ప్రత్యేకపాటలో కనువిందు చేశారు రాయ్‌లక్ష్మి. తాజాగా లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో మెరవబోతున్నట్లు సమాచారం. ఈ పాట చిత్రానికే హైలెట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నారు. -
ఐటమ్ గర్ల్ గా రాయ్ లక్ష్మి
రాను రానంటూనే చిన్నదో అన్న పాట చందాన చేయను చేయను అంటూ మడి కట్టుకు కూర్చున్న నటి రాయ్‌లక్ష్మి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు లెగ్ షేక్ చేయడానికి సిద్ధం అయిపోయారు. అదేమిటీ ఈ భామ ఇప్పటి వరకూ ఐటమ్ సాంగ్‌లో నటించలేదా? అని మీరడగొచ్చు. ఎందుకంటే ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌లో ఆడి పాడి దుమ్మురేపారు. కాగా ఈ అమ్మడు తమిళంలో సోలో హీరోయిన్ నుంచి, డబుల్ హీరోయిన్, తళుక్కున మెరిసే ప్రాధాన్యత లేని పాత్రల్లో కూడా నటించారు. అయితే ఐటమ్ సాంగ్‌లో నటించమని చాలా అవకాశాలు వచ్చినా ససేమిరా అన్నారు. అలాంటిది తాజాగా రాఘవ లారెన్స్‌తో సింగిల్ సాంగ్‌లో ఇరగదీశారు. ఇంతకు ముందు కాంచన చిత్రంలో ఆయనకు జంటగా నటించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాయ్‌లక్ష్మి కాంచన-2లో కూడా తనకే హీరోయిన్ అవకాశం వస్తుందని ఆశించారు. అయితే అలా జరగలేదు. అలాగే ఆ తరువాత ఆమెకు సరైన హిట్ కూడా రాలేదు. అవకాశాలు కూడా అంతగా లేక పోవడంతో తెలుగులో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌కు రెడీ అన్నారు. ఇక తమిళంలో రాఘవ లారెన్స్ అడగడంతో నో అని చెప్పలేకపోయారట. వీరిద్దరి ఐటమ్ సాంగ్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న మొట్టశివ కెట్టశివ చిత్రంలో చూడబోతున్నామన్న మాట. తెలుగు చిత్రం పటాస్‌కు రీమేక్‌గా తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. సాయిరమణి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లారెన్స్‌కు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ఇకపై రాయ్‌లక్ష్మిని మరిన్ని చిత్రాలలో ఐటమ్‌గర్ల్‌గా చూసే అవకాశం ఉంటుందని భావించవచ్చంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
ఐటంసాంగ్స్కు ఇలియాన రెడీ!
-
ఐటమ్ సాంగ్‌లో శ్రుతిహాసన్
ఆర్య చిత్రంలో ఐటమ్‌సాంగ్‌కు పచ్చజెండా ఊపా రు నటి శ్రతిహాసన్. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి శ్రతిహాసన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ యమ బిజీగా ఉన్నారు. అయినా అవసరమైతే ఐటమ్‌సాంగ్‌కు రెడీ అంటున్నారు. ఈ విషయంలో చాలామందిలా తన ఇమేజ్‌కు డామేజ్ లాంటి సందేహాలకు తావివ్వకుండా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధం అంటున్న శ్రుతి గట్స్‌ను మెచ్చుకోవలసిందే. ఒక ప్రముఖ నటి నాయకిగా నటిస్తున్న చిత్రంలో మరో ప్రముఖ నటి ఐట మ్ సాంగ్‌కు ఓకే అనడానికి ఆలోచిస్తారు. అయితే శ్రుతి మాత్రం వెనుకాముందు ఆలోచించకుండా నేను రెడీ అంటున్నారు. ఆ మధ్య తెలుగు చి త్రం ఆగడులో తమన్న హీ రోయిన్. అందులో శ్రతి హాసన్ ఐటమ్ సాంగ్ ఆడి దుమ్ము దులిపేశారు. అందు కు పారితోషికం కూడా అధికంగానే పుచ్చుకున్నారనే ప్రచారం జరిగిందనుకోండి. తాజాగా మరోసారి ఐటమ్‌సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆర్య, అనుష్క జంటగా ఇరండామ్ ఉలగం చిత్రం తరువాత కలసి నటిస్తున్న ద్విభాషా చిత్రం సింగపూర్ డేస్. ఇది మలయాళంలో విజయం సాధించిన బెంగళూరు డేస్ చిత్రానికి రీమేక్. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలముడి దర్శకత్వం వహిస్తున్నారు. పీవీవీ సినిమా పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో శ్రతిహాసన్ ఐటమ్‌సాంగ్ చేయనున్నారు. -
వామ్మో ఎమీ...!
అందాల ఆరబోతలో కేక పుట్టించేందుకు ఈ తరం నాయికలు పోటీ పడుతున్నారు. కురచ దుస్తులు ధరించడంలోను, వ్యాంప్ తారల్ని మించి పోతున్నారు. నయన, తమన్న, శ్రుతి లాంటి నేటి తారలు ఐటమ్ సాంగ్స్ నర్తకీలుగా మారుతున్నారు. ఆ మధ్య నయనతార బిల్లా చిత్రంలో ఈత దుస్తుల్లో అందాలను ఆరబోసి యువత గుండెల్లో కల్లోలం రేపింది. గజిని చిత్రంలో ఓ పాటలో అందాలను ఆరబోశారు. ఆ తర్వాత గ్లామర్ విషయంలో ఆచి తూచి అడుగులు వే స్తోంది. అలాగే, తమన్న పయ్య చిత్రం, తెలుగులో రచ్చ చిత్రంలో వాన పాటలో తడిసి ముద్దై అందాలను ఆరబోసి కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టించింది. అయితే, కొంచెం గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ తమిళంలో నటించిన వీరం చిత్రంలో కాస్త సంసార పక్షంగా కనిపించింది. తాజాగా, ఆర్యతో రొమాన్స్ చేస్తున్న నూతన చిత్రంలో ఓ మోస్తారు గ్లామర్‌ను ప్రదర్శిస్తున్నట్టు తమన్న పేర్కొంది. అలాంటి తమన్నను వామ్మో అనిపించిన విషయం గురించి ఆమె చెబుతూ, ఐ చిత్రంలో నాయకీ ఎమిజాక్సన్ అందాల ఆరబోత తనను విస్మయానికి గురి చేసిందని చెప్పింది. ఆమె ధరించిన ఈత దుస్తులు, విచ్చవిలవిడిగా అందాలను ఆరబోశాయని చెప్పింది. ఇప్పటి వరకు తానే గ్లామర్ విషయంలో శ్రుతి మించామనే అపోహలో ఉన్నామని, ఎమి జాక్సన్‌ను చూసిన తర్వాత తామే పాటి అని చెప్పింది. ఎంతైనా ఇంగ్లీషు భామ కదా...అందాల ఆరబోతలో కేక పుట్టించిందన్న అభిప్రాయాన్ని తమన్న వ్యక్తం చేసింది. -
ఐటమ్ సాంగ్ ఏంటి?
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్కంటూ ప్రత్యేకంగా కొందరు భామలుండేవారు. అయితే ఇప్పుడు ఆ భామలకు దీటుగా కథానాయికలే అంగాంగ ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. ఇంతకుముందు ఈ ట్రెండ్ బాలీవుడ్లోనే ఉండేది. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ అంటూ అంతటా విస్తరించేసింది. ఇలాంటి పాటలకిప్పుడు అరకోటి వరకు ఈ ముద్దుగుమ్మలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లు శ్రుతిహాసన్, తమన్న, శ్రీయ లాంటి వారు సింగిల్ సాంగ్‌కు సై అంటున్నారు. తాజాగా జాబితాలో చెన్నై చిన్నది త్రిష చేరిందనే ప్రచారం హోరెత్తింది. నటిగా దశాబ్దం దాటిన ఈ మూడు పదుల భామ రేస్‌లో కాస్త వెనుకబడ్డారు. అయినా అవకాశాలు మాత్రం అస్సలు లేకుండా పోలేదు. లేటెస్ట్గా కన్నడ చిత్ర రంగప్రవేశం చేసిన త్రిష తెలుగు చిత్రం దూకుడు రీమేక్‌లో పునిత్ రాజ్‌కుమార్‌తో రొమాన్స్ చేశారు. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకక్కడ చిత్ర పరిశ్రమలో క్రేజ్ వచ్చేసింది. అయితే ఆ క్రే జ్ను అక్కడ దర్శక నిర్మాతలు మరో విధంగా వాడుకోవాలని చూస్తున్నారని సమాచారం. అదేనండి ఐటమ్ సాంగ్స్‌తో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. తాజాగా నాన్ఈ ఫేమ్ సుదీప్ కన్నడంలో నటిస్తున్న తాజా చిత్రంలో త్రిషకు ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఇది తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో రచితారామ్, హరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో ముంతాజ్ నటించిన ఐటమ్ సాంగ్‌ను కన్నడంలో త్రిష నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియూ ప్రచారం. ఇదే విధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలోను త్రిష సింగిల్సాంగ్కు చిందేయనున్నారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని త్రిష తల్లి ఉమ కొట్టిపారేశారు. అసలు త్రిషను ఐటమ్‌సాంగ్ చెయ్యమని తమ నెవరూ అడగలేదని ఆమె స్పష్టం చేశారు. -
ఐటమ్ సాంగ్‌లో పూర్ణ
ఐటమ్ సాంగ్స్‌పై హీరోయిన్లకున్న మోహం అంతా ఇంతా కాదు. ఇందుకు కారణం లక్షల పారితోషికంతోపాటు అంతకుమించిన ప్రచారం లభిస్తుంది. శ్రమా, సమయమూ రెండూ తక్కువే. ఇన్ని ప్రయోజనాలు ఏక కాలంలో లభిస్తుంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. శ్రుతిహాసన్, తమన్న, శ్రీయ, చార్మి ఇలా చాలా మంది కథానాయికలు ఐటమ్స్ సాంగ్స్‌కు సై అంటున్నారు. ఈ మధ్య తెలుగు చిత్రం ఆగడులో ఐటమ్ సాంగ్‌కు శ్రుతిహాసన్ 50 లక్షల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం హోరెత్తింది. తాజాగా నటి పూర్ణ కూడా సింగిల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయంరవి, త్రిష, అంజలి హీరో హీరోయిన్లుగా దర్శకుడు సురాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి అప్పాటక్కర్ అనే టైటిల్‌ను ఇటీవలే ఖరారు చేశారు. ప్రభు, రాధారవి, సూరి, కుంకి అశ్విన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అప్పాటక్కర్ చిత్రం కోసం ఈయన సంగీతబాణీలందించిన ఒక ఐటమ్‌సాంగ్‌కు పూర్ణ ఆడనుందట. ఈ పాట చిత్రీకరణ గురువారం నుంచి జరుగుతుందని యూనిట్‌వర్గాలు తెలిపాయి. -
ఐటమ్ సాంగ్స్ అంటే భక్తి గీతాలు కాదు కదా!
ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతం ఉండటం పరిపాటైపోయింది. ఈ పాటలకు నర్తించే లలనామణులు చాలా హాట్‌గా కనిపిస్తుంటారు. దానికి తోడు సాహిత్యం కూడా ద్వంద్వార్థాలతో ఉంటుంది. ఈ విషయం గురించి ఇటీవల బాలీవుడ్లో ఓ చర్చ జరిగిందట. దీని గురించి కరీనాకపూర్ స్పందిస్తూ-‘‘హాలీవుడ్ సంగతి పక్కన పెడితే మన భారతీయ సినిమాల్లో పాటలుండాల్సిందే. లేకపోతే వెలితిగా ఉంటుంది. ఏడాదికి వంద సినిమాలు రూపొందితే వాటిలో రెండు, మూడు సినిమాలు పాటల్లేకుండా ఉంటాయేమో. మిగతా అన్నింట్లోనూ ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ మధ్య ప్రత్యేక పాటల కోసమే సినిమాలకు వస్తున్నారు. ఆ పాటల్లో ద్వంద్వార్థాలు ఉంటున్నాయి. తప్పేంటి? పాటల ద్వారా వినోదం పొందడం కోసమే వస్తున్నారు కానీ.. విజ్ఞానం సంపాదించాలని రావడంలేదు. విజ్ఞానమే కావాలనుకుంటే పాఠశాలకు వెళ్లాలి. వినోదం కోసం సినిమాలకు రావాలి. అయినా ఐటమ్ సాంగ్స్ అంటే భక్తి గీతాలు కాదు కదా’’ అని చెప్పారు. ప్రత్యేక పాటలనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదని, ఎప్పుడో నలభై ఏళ్ల నుంచే ఉన్నాయని, హెలెన్లాంటి తారలు ఈ పాటల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో చెప్పక్కర్లేదని కూడా కరీనా అన్నారు. -
ఐటమ్ సాంగ్స్‌తో ప్లస్సే
ఇవాళ ఐటమ్‌సాంగ్ లేని చిత్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు ఇలాంటి పాటల కోసమే ప్రత్యేకంగా శృంగార తారలుండేవారు. అయితే ఇప్పుడా బాధ్యతను కూడా ప్రముఖ హీరోయిన్లే మోసేస్తున్నారు. నయనతార, శ్రుతిహాసన్, శ్రియ, ప్రియమణి, చార్మిలాంటి వాళ్లందరూ సింగిల్ సాంగ్‌కు ఆడేసిన వారే. దీంతో ఆయా చిత్రాలకు పిచ్చ పిచ్చగా ప్రచారం, తద్వారా ఆదాయం వచ్చింది. తాజాగా ఐటమ్‌సాంగ్ గర్ల్ లిస్టులో నటి మీనాక్షి చేరిపోయింది. కరుప్పుస్వామి గుత్తగైదార్ చిత్రం ద్వారా కరణ్‌కి జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ముంబయి బ్యూటీ మీనాక్షి. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయికి చేరలేకపోయింది. మూడేళ్లకు పైగా తమిళ తెరకు దూరమైన భామ తాజాగా మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. పస్తుతం రెండు చిత్రాల్లో హీరోయిన్‌గాను ఒక చిత్రంలో సింగిల్ సాంగ్‌కు నటిస్తోంది. దీని గురించి మీనాక్షి మాట్లాడుతూ, ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం సూదాడి చిత్రంలో పార్తీపన్‌కు జంటగా నటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్ నటించనున్నట్లు చెపింది. ఇటీవల ముంబయి వచ్చిన చిత్ర దర్శకుడు వెట్రిమారన్ సూదాడి చిత్ర కథ చెప్పి పార్తీపన్ సరసన నటించమని అడిగినట్లు తెలిపింది. పాత్ర నచ్చడంతో అంగీకరించానంది. చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చీర ధరించిన పాత్ర గ్లామరస్‌గా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభమై వచ్చే ఏడాది మధ్యలో విడుదలవుతుందని చెప్పింది. ఈ చిత్రంతోపాటు నందాకు జంటగా విళంగం చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పిం ది. ఇది నటనకు అవకాశం వున్న పాత్ర అంది. విక్రమ్ ప్రభు చిత్రంలో ఐటమ్‌సాంగ్ చేస్తున్న విషయం గురించి ప్రస్తావిం చగా అవును దర్శకుడు ఎళిల్ తన వెళ్లైక్కార దొరై చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ చేయమని అడిగాారని చెప్పిం ది. విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పరిచయ సన్నివేశంలో వచ్చే ఈ పాటకు దర్శకుడు వెంకట్‌ప్రభుతో కలసి నటించినట్లు వెల్లడించింది. హీరోయిన్గా నటిస్తూ ఐటమ్‌సాంగ్ చేస్తే ఇమేజ్‌కు భంగం వాటిల్లదా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఒక రకంగా ఐటమ్‌సాంగ్‌లో నటించడం వలన అధిక ప్రచారం జరిగి ప్లస్ అవుతుందనే అభిప్రాయాన్ని మీనాక్షి వ్యక్తం చేసింది. -
ఐడెంటిటీ వస్తుందంటే రెడీ
చిట్‌చాట్: మంచి గుర్తింపు వస్తుందంటే టాలీవుడ్‌లోనూ ఐటమ్ సాంగ్స్‌కు రెడీ అంటోంది ముంబై ముద్దుగుమ్మ జరైన్ ఖాన్. ఐటమ్‌గాళ్‌గా బాలీవుడ్లో హల్చల్ చేస్తున్న ఈ అమ్మడు నగరానికి వచ్చింది. నోవాటెల్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న జరైన్ ఖాన్ ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. ‘వీర్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా.. బ్లాక్‌బస్టర్ హిట్ ‘రెడీ(హిందీ)’లో చేసిన ‘క్యారెక్టర్ డీలా..’ ఐటమ్ సాంగ్ తనను ఎక్కడికో తీసుకెళ్లిందని, అంత మాత్రాన తాను వాటికే పరిమితం కానని చెప్పింది. మరి తమిళ్లో ఐటమ్ గాళ్‌గా తళుక్కుమన్నావుగా అంటే ‘ ఆ పాట పిచ్చపిచ్చగా నచ్చింది. అందుకే చేశాను’ అని కలరింగ్ ఇచ్చింది. టాలీవుడ్లో చాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటూనే.. ఐటమ్ సాంగైనా రెడీ.. కానీ, అది మంచి గుర్తింపు తెచ్చేదై ఉండాలని కండిషన్ పెట్టింది. ఇటీవల తరుచూ ర్యాంప్ షోల్లో మెరిసిపోతున్న జరైన్..‘ఇట్స్ నైస్. డిఫరెంట్ డిజైన్స్ కోసం వాక్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది’ అంటూ ర్యాంప్ వాక్‌పై తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది. ‘హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. సిటీని పూర్తిగా చూడలేదు. చూసినంత వరకూ చాలా బాగుంది’ అంటూ మురిసిపోయింది. కత్రినా కైఫ్‌కు దగ్గరి పోలికలున్నాయన్న కామెంట్స్‌పై స్పందిస్తూ... ‘నాకు నచ్చడం లేదు. ఎవరు చూసినా అదే ప్రస్తావన తెస్తారెందుకు? ఆమె పోలికలు ఉంటే ఏమిటట? నాకంటూ ఓ గుర్తింపు ఇవ్వండి. నాకు అదే ఇష్టం’ అంటూ మూతిబిగించింది. - ఎస్.సత్యబాబు -
‘ఐటమ్’కు అరకోటి
హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్ సంస్కృతి పెరిగిపోతోంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తమన్నా, కాజల్, ఇలా ప్రముఖ హీరోయిన్లందరూ ఐటమ్‌సాంగ్స్‌కు ఓకే అంటున్నారు. అధిక పారితోషికం ముట్టడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. తాజాగా శ్రుతిహాసన్ ఒక టాలీవుడ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు 50 లక్షలు పుచ్చుకుని యమాగా ఆడేశారని తెలిసింది. మహేష్‌బాబు, తమన్నా జంటగా నటిస్తున్న ఆగడు చిత్రంలో శ్రుతి స్పెషల్‌సాంగ్‌ను చూడవచ్చునట. తొలుత ఐటమ్‌సాంగ్‌కు ఆడదామా? వద్దా? అని సందేహించిన శృతి చివరికి రూ.50 లక్షలు డిమాండ్ చేశారట. అందుకు నిర్మాత ఓకే అనడంతో ఈ క్రేజీ నటి సింగిల్ సాంగ్ చేశారని సమాచారం. ప్రస్తుతం శ్రుతి తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి విజయ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇలా హీరోయిన్గా బిజీగా ఉంటూ మరో పక్క ఐటమ్సాంగ్స్తో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఈ ముద్దుగుమ్మ. -
కోట్లిచ్చినా నా నిర్ణయం మారదు!
విద్యాబాలన్ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక పాటల్లో నటించకూడదని చాలా బలంగా ఫిక్స్ అయ్యారు. రెండేళ్ల క్రితం ‘ఫెరారీ కీ సవారీ’ చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు. దాంతో పలువురు దర్శక, నిర్మాతలు ఆమెను ఐటమ్ సాంగ్స్ చేయమని అడుగుతున్నారట. కానీ, విద్యాకి అది ఇష్టం లేదు. ‘‘ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా నేను ప్రత్యేక పాటలు చేయను. ఎందుకంటే, వాటి ద్వారా నాకు ప్రత్యేకంగా ఆనందమేం లభించడంలేదు. ఇక, అలాంటప్పుడు ఎందుకు? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పారు. అగ్రతారలు ఐటమ్ సాంగ్స్ చేస్తే పారితోషికం భారీ ఎత్తున ఉంటుంది. అందులోనూ విద్యాబాలన్ వంటి తారలకైతే కోట్లివ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడరు. కానీ, విద్యా మనసు ఆ కోట్లకు కరగడంలేదట. విద్యా ఒక్కసారి నిర్ణయించుకుంటే.. ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. -
'ఐటెం సాంగ్స్ వల్లే అత్యాచారాలు'
పుణ్యధరిత్రిలో పడతులపై అత్యాచారాలకు అంతేలేకుండా పోతోంటే, పాశుపతాస్త్రం లాంటి కఠిన చట్టాలతో మానవ మృగాలకు కళ్లాలు వేయాల్సిన పాలకులు చేతులు ముడుచుకూర్చున్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంకలు వెతుకుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ లో ఆగకుండా జరుగుతున్న అత్యాచారాల పర్వంపై పాలకగణం చేస్తున్న వ్యాఖ్యలు వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతున్నాయి. యూపీ పాలకుడు అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికే పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ వెనుకేసుకురావడం పాలకశ్రేణుల దిగజారుడుతనాన్ని కళ్లకుగడుతోంది. ఏ ప్రభుత్వమూ అత్యాచారాల్ని నిరోధించలేదని, ఆ ఘటన జరిగిన తరువాతే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందంటూ యాదవ్ ద్వయాన్ని వెనుకేసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా.. రేప్ అనేది కొన్నిసార్లు ఒప్పవుంది, కొన్నిసార్లు తప్పువుతుదంటూ వివాదస్పద వాఖ్యలు చేశారు. అత్యాచారం అనేది ఒక సామాజిక నేరమని.. అది స్త్రీ, పురుషులపై ఆధారపడి ఉంటుందన్నారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యారానికి పాల్పడతాడని విశ్లేషించారు. మహిళలు కరాటే, జూడో లాంటి స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలని ఉచిత సలహాయిచ్చారు. సినిమాల్లోని ఐటం నెంబర్ పాటల వల్ల కూడా వతావరణం పాడవుతోందని తెగ బాధపడిపోయారు. సినిమాలు, టీవీల్లోని అంగాంగ ప్రదర్శనలు కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయన్నది మంత్రిగారి ఉవాచ. గౌర్ బాధ్యతారహిత వ్యాఖ్యలపై వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. -
ఐటెం సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్స్...
-
ఐటమ్ సాంగులా...? నో!
త్రిష హవా తగ్గినా... నటిగా ఆమెను ఇప్పటికీ అందరూ ఇష్టపడుతూనే ఉంటారు. ఎందుకంటే... ఈ తరం కథానాయికల్లో నటన పరంగా త్రిష బెస్ట్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే... తనకున్న మంచి పేరును చెడగొట్టుకోలేనని ఇటీవల ఓ సందర్భంలో కరాఖండిగా చెప్పేసింది త్రిష. వివరాల్లోకి వెళితే -‘నేను దర్శకత్వం వహిస్తున్న ‘తారై తప్పటై ్ట’ సినిమాలో ఓ ఐటమ్‌సాంగ్ ఉంది. చేస్తారా’ అని త్రిషను దర్శకుడు బాల ఇటీవల అడిగారట. దానికి త్రిష ఆలోచించకుండా ‘నో’ చెప్పేసిందట. ‘‘నాకు పరిశ్రమలో మంచి పేరుంది. దాన్ని చెడగొట్టుకోలేను. పాత్ర మంచిదైతే... సెకండ్ హీరోయిన్గా చేయడానికి కూడా నేను సిద్ధమే కానీ, ఐటమ్సాంగుల స్థాయికి మాత్రం నన్ను నేను దిగజార్చుకోలేను’’ అని నిర్మొహమాటంగా త్రిష చెప్పేసిందని తెలిసింది. గతంలో షారుక్ ఖాన్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, సూర్య ‘సింగమ్-2’ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేయమని త్రిషకు ఆఫర్లు వచ్చినా, వాటికి ఆమె ‘నో’ చెప్పేసింది. ఇప్పుడు బాల సినిమా వంతు వచ్చిందన్నమాట. ఇదిలావుంటే... ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం, కన్నడంలో ఓ చిత్రం చేస్తున్న త్రిషకు... తెలుగులో ఓ బంపర్ ఆఫర్ తలుపుతట్టిందని సమాచారం. బాలకృష్ణ కథానాయకునిగా సత్యదేవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను అడిగినట్లు తెలిసింది. త్రిష కూడా ఈ సినిమా విషయంలో సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అంటే త్వరలో బాలయ్య, త్రిషల జోడీని ప్రేక్షకులు చూడనున్నారన్నమాట. -
ఐటమ్ సాంగ్స్‌కు నో
ఐటమ్ సాంగ్స్ చేయమంటూ చాలా అవకాశాలు వస్తున్నాయంటున్నారు నటి విశాఖ సింగ్. కన్నా లడ్డు తిన్న ఆశయా అంటూ కోలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ ఉత్తరాది భామ సోమవారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. అయితే ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా సన్నిహితుల మధ్య ఆటా పాటలతో గడిపేశారట. బోలెడు గిప్టులతో స్నేహితులు తనపై వున్న ప్రేమను చాటుకున్నారని చెప్పారు. తనకు అత్యంత స్నేహితురాలు తన పుట్టిన రోజు ముందే రోజే మరణించడం చాలా బాధ కలిగించిందన్నారు. తామిద్దరం అరమరికలు లేకుండా ఒకరి సమస్యల గురించి మరొకరు చెప్పుకుని చర్చించుకునేవాళ్లం అన్నారు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో తొలి చిత్రం ‘పిడిచిరుక్కు’ చిత్రంలో నటించే అవకాశం రావడానికి తన స్నేహితురాలి తల్లే కారణం అని తెలిపారు. పస్తుతం ఒక బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ తమిళంలో నటించిన ‘వాలిభరాజా’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటిస్తున్న ‘ఒరు ఊరుల రెండు రాజా’చిత్రంలో గెస్ట్‌రోల్ చేస్తున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియా ఆనంద్ కోసమే ఈ చిత్రంలో అతిథి పాత్రకు అంగీకరించానని విశాఖసింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో పాత్ర చిన్నదైనా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇది గ్రామీణ యువతి పాత్ర అని చెప్పారు. ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో అతిథి పాత్ర పోషించడంతో ఈ తరహా పాత్ర చేయమని పలు అవకాశాలు వస్తున్నాయన్నారు. అలాగే ఐటమ్‌సాంగ్స్ అవకాశాలు బోలెడు వస్తున్నాయని వాటన్నింటిని నిరాకరించినట్లు తెలిపారు. నటనకు అవకాశం వున్న మంచి పాత్రలనే ఆశిస్తున్నట్లు విశాఖసింగ్ పేర్కొన్నారు. -
ఐటమ్... ప్లీజ్
-
హంసానందిని హీరోయిన్గా సక్సెస్ కాకపోయినా...
ఆరడుగుల అందం. పోతపోసిన విగ్రహం. చూపులోనూ, రూపులోనూ ప్రత్యేకత. కుర్రకారుని పిచ్చెక్కించే రూపం. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ... వెరసి హంసానందిని. ఆమె అసలు పేరు పూనమ్. వంశీ తన 'అనుమానాస్పదం' చిత్రంలో కథానాయకిగా పరిచయం చేసి ఆమె పేరును హంసానందినిగా మార్చారు. హీరోయిన్స్‌గా సక్సెస్ కాకపోతే తట్టాబుట్టా సర్ధుకొని ఇంటికి వెళ్లిపోవల్సిందే. గతంలో హీరోయిన్ల పరిస్థితి అలా ఉండేది. కానీ కాలం మారింది. హీరోయిన్స్‌గా సక్సెస్ కాకపోతే వారికి అవకాశాలు మరోరూపంలో తలుపు తడుతున్నాయి. ఆ విధంగా వారి కెరీర్ గ్రాఫ్ పెరిగిపోతోంది. హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయి, ఆ తరువాత అవకాశాలు రాకపోతే ఐటంసాంగ్స్ ఉండనే ఉన్నాయి. అదే ఫార్ములాని నమ్ముకుని టాప్ ఐటంగాళ్గా ఎదిగిపోతున్నారు కొందరు. హంసానందినిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేంటో ఈ ఆరడుగుల సుందరి ప్రత్యేక డ్యాన్స్‌లు చేసిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అందుకే ఐటం సాంగ్ అంటే దర్శక నిర్మాతలకు హంసానందిని గుర్తుకు వస్తోంది. అనుమానాస్సదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నాపెళ్లంట, నా ఇష్టం, టీ-సమోసా-బిస్కెట్, ఈగ, మిర్చి, భాయ్,అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించి మంచి ఊపుమీదా ఉంది. వెండితెరపై కొద్దిసేపు కనిపించినా యువతరానికి పిచ్చెక్కిస్తోంది. ‘మిర్చి’లోని ‘మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చీ లాంటి కుర్రాడే’ పాటకు హంసా డాన్స్ చేసిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. అదే జోరుతో ‘భాయ్’ చిత్రంలో నాగార్జున సరసన ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేక పాటకు కాలు కదిపింది. ఇప్పుడు హంసా ‘రుద్రమదేవి’లో ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్స్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'లెజెండ్' చిత్రంలో బాలయ్య సరసన ఈ అందాల భామ ప్రత్యేక నృత్యం చేస్తోంది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సింహ చిత్రంలో నమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చిత్రంలో నమితకు కొద్దిపాటి క్యారెక్టర్‌కు కూడా ఉంది. హంసానందిని గతంలో కనిపించిన చిత్రాలలో పాటలో మాత్రమే కాకుండా రెండు, మూడు సీన్స్‌లో కూడా కనిపించేది. సింహ సినిమాలో నమితకు బోయపాటి అటువంటి అవకాశమే ఇచ్చారు. ఇప్పుడు లెంజెండ్ చిత్రంలో కూడా హంసానందినికి అటువంటి అవకాశం ఇస్తారా? లేక ఒక్క ఐటమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితి చేస్తారా? అనేది తెలియదు. ఈ సినిమాలో ఎటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ హంసానందిని టాలీవుడ్ యంగ్ హీరోలతోనే కాకుండా, బిగ్ స్టార్స్‌తో కూడా నటించే అవకాశం కొట్టేసింది. s.nagarjuna@sakshi.com -
స్టార్ హీరోల సినిమాల్లో హంస ఐటం సాంగ్స్
-
నేను ‘ప్రత్యేక’ నటిని!
‘సినిమాకు ప్రేక్షకుడిని రప్పించే శక్తి ఉన్న ప్రత్యేక పాటలను ఐటమ్ సాంగ్స్ అంటూ చులకనగా మాట్లాడటం అన్యాయం. మేం చేసే పాటలు ఆయా సినిమాలకు అదనపు ఆదరణను పెంచుతున్నాయని ఎందుకు అనుకోకూడదు.. ప్రత్యేక పాట(ఐటమ్ సాంగ్)లపై పాజిటివ్‌గా ఆలోచిస్తే బాగుంటుంది..’ అని బాలీవుడ్ ఐటమ్ బాంబ్‌గా గుర్తింపు పొందిన నటి మల్లికా అరోరా ఖాన్ వ్యాఖ్యానించారు. ఆమె ‘ఛయ్య ఛయ్య ఛయ్య’,‘మున్నీ బద్నామ్ హుయీ’ వంటి ఐటమ్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అగ్ర హీరోయిన్లుగా వెలుగొందుతున్న కరీనా కపూర్ ఖాన్, దీపికా పడుకొనే, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ తదితరులు సైతం ఐటమ్ సాంగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించడానికి ఆమె నిరాకరించారు. ‘పరిశ్రమలో ఎవరి పని వారికుంటుంది.. టాలెంట్ ఉన్నవారిని అవకాశాలు అవే వెదుక్కుంటూ వస్తాయి.. ఏ పాటకు ఎవరు న్యాయం చేయగులుగుతారని భావిస్తారో వారికే ఆ అవకాశం దక్కుతుంది..’ అని ఆమె తెలిపారు. 2010లో విడుదలైన దబాంగ్ సినిమాలో ఆమె చేసిన ప్రత్యేక పాట ‘మున్నీ బద్నామ్ హుయీ’ అప్పట్లో చాలా పెద్ద హిట్. ప్రస్తుతం తాను టీవీ రియాలిటీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’కు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ‘ఈ రియాలిటీ షో మొదటి భాగంలో నేను సగం సీజన్ మాత్రమే పనిచేశాను. ఈసారి మాత్రం మొదటి నుంచి పనిచేస్తున్నాను. ప్రతిరోజూ 20-25 మంది పోటీదారులను పరీక్షిస్తున్నాం. అందరూ బాగా చేస్తున్నారు. పోటీదారుల్లో కొందరిని అనర్హులుగా ప్రకటించడం కష్టంగా ఉంటోంది. అయినా ఈ పని చాలా ఆసక్తిని పెంచుతోంది..’ అని అన్నారు. -
నేను ఐటమ్ గర్లా?
నేనేమీ ఐటమ్ సాంగ్స్ చేసే నటినా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిందట నటి సానా ఖాన్. ఈ భామ శింబు సరసన సిలంబాట్టం చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తరువాత తంబిక్కు ఇందవూరు, ఆయిరం విళక్కు తదితర చిత్రాల్లో నటించినా హీరోయిన్గా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. అదే విధంగా అవకాశాలు కరువవ్వడంతో తెలుగు, కన్నడం, మలయాళం చిత్ర పరిశ్రమలపై దృష్టి సారించింది. తెలుగులో కత్తి, మిస్టర్ నూకయ్య వంటి చిత్రాల్లో నటించినా అక్క డ క్రేజ్ పాదించుకోలేకపోయింది. ఆ మధ్య కై్లమాక్స్ అనే మలయాళ చిత్రంలో చేసింది. ఈ చిత్రం సానాఖాన్‌ను ఆదుకోలేదు. అయితే ఈ అమ్మడికి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకునే అవకాశం వచ్చింది. సల్మాన్‌ఖాన్ సరసన జయ్‌హో చిత్రంలో నటిస్తోంద ట. అయితే దక్షిణాదిలో ఐరన్ లెగ్ ముద్రపడటంతో తమిళ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయమని అడిగారట. దీంతో ఈ బ్యూటీ తాను ఐటమ్ గర్ల్ మాదిరి కనిపిస్తున్నానా అంటూ ఆగ్రహంతో రెచ్చిపోయిందట. తాను నటించి న హిందీ చిత్రం జయహో త్వరలో విడుదలకానుంది. ఆ తరువాత తెలుస్తుంది తన రేంజ్ ఏమిటో అంటూ దర్శక నిర్మాతలపై చిర్రు బుర్రులాడిందట. -
ఐటమ్ సాంగ్‌లో చిందులేస్తోన్న హీరోలు
-
ఐటమ్ పడాల్సిందే..!
-
ఐటమ్ సాంగ్స్‌పై సినిమాయణం