![ఐటమ్ సాంగ్స్‌కు నో](/styles/webp/s3/article_images/2017/09/2/61399400593_625x300.jpg.webp?itok=E3M2dEWa)
ఐటమ్ సాంగ్స్‌కు నో
ఐటమ్ సాంగ్స్ చేయమంటూ చాలా అవకాశాలు వస్తున్నాయంటున్నారు నటి విశాఖ సింగ్. కన్నా లడ్డు తిన్న ఆశయా అంటూ కోలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ ఉత్తరాది భామ సోమవారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. అయితే ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా సన్నిహితుల మధ్య ఆటా పాటలతో గడిపేశారట. బోలెడు గిప్టులతో స్నేహితులు తనపై వున్న ప్రేమను చాటుకున్నారని చెప్పారు. తనకు అత్యంత స్నేహితురాలు తన పుట్టిన రోజు ముందే రోజే మరణించడం చాలా బాధ కలిగించిందన్నారు. తామిద్దరం అరమరికలు లేకుండా ఒకరి సమస్యల గురించి మరొకరు చెప్పుకుని చర్చించుకునేవాళ్లం అన్నారు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో తొలి చిత్రం ‘పిడిచిరుక్కు’ చిత్రంలో నటించే అవకాశం రావడానికి తన స్నేహితురాలి తల్లే కారణం అని తెలిపారు.
పస్తుతం ఒక బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ తమిళంలో నటించిన ‘వాలిభరాజా’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఒరు ఊరుల రెండు రాజా’చిత్రంలో గెస్ట్‌రోల్ చేస్తున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియా ఆనంద్ కోసమే ఈ చిత్రంలో అతిథి పాత్రకు అంగీకరించానని విశాఖసింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో పాత్ర చిన్నదైనా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇది గ్రామీణ యువతి పాత్ర అని చెప్పారు. ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో అతిథి పాత్ర పోషించడంతో ఈ తరహా పాత్ర చేయమని పలు అవకాశాలు వస్తున్నాయన్నారు. అలాగే ఐటమ్‌సాంగ్స్ అవకాశాలు బోలెడు వస్తున్నాయని వాటన్నింటిని నిరాకరించినట్లు తెలిపారు. నటనకు అవకాశం వున్న మంచి పాత్రలనే ఆశిస్తున్నట్లు విశాఖసింగ్ పేర్కొన్నారు.